MCMC notice
-
మీడియా మానిటరింగ్‌కు రాష్ట్రస్థాయి కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభకు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా పత్రి కలు, ప్రసార మాధ్యమాల్లో వచ్చే రోజువారీ వార్తలు, ప్రకటనల సమీక్ష, చెల్లింపు వార్తలను గుర్తించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ)లు ఏర్పాటయ్యాయి. రాష్ట్రస్థాయి కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) రజత్‌కుమార్, సభ్యులుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ అదనపు డీజీ టీవీకే రెడ్డి, ఓయూ జర్నలిజం విభాగాధిపతి ప్రొఫెసర్ స్టీవెన్సన్, సీనియర్ జర్నలిస్ట్ ఎంఏ మజీద్తోపాటు కేంద్ర ఎన్నికల సంఘం నియ మించే పరిశీలకుడు ఉండనున్నారు. కమిటీ సభ్యకార్యదర్శిగా అదనపు రాష్ట్ర ఎన్నికల ప్రధా నాధికారి జ్యోతి బుద్ధప్రసాద్ నియమితులయ్యా రు. ఈ మేరకు సీఈవో రజత్‌కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా స్థాయిలో జిల్లా ఎన్నికల అధికారి/రిటర్నింగ్ అధికారి నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు జారీ చేసే ప్రచార ప్రకటనలను పరిశీలించి ఈ కమిటీలు ఆమోదం తెలపనున్నాయి. -
మంత్రి అఖిలప్రియకు ఎంసీఎంసీ నోటీసు
కర్నూలు (అగ్రికల్చర్): రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.సత్యనారాయణ గురువారం నోటీసు ఇచ్చారు. ఇటీ వల ఒక ఆంగ్ల దినపత్రికకు మంత్రి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపును కాంక్షిస్తూ మాట్లాడారు. దీన్ని గమనించిన మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) చైర్మన్ అయిన కలెక్టర్.. ఇంటర్వ్యూను ఎందుకు పెయిడ్ న్యూస్‌గా పరిగణించరాదో చెప్పాలని నోటీసులో పేర్కొ న్నారు. అలాగే నంద్యాల నియోజకవర్గంలోని లోకల్ కేబుల్ టీవీ నెట్‌వర్క్‌ల కు కూడా నోటీసులు జారీ చేశారు. నంద్యాలకు చెందిన నందికేబుల్, నంద్యాల సిటీ కేబుల్ నెట్వర్క్, ప్రజా కేబుల్ నెట్వర్క్, శిల్పా కేబుల్ నెట్ వర్క్‌లకు నోటీసులను కలెక్టర్ జారీ చేశారు. ప్రసారం చేస్తున్న కథనాలను పెయిడ్ న్యూస్‌గా ఎందుకు పరిగణించరాదో వివరణ ఇవ్వాలని కోరారు.