సాక్షి, కృష్ణా : మచిలీపట్నం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఓ శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర వివాదాస్పదంగా మారింది. జెడ్పీ కార్యాలయంలో అధికారులు ఏర్పాటు చేసిన శిలాఫలకం ధ్వంసమై ఉండటం కలకలం రేపుతోంది. మంగళవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో ప్రాగంణంలో ఉన్న కళ్యాణ మండపాన్ని పూలతో అలంకరించారు. అనంతరం అధికారులు రాత్రికి రాత్రే పాత తేదీలతో చంద్రబాబు ప్రారంభించినట్టు శిలా ఫలకాన్ని ఏర్పాటు చేశారు. అయితే.. ఉదయం వరకూ ఆ శిలాఫలకాన్ని పగలకొట్టారు దుండగులు. ప్రస్తుతం ఈ ఘటన వివాదాస్పదంగా మారడంతో పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment