అశ్లీల నృత్యాలపై పోలీసుల దాడి | Midnight the coconut Garden Pornographic Dances Police attack | Sakshi
Sakshi News home page

అశ్లీల నృత్యాలపై పోలీసుల దాడి

Published Mon, Jan 27 2014 1:45 AM | Last Updated on Tue, Sep 18 2018 8:00 PM

అశ్లీల నృత్యాలపై పోలీసుల దాడి - Sakshi

అశ్లీల నృత్యాలపై పోలీసుల దాడి

బెండమూర్లంక (అల్లవరం), న్యూస్‌లైన్ :అర్ధరాత్రి వేళ కొబ్బరి తోటల్లో నిర్వహిస్తున్న అశ్లీల నృత్యాలపై పోలీసులు దాడి చేశారు. ఐదుగురు యువతులతో పాటు నిర్వాహకుడిని అరెస్టు చేశారు. బెండమూర్లంకలోని గోదావరి రేవు సమీపంలో శనివారం అర్ధరాత్రి ఈ దాడి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బెండమూర్లంకకు చెందిన కొందరు యువకులు గుంటూరు నుంచి ఆరుగురు యువతులను తీసుకొచ్చి గోదావరి రేవు సమీపంలోని కొబ్బరితోటల్లో ఓ స్థావరం వద్ద అశ్లీల నృ త్యాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ మే రకు సమాచారం అందుకున్న ఎసై్స కె.విజయబాబు తన సిబ్బం దితో దాడి చేశారు. అశ్లీల నృత్యాలు చేస్తున్న ఐదుగురు యువతులను, ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని, పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ముఠాకు చెందిన నిర్వాహకులు సుజాత, ఆమె భర్త వెంకట్ పరారయ్యారు. 
 
గామానికి చెందిన సుమారు 15 మంది యువకులు కలిసి అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యకలాపాల కోసం గుంటూరుకు చెందిన యువతులను రూ.22 వేలకు బేరం కుదుర్చుకుని, ఓ కారులో ఇక్కడకు తీసుకొచ్చారు. కొబ్బరితోటల్లో జనరేటర్ సాయంతో లైటింగ్, డీవీడీ ప్లేయర్, సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. సినీ గీతాలకు ఆ యువతులు నగ్నంగా అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. పోలీసులు కారును, స్థానిక యువకులకు చెందిన 4 మోటార్ బైక్‌లను, జనరేటర్‌ను, సౌండ్ సిస్టం, టెంట్ సామగ్రిని స్వాధీనం చేసుకుని, పోలీసు స్టేషన్‌కు తరలించారు. తమకు వేయి రూపాయలు మాత్రమే ఇచ్చి, మిగిలిన  సొమ్మును నిర్వాహకులు తీసుకుంటారని యువతులు తెలిపారు. గ్రామంలో ఎన్నడూ లేనివిధంగా కొందరు యువకులు దురాగతాలకు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అదుపులోకి తీసుకున్న వారిని విచారణ చేసి, ఇందుకు కారకులైన వారిపై కేసులు నమోదు చేస్తామని ఎసై్స విజయబాబు తెలిపారు.
 
నిందితులు అధికార పార్టీ నేత అనుచరులు!
గ్రామానికి చెందిన అధికార పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుడు అనుచరులుగా భావిస్తున్న కొందరు యువకులు ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారని తెలిసింది. మూడు రోజులుగా వీరు వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి అళ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. అశ్లీల నృత్యాలను చూసేందుకు వచ్చిన వారివద్ద నుంచి టికెట్ రూపంలో కొంత సొమ్ము వసూలు చేసేవారని చెప్పారు. గుంటూరు నుంచి యువతులు వచ్చిన కారును ఆ నాయకుడికి చెందిన స్థావరం వద్ద ఉంచడంతో, అతడి అనుచరులే ఈ చర్యలకు పాల్పడినట్టు పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు. ఆరుగురు యువతులు, వారితో వచ్చిన ఇద్దరు వ్యక్తుల పైనా, ఇంకా యువతులను రప్పించిన బెండమూర్లంకకు చెందిన యాళ్ల ఈశ్వరరావు, యాళ్ల మామాజీ, యాళ్ల నానాజీ, భీమనాదం వీరన్నబాబు, రోళ్ల సాయిరాం, పోతు బాలాజీ, మరో ఇద్దరు పైనా కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement