Allavaram
-
కోనసీమ జిల్లా: వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు
సాక్షి, కోనసీమ జిల్లా: కోనసీమలో 200 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలోకి చేరారు. అల్లవరం మండలం కొమరగిరిపట్నం శాంతినగర్ మన్నా కాలనీకి చెందిన టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలోకి చేరారు. మంత్రి విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్, ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ పాల్గొన్నారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అల్లవరం వాసులు అన్నారు. చదవండి: జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాకు ఏపీ ప్రభుత్వం సత్కారం -
తల్లీకూతుళ్ల సజీవ దహనం కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి..
సాక్షి, కోనసీమ(అల్లవరం): తల్లీకుమార్తెల సజీవ దహనం కేసు మిస్టరీ వీడింది. మాజీ ప్రియుడ్ని తన వైపు తిప్పుకునే క్రమంలో ఓ మహిళ పన్నాగానికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తేల్చారు. అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో ఈ నెల 2వ తేది తెల్లవారుజామున సాధనాల మంగాదేవి, మేడిశెట్టి జ్యోతి సజీవదహనమైన సంగతి తెలిసిందే. అమలాపురం రూరల్ సీఐ వీరబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొమరగిరిపట్నానికి చెందిన సురేష్, జ్యోతి ప్రేమించుకుని ఈ ఏడాది ఫిబ్రవరి 10న పెళ్లి చేసుకుని గోడితిప్పలో నివసిస్తున్నారు. అంతకుముందు సురేష్‌కు నాగలక్ష్మి అనే వివాహితతో వివాహేతర సంబంధముండేది. పెళ్లయిన తర్వాత ఆమెకు దూరమవడంతో నాగలక్ష్మి ఎలాగైనా జ్యోతి సురేష్లను విడదీయాలనుకుంది. ఇందులో భాగంగా సురేష్ ఇంటి వద్ద ఆకాశరామన్న ఉత్తరాలు రాసి పడేసేది. ఇందుకు తన సవతి కుమార్తెలు సౌజన్య, దివ్య హరితలను వినియోగించుకునేది. ఆ ఉత్తరాలలో జ్యోతికి అక్రమ సంబంధం ఉన్నట్లు రాసేవారు. వాటిని చదివినా సురేష్ ఆమెతో ప్రేమగానే ఉండేవాడు. ఇలా కాదని జ్యోతిని హతమారిస్తే సురేష్ తనకు దగ్గరవుతాడని భావించింది. ఇదే సమయంలో జ్యోతి తన పుట్టింటికి వెళ్లింది. చదవండి: (తీరని శోకం: రెండు కుటుంబాలు.. నలుగురు బిడ్డలు..) ఈనెల 2వ తేదీ రాత్రి తన తల్లి సాధనాల మంగాదేవితో కలిసి పడుకుంది. ఇదే అదునుగా నాగలక్ష్మి తన సవతి కుమార్తెలిద్దరినీ ఉసి గొల్పింది. నిద్రిస్తున్న తల్లీ కూతుళ్లపై పెట్రోలు పోయాలని చెప్పింది. వారు ఇంట్లోకి వెళ్లి తల్లీకూతుళ్లపై పెట్రోలు పోసి బయటకు వచ్చి నిప్పంటించారు. కాసేపటికే మంటలు ఎగసిపడుతుండటంతో జ్యోతి తండ్రి లింగన్న మేల్కొన్నాడు. మంటలను ఆర్పేందుకు విఫలయత్నం చేశాడు. అప్పటికే మంగాదేవి, జ్యోతి సజీవ దహనమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి చురుగ్గా దర్యాప్తు చేశారు. ఈ హత్యతో సంబంధమున్న నాగలక్ష్మ, సౌజన్య, దివ్య హరితలను బుధవారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. వీరికి న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. నిందితులనురాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. దర్యాప్తులో ఎస్సై ప్రభాకరరావు, కానిస్టేబుళ్లు ధర్మరాజు, సుభాకర్, క్రైం పార్టీకి చెందిన కానిస్టేబుల్ బాలకృష్ణ, రామచంద్రరావు, జి.కృష్ణసాయి, డి.అర్జున్ కీలక భూమిక పోషించారు. చదవండి: (ఏఈ హత్య కేసు: భార్యే కుంటలో వేసి తొక్కి.. ఏమీ ఎరగనట్లు) -
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
అల్లవరం/తూర్పుగోదావరి: మండలంలోని గోడితిప్ప సెంటర్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఒకే సంస్థలో పనిచేస్తున్న వారిద్దరూ విధులు ముగించుకుని వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. స్థానికులు, గురుకుల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. గోడిలోని బాలికల గురుకుల పాఠశాలలో పరమట సుధారాణి(42), బాలుర గురుకులంలో సురేష్(47) ఔట్‌సోర్సింగ్‌పై కంప్యూటర్ ఆపరేటర్లుగా పని చేస్తున్నారు. అమలాపురం నల్లవంతన వద్ద బండివారిపేటలో వీరు ఉంటున్నారు. ఈ దంపతులకు పదమూడేళ్ల పాప ఉంది. రోజూ ఇద్దరూ మోటారుసైకిల్‌పై డ్యూటీకి వస్తుంటారు. ఈ క్రమంలో బుధవారం కూడా పాఠశాలలో విధులు ముగించుకుని బైకుపై ఇంటికి బయల్దేరారు. గోడితిప్ప సెంటర్ దాటిన తర్వాత మంగాయమ్మ ఆస్పత్రికి సమీపంలోని బెండమూర్లంక వైపు వేగంగా వచ్చిన ఆటో వీరిని ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తల్లిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. కాసేపటి తర్వాత సుధారాణి మృతి చెందగా, సురేష్‌ను 108 వాహనంలో అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరైగన చికిత్స కోసం సురేష్‌ని కిమ్స్‌కు తీసుకువెళ్లారు. అయితే, చికిత్స సమయంలో గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లిదండ్రులు మృతిచెందడంతో వారి ఏకైక కుమార్తె అనాథ అయ్యింది. కాగా ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్‌ను స్థానికులు వెంబడించి పోలీసులకు అప్పగించగా దర్యాప్తు చేపట్టారు. చదవండి: పని చేయాలని చెప్పడమే పాపమైంది.. -
పోటీ ప్రపంచంలో బీఎస్ఎన్ఎల్ డీలా
సాక్షి, అల్లవరం (తూర్పు గోదావరి): రిలయన్స్, ఎయిర్టెల్, ఐడియా టెలికం సంస్థలు సమాచార విప్లవంలో భాగంగా దూసుకుపోతుంటే ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్ ) వాటితో పోటీ పడలేక వినియోగదారులను ఆకర్షించడంలో విఫలమవుతోంది. ల్యాండ్‌లైన్, మొబైల్, ఇంటర్నెట్ సేవలను అందించడంలో ఆ సంస్థ వెనకబడింది. కేంద్ర ప్రభుత్వ విధానాలు, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ సంస్థకు వినియోగదారులు రోజు రోజుకూ గణనీయంగా తగ్గుతున్నారు. కాల్ రేట్లు ఎక్కువగా ఉండడం, సిగ్నల్స్ లేకపోవడం, నూతన సాంకేతికతను వినియోగదారులకు పరిచయం చేయకపోవడంతో బీఎస్ఎన్ఎల్ చతికిలపడింది. అమలాపురం, అల్లవరం, దేవగుప్తం, కొమరగిరిపట్నం, చల్లపల్లి, సవరప్పాలెం, పేరూరు గ్రామాల్లో బీఎస్ఎన్ఎల్ టవర్లను గ్లోబలైజేషన్ రింగ్ టవర్లుగా ఏర్పాటు చేశారు. ఈ ఏడు బీఎస్ఎన్ఎల్ టవర్ల నుంచి ల్యాండ్ లైన్, మొబైల్, ఇంటర్ నెట్ సేవలు అందిస్తున్నారు. దేవగుప్తం మినహా మిగిలిన ఆరు టవర్ల నుంచి 3జీ సేవలు అందిస్తున్నారు. దేవగుప్తంలో 2జీ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ గ్రామంలో 3జీ సేవలకు లైసెన్స్ ఉన్నా 2జీ సేవలతోనే కాలం గడుపుతున్నారు. దీనిపై వినియోగదారులు ప్రశ్నిస్తే 4జీ సేవలు ఏర్పాటు చేస్తామని అధికారులు అంటున్నారని సమాధానం దాటవేస్తున్నారు. గ్లోబలైజేషన్ రింగ్ పరిధిలో ఉన్న ఏడు టవర్లలో ఏ ఒక్క చోట విద్యుత్ సరఫరా నిలిచిపోయినా మిగిలిన ఆరు టవర్లలో మొబైల్ సిగ్నల్స్ నిలిచిపోతున్నాయి. విద్యుత్ పునరుద్ధరించేంత వరకూ సిగ్నల్స్ లేక బీఎస్ఎన్ఎల్ సేవలు నిలిచిపోతున్నాయి. అంతే కాకుండా బీఎస్ఎన్ఎల్ టవర్లపై కార్పొరేట్ సంస్థలు తమ సిగ్నల్ డిష్‌లు ఏర్పాటు చేసుకుని ఆయా గ్రామాల్లో విస్తృత సేవలు అందిస్తుంటే, బీఎస్ఎన్ఎల్ సంస్థ ఎందుకు ఇవ్వలేకపోతోందని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ సంస్థను కాపాడాలన్న ఉద్దేశంతో ఇబ్బందిగా ఉన్నా, నెట్వర్క్ లేకపోయినా ఇప్పటికీ ఈ చాలామంది ఈ నెట్ వర్కునే వినియోగిస్తున్నారు. అమలాపురం పరిధిలోని ఏడు రింగ్ టవర్లలో 4జీ సేవలపై ఎందుకు శ్రద్ధ చూపడం లేదని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. 3జీ లైసెన్సులు ఉన్న టవర్లపై 2జీ సేవలు కొనసాగించడంపై అధికారుల తీరుపై వినియోగదారులు మండిపడుతున్నారు. ఇదే కొనసాగిస్తే రానున్న రోజుల్లో బీఎస్ఎన్ఎల్ సంస్థ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సేవలకు అంతరాయం బీఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ లేక ‘మీ సేవా’ కేంద్రాల్లో వినియోగదారుల సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పుడుతోంది. బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితి, ప్రస్తుతం ప్రతి సమస్య ఇంటర్నెట్తో ముడిపడి ఉంది. నెట్వర్క్ లేక పోతే సర్వీసులు పెండింగ్‌లో ఉంటున్నాయి. – ఆర్.నాగబాబు, ‘మీ సేవా’ నిర్వాహకుడు, అల్లవరం -
199వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, అమలాపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 198వ రోజు సోమవారం పి.గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలంలో జననేత పాదయాత్ర చేశారు. రేపు (మంగళవారం) ఇదే మండలం నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం కానుంది. రేపు ఉదయం పాశర్లపూడి బాడవ నుంచి వైఎస్ జగన్ 199వ రోజు పాదయాత్ర మొదలుపెడతారు. తర్వాత అమలాపురం నియోజకవర్గం, అల్లవరం మండలంలోని బోడసకుర్రు మీదుగా దేవరలంక క్రాస్ చేరుకుని, అక్కడ నుంచి అమలాపురం మండలం పెరూరు, పెరూరుపేట వై జంక్షన్ చేరుకొని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. తర్వాత కొంకపల్లి, అమలాపురం వరకు పాదయాత్ర కొనసాగుతుందని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం అమలాపురంలో జరిగే బహిరంగ సభలో జననేత ప్రసంగిస్తారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 198వ రోజు వైఎస్ జగన్ 7.1 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2,421.3 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేశారు. కాగా, తెలంగాణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి సోమవారం వైఎస్ జగన్ కలిసి ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావం తెలిపారు. -
‘విరివిల్లుల’ కొలువు..కనువిందుకు నెలవు..
-
కౌలు రైతు ఆత్మహత్య
అల్లవరం: తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం డి.రావులపాలెం గ్రామంలో ఓ చేసుకున్నాడు. కొల్లా సత్యనారాయణ (50) బుధవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రించిన తర్వాత పొలానికి వెళ్లి పురుగుల మందు సేవించగా ప్రాణాలు కోల్పోయాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సత్యనారాయణ ఆరు ఎకరాల కౌలు భూమిలో సాగు చేస్తున్నాడు. నీటి ఎద్దడికితోడు రూ.4 లక్షల వరకు అప్పులుండడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు తెలిపారు. -
అల్లవరంలో అగ్నిప్రమాదం
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం దేవగుప్తంలో బుధవారం షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.... దేవగుప్తంలో ప్రధాన రహదారికి అనుకుని ఉన్న కరెంటువైర్లకు కొబ్బరాకులు రాసుకోవడంతో నిప్పు రవ్వలు ఎగసిపడ్డాయి. దాంతో పక్కనే ఉన్న ఇంటికి నిప్పంటుకుంది. స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే ఫైరింజన్లతో వారు వచ్చే సరికి మంటలు పక్కనే ఉన్న ఇళ్లకు వ్యాపించాయి. దీంతోమరో ఆరు పూరిగుడిసెలు దగ్ధమైనాయి. సుమారు రూ. 10 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని అంచనా. -
అశ్లీల నృత్యాలపై పోలీసుల దాడి
బెండమూర్లంక (అల్లవరం), న్యూస్‌లైన్ :అర్ధరాత్రి వేళ కొబ్బరి తోటల్లో నిర్వహిస్తున్న అశ్లీల నృత్యాలపై పోలీసులు దాడి చేశారు. ఐదుగురు యువతులతో పాటు నిర్వాహకుడిని అరెస్టు చేశారు. బెండమూర్లంకలోని గోదావరి రేవు సమీపంలో శనివారం అర్ధరాత్రి ఈ దాడి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బెండమూర్లంకకు చెందిన కొందరు యువకులు గుంటూరు నుంచి ఆరుగురు యువతులను తీసుకొచ్చి గోదావరి రేవు సమీపంలోని కొబ్బరితోటల్లో ఓ స్థావరం వద్ద అశ్లీల నృ త్యాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ మే రకు సమాచారం అందుకున్న ఎసై్స కె.విజయబాబు తన సిబ్బం దితో దాడి చేశారు. అశ్లీల నృత్యాలు చేస్తున్న ఐదుగురు యువతులను, ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని, పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ముఠాకు చెందిన నిర్వాహకులు సుజాత, ఆమె భర్త వెంకట్ పరారయ్యారు. గామానికి చెందిన సుమారు 15 మంది యువకులు కలిసి అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యకలాపాల కోసం గుంటూరుకు చెందిన యువతులను రూ.22 వేలకు బేరం కుదుర్చుకుని, ఓ కారులో ఇక్కడకు తీసుకొచ్చారు. కొబ్బరితోటల్లో జనరేటర్ సాయంతో లైటింగ్, డీవీడీ ప్లేయర్, సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. సినీ గీతాలకు ఆ యువతులు నగ్నంగా అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. పోలీసులు కారును, స్థానిక యువకులకు చెందిన 4 మోటార్ బైక్‌లను, జనరేటర్‌ను, సౌండ్ సిస్టం, టెంట్ సామగ్రిని స్వాధీనం చేసుకుని, పోలీసు స్టేషన్‌కు తరలించారు. తమకు వేయి రూపాయలు మాత్రమే ఇచ్చి, మిగిలిన సొమ్మును నిర్వాహకులు తీసుకుంటారని యువతులు తెలిపారు. గ్రామంలో ఎన్నడూ లేనివిధంగా కొందరు యువకులు దురాగతాలకు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అదుపులోకి తీసుకున్న వారిని విచారణ చేసి, ఇందుకు కారకులైన వారిపై కేసులు నమోదు చేస్తామని ఎసై్స విజయబాబు తెలిపారు. నిందితులు అధికార పార్టీ నేత అనుచరులు! గ్రామానికి చెందిన అధికార పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుడు అనుచరులుగా భావిస్తున్న కొందరు యువకులు ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారని తెలిసింది. మూడు రోజులుగా వీరు వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి అళ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. అశ్లీల నృత్యాలను చూసేందుకు వచ్చిన వారివద్ద నుంచి టికెట్ రూపంలో కొంత సొమ్ము వసూలు చేసేవారని చెప్పారు. గుంటూరు నుంచి యువతులు వచ్చిన కారును ఆ నాయకుడికి చెందిన స్థావరం వద్ద ఉంచడంతో, అతడి అనుచరులే ఈ చర్యలకు పాల్పడినట్టు పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు. ఆరుగురు యువతులు, వారితో వచ్చిన ఇద్దరు వ్యక్తుల పైనా, ఇంకా యువతులను రప్పించిన బెండమూర్లంకకు చెందిన యాళ్ల ఈశ్వరరావు, యాళ్ల మామాజీ, యాళ్ల నానాజీ, భీమనాదం వీరన్నబాబు, రోళ్ల సాయిరాం, పోతు బాలాజీ, మరో ఇద్దరు పైనా కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.