ఎన్నికల హామీలు నెరవేరుస్తాం | Minister ganta srinivasa Rao about Election promises | Sakshi
Sakshi News home page

ఎన్నికల హామీలు నెరవేరుస్తాం

Published Fri, May 15 2015 4:56 AM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM

Minister ganta srinivasa Rao about Election promises

మంత్రి గంటా శ్రీనివాసరావు     
 పెనుకొండ : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సోమందేపల్లి గ్రామంలో లక్షలాది రూపాయలతో నిర్మించిన కస్తూర్భా గాంధీ బాలికల ఉన్నత పాఠశాల, స్త్రీ శక్తి భవన్, ఉర్దూ పాఠశాల, వాణిజ్య సముదాయాలను ఆయన మంత్రి పరిటాల సునీతతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన సభలో మంత్రి గంటా మాట్లాడుతూ రైతులు, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి  ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

సోమందేపల్లి, పెనుకొండ ప్రాంతాలలో పాలిటెక్నిక్ కళాశాలతో పాటు సోమందేపల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మించి విద్యార్థులకు బాసటగా నిలుస్తామన్నారు. ఎమ్మెల్యే  పార్థసారథి, మంత్రి పరిటాల సునీత, ప్రభుత్వ చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు ప్రసంగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement