పేషెంట్ బంధువుతో మాట్లాడుతున్న మంత్రి రామన్న
ఆదిలాబాద్: రాష్ట్ర అటవీ, బీసీ శాఖ మంత్రి జోగు రామన్న సోమవారం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సుమారు గంటపాటు ఆస్పత్రిలోని అన్ని వార్డులను తిరుగుతూ పరిశీలించారు. రోగులు, వారి బంధువులతో మాట్లాడి వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. పారిశుధ్య నిర్వహణ తీరు సరిగా లేదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వార్డుల్లో అపరిశుభ్రత లేకుండా చూడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రిమ్స్ అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు.
నిరుపేదలకు వైద్యసేవలు అందించేందుకు అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. గతంలో వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే వారని, ఇప్పుడు ఆ బాధ తప్పిందన్నారు. ఆస్పత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించాలని, వైద్యసేవలపై నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మనీశ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment