
అటవీశాఖాధికారులకు స్కూటీల పంపిణీ
ఆదిలాబాద్ (మంచిర్యాల) : ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండల కేంద్రంలో శుక్రవారం తెలంగాణ అటవీశాఖా మంత్రి జోగురామన్న.. అటవీ శాఖాధికారులకు స్కూటీలు పంపిణీ చేశారు. మంచిర్యాల, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, జన్నారం డివిజన్లకు చెందిన అధికారులకు స్కూటీలను అందజేశారు. ఈ నాలుగు డివిజన్ల పరిధిలో 281 బైకులు మంజూరు అయినట్లు మంత్రి తెలిపారు. ఈ రోజు 20 స్కూటీలు పంపిణీ చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.