'సాక్షి' చలివేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి | Sakshi supplies drinking water | Sakshi
Sakshi News home page

'సాక్షి' చలివేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

Published Sun, Apr 24 2016 7:32 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Sakshi supplies drinking water

ఆదిలాబాద్ టౌన్ : వేసవిలో ప్రజల దప్పిక తీర్చేందుకు 'సాక్షి' ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సాక్షి చేస్తున్న సామాజిక కృషి అభినందనీయమని అన్నారు. వివిధ పనులపై జిల్లా కేంద్రానికి వచ్చేవారికి వేసవిలో దప్పిక తీర్చడం సమాజసేవ చేయడమేనని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని పేర్కొన్నారు.

మంచిర్యాలలోని బస్టాండ్ ఎదుట ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా, ఆదిలాబాద్ ఆర్టీసీ డీపో మేనేజర్ సాయన్న, టీఆర్‌ఎస్ నాయకులు జనగం సంతోష్, జహిర్ రంజానీ, సిరాజ్‌ఖాద్రి, కలాల శ్రీనివాస్, అక్షయ ఫౌండేషన్ చైర్మన్ కె. భూపతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement