సాక్షి, అమరావతి : ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధుల తీరుపై వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. గత సమావేశంలో ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో జరిపిన చర్చలు కొలిక్కి రాకపోవటంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మరోసారి సమావేశమయ్యారు. గురువారం జరిగిన సమావేశంలో మంత్రి కన్నబాబు, ఉద్యానవన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి, వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, ఆయిల్ ఫెడ్ ఎండి శ్రీకాంతనాథ రెడ్డి పాల్గొన్నారు. సమీప రాష్ట్రాల్లో మాదిరిగానే ఓ.ఈ.ఆర్ రేటు నిర్ణయం జరగాలని, ఆయిల్ కంపెనీలు రైతుల సమస్యల పరిష్కారం కోసం సానుకూల ధరను నిర్ణయించాలని మంత్రి కన్నబాబు కోరారు. ( 'క్లియరెన్స్ రాగానే భక్తులను అనుమతిస్తాం' )
ఓ.ఈ.ఆర్ ధర పెంచుతూ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయటంపై ఆయన మండిపడ్డారు. ఆయిల్ పామ్ రైతుల ఉత్పాదక ఖర్చులు, కంపెనీల కొనుగోలు, తదుపరి ఖర్చులను మంత్రి క్షుణ్నంగా పరిశీలించారు. చివరిగా 17.5 ఓ.ఈ.ఆర్ రేటును ఇచ్చేందుకు ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులు కష్టంగా ఒప్పుకున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటిస్తామని మంత్రి కన్నబాబు చెప్పారు. ( ‘రైతు భరోసా కేంద్రాలను పటిష్టం చేస్తాం’ )
Comments
Please login to add a commentAdd a comment