జాయింట్ కలెక్టర్ పై మంత్రి నారాయణ ఆగ్రహం
నెల్లూరు: జిల్లా జాయింట్ కలెక్టర్ రేఖారాణిపై మంత్రి పి. నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బందిని అనుమతించకపోవడంతో మంత్రి నారాయణ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కేవలం మంత్రి నారాయణ కారును అనుమతిస్తామన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏకపక్షంగా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నారాయణ హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ హద్దు మీరి ప్రవర్తిస్తున్నారంటూ మంత్రి నారాయణ మండిపడినట్టు తెలుస్తోంది.