
సాక్షి, గుంటూరు : ఎనిమిదేళ్ల బాలుడిపై ముగ్గురు మైనర్ బాలురు లైంగిక దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై లాలాపేట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఎస్‌హెచ్‌వో మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లచెరువుకు చెందిన బాలుడు ఈ నెల 2వ తేదీన ఇంటి బయట ఆడుకుంటుండగా పరిచయస్తులైన 14 నుంచి 17 సంవత్సరాలు ఉండే మరో ముగ్గురు స్నేహంగా మెలిగారు. ఆడుకుందామని చెప్పి కాలనీలోని చివరి లైనులోకి తీసుకెళ్లారు. నిర్మాణంలో ఉన్న భవనంలోకి తీసుకెళ్ళి లైంగిక దాడి చేశారు. పెద్ద వాళ్లకు చెప్పొద్దంటూ బాలుడిని బెదిరించారు. బాలుడు శుక్రవారం అస్వస్థతకు గురయ్యాడు. తల్లిదండ్రులు ఆరా తీయగా.. విషయం తెలిసింది. దీంతో పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment