కర్నూలు : తాగిన సిగరెట్టు పీక నిర్లక్ష్యంగా పడవేయడంతో నిప్పంటుకుని రెండు గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ సంఘటన కర్నూలు జిల్లా కర్నూలు రూరల్ మండలంలోని ఉల్చాల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో సుమారు రూ.30 వేల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.