
ఎమ్మెల్యే మణిగాంధీని నిలదీస్తున్న పసుపల గ్రామ మహిళ
కర్నూలు సీక్యాంప్ : ‘గ్రామంలో సమస్యలు చాలా ఉన్నాయి. ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు. ఎన్నికలు దగ్గరకొస్తున్నాయని గ్రామదర్శిని అంటూ మా దగ్గరకు వచ్చారు. మా సమస్యల సంగతేంటి’ అంటూ పసుపల గ్రామస్తులు ఎమ్మెల్యే మణిగాంధీని నిలదీశారు. బుధవారం పసుపలలో గ్రామ దర్శిని గ్రామ వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10గంటలకు గ్రామానికి చేరుకొని గ్రామంలో తిరుగుతున్న తెలుగుదేశం నాయకులను మహిళలు అడుగడుగున నిలదీశారు.
తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదని, నాలుగేళ్ల తర్వాత గ్రామాల్లోకి వస్తే ఫలితం ఏంటని ప్రజలు నిలదీశారు. మీకు డ్వాక్రా రుణాలు, రైతు రుణాలు మాఫీ అయ్యాయి కదా అని టీడీపీ నేతలు అడగ్గా మా గ్రామంలో ఎవ్వరికి కాలేదని ప్రజలు బదులిచ్చారు. దీంతో చేసేదేమీ లేక తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యే మణిగాంధీ అక్కడి నుంచి వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment