grama darshini
-
‘గ్రామదర్శిని’ ప్రారంభించిన సీఎం
సాక్షి, మచిలీపట్నం: గ్రామాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామదర్శిని కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం కృష్ణా జిల్లా పెడనలో లాంఛనంగా ప్రారంభించారు. పల్లెల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా గ్రామదర్శిని కార్యక్రమాన్ని రూపొందించినట్లు కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. వారంలో ఒకరోజు ఎంపిక చేసిన గ్రామాల్లో అధికారులు పర్యటించి సమస్యలను నిర్దిష్ట కాల వ్యవధిలో పరిష్కరించనున్నారు. పెడనకు పండుగ జగనన్న రాకతో పెడన నియోజకవర్గానికి ఈ రోజు పండుగ వచ్చింది. మాది పేదలుండే తీర ప్రాంత నియోజకవర్గం. చినగొల్లపాలెంలో వంతెన కడతామంటే ఎవరూ నమ్మలేదు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రెండు బ్రిడ్జిలు కట్టించటమే కాకుండా మెగా వాటర్ స్కీంతో దాహార్తిని తీర్చారు. వైఎస్సార్ హయాంలో రెండు పంటలకు నీరిస్తే చంద్రబాబు ఒక పంటకు కూడా ఇవ్వలేకపోయారు. – జోగి రమేష్, గృహ నిర్మాణశాఖ మంత్రి మల్లన్నకు పాగా.. అమ్మవారికి చీర 15 ఏళ్లుగా చేనేత వృత్తిలో ఉన్నా. శ్రీశైలం మల్లిఖార్జునస్వామికి పాగా నేసి స్వయంగా అందజేస్తాం. అమ్మవారి ఉత్సవాలకు కూడా మా నేతన్న చీరలే అందచేస్తాం. నేతన్న నేస్తమే కాకుండా అమ్మఒడి, సున్నావడ్డీ కూడా అందాయి. – సజ్జా కుమారి, లబ్ధిదారు, బ్రహ్మపురం, పెడన రూ.100 కోట్లు వ్యాపారం లక్ష్యం నేతన్నలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పాదయాత్ర హామీకి కట్టుబడి సీఎం జగన్ నేతన్నలను ఆదుకుంటున్నారు. ఈ– కామర్స్, ఆప్కో ద్వారా ఈ ఆర్థ్ధిక సంవత్సరంలో రూ.100 కోట్లు వ్యాపారం చేయాలని లక్ష్యంగా నిర్ణయించాం. – గుడివాడ అమర్నాథ్, చేనేత, జౌళి, పరిశ్రమలశాఖ మంత్రి మగ్గాన్ని ఆధునికీకరించుకున్నా 20 ఏళ్లుగా చేనేత వృత్తిలో ఉన్నా. నేతన్న నేస్తం డబ్బులతో గోతిలో ఉన్న మగ్గాన్ని స్టాండ్ మగ్గంగా మార్చుకోవటమే కాకుండా మరింత ఆధునికీకరించుకున్నా. నాకు ఇద్దరు పిల్లలున్నారు. అమ్మఒడి, విద్యా కానుక కిట్లు అందాయి. ఇంగ్లీష్ మీడియం విద్యతో మా పిల్లలకు ఎంతో మేలు చేస్తున్నారు. – కొసనం వాసు, లబ్ధిదారు, పోలవరం, గూడూరు మండలం -
ఖాళీ కుర్చీలకు.. బాబు ప్రజాస్వామ్య ముచ్చట్లు
సాక్షి, ఒంగోలు: మాట్లాడితే దేశంలో అత్యంత సీనియర్ నేతనని చెప్పుకొనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సభలో మైక్ తీసుకొంటే చాలు అడ్డూ అదుపు లేకుండా ప్రసంగిస్తారు. రోటీన్‌గా సాగే ఆయన ప్రసంగం సభికులకు నచ్చకపోయినా.. వారికి అర్థం కాకపోయినా.. ఆయన ధోరణిలో మాత్రం మార్పు ఉండదు. సభలో ప్రజలు ఉన్నారో.. వెళ్లిపోతున్నారా? అన్నది కూడా పట్టించుకోకుండా ఆయన ప్రసంగపాఠంలో మునిగిపోతారు. తాజాగా ఒంగోలు జిల్లా పర్యటనలో భాగంగా మార్టూరులో జరిగిన గ్రామదర్శిని సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఇక్కడ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు కానీ.. ప్రజలు మాత్రం హాజరుకాలేదు. సభకు చంద్రబాబు ఆలస్యంగా రావడం సభలో చాలావరకు ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో కొద్దిమంది మాత్రమే సభలో ఉన్నారు. అయినా చంద్రబాబు యథారీతిలో తనకు తెలిసిన ప్రజాస్యామ్య పాఠాలు వల్లే వేశారు. ఒకవైపు పెద్దసంఖ్యలో ఉన్న ఖాళీ కుర్చీలు ఉన్నా.. చంద్రబాబు తనదైన ధోరణిలో ప్రసంగించుకుంటూ పోయారు. ఈ సభకు సంబంధించి ఖాళీ కుర్చీలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తున్న వీడియోను స్థానిక యువకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. -
ఖాళీ కుర్చీలకు.. బాబు ప్రజాస్వామ్య ముచ్చట్లు
-
సీఎం సారూ.. నాకు మావోలతో ముప్పుంది
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘సార్.. ! నాకు మావోయిస్టులతో థ్రెట్ (ముప్పు) ఉంది. ఏవోబీలో వారి ప్రభావం ఎక్కువగా ఉంది. నా నియోజకవర్గంలోని గ్రామాలన్నీ మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్నాయి. ‘గ్రామదర్శిని’కి వెళ్లలేను సారూ... ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామాలకు వెళ్లడం ఇబ్బందికరమే. మమ్మల్ని మినహాయించండి సార్....!’ సీఎం చంద్రబాబుకు మావోయిస్టుల చేతిలో బలైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు వేడుకోలు ఇదీ. మినహాయించాలంటూ అభ్యర్థన... గ్రామదర్శిని కార్యక్రమం నుంచి తన నియోజకవర్గాన్ని మినహాయించాలంటూ గత నెలలో జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు వేడుకున్నారు. అయితే ‘అలాంటిదేమీ కుదరదు.. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలు ప్రతి గ్రామానికీ వెళ్లాల్సిందే. గ్రామ కార్యదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందేనని సీఎం చెప్పటంతో కిడారి చేసేదేమీ లేక భయంభయంగానే మారుమూల ప్రాంతానికి వెళ్లి మావోయిస్టుల చేతిలో మృత్యువాత పడ్డారు. ఎంత మొత్తుకున్నా వినలేదు... కిడారి అభ్యర్థనను ముఖ్యమంత్రి మన్నించి ఉంటే ఇప్పుడిలా మావోయిస్టుల తూటాలకు బలయ్యే పరిస్థితి వచ్చేది కాదని ఆయన అనుచరులు వాపోతున్నారు. ‘ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రతి గ్రామానికీ వెళ్లాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారు. కిడారి ఎంత మొత్తుకున్నా వినలేదని విశాఖ జిల్లాకు చెందిన ఓ సీనియర్ టీడీపీ నేత పేర్కొన్నారు. ఆ లేఖ నిజమేనా...? ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు గ్రామదర్శినికి కార్యక్రమానికి వెళ్తున్నట్లు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. పైగా మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్నందున పోలీసుల అనుమతి లేకుండా ఎక్కడికీ వెళ్లొద్దంటూ ఈనెల 21న ఎమ్మెల్యేకు అరకు పోలీస్‌స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్ఐ) లిఖిత పూర్వకంగా నోటీసు జారీ చేసినట్లు పేర్కొంటున్నారు. అయితే కిడారి పీఏ అప్పారావు ఆదివారం ఘటనా స్థలం వద్ద ‘సాక్షి’తో మాట్లాడుతూ ఎమ్మెల్యేకు పోలీసులు నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఘటనా స్థలంలో అరకు సీఐ వెంకునాయుడు మాట్లాడుతూ నోటీసు ఇచ్చిందీ లేనిదీ తనకు తెలియదని చెప్పారు. కానీ ఎమ్మెల్యే తమ మాటను పట్టించుకోకుండా, తమకు చెప్పకుండా వెళ్లారని పోలీసువర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఎమ్మెల్యే చెప్పకపోయినా ప్రాణహాని ఉన్నందున ఆయన కదలికలపై నిఘా ఉంచాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. -
ఎన్నికలొస్తున్నాయనే ఈ సమావేశాలు
-
కృష్ణాజిల్లా వాళ్లకి కొవ్వు ఎక్కువ: చంద్రబాబు
సాక్షి, తిరువూరు: ‘నేను 24 గంటలూ మీకోసం కష్టపడుతున్నాను. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడపడానికి కృషిచేస్తున్నాను. కేంద్రం సహకరించకున్నా ఉన్నంతలో అభివృద్ధి చేస్తున్నాను. ఇంకా మీ సమస్యలుంటే పరిష్కరిద్దామని, ప్రభుత్వ పథకాల అమలులో లోపాలు తెలుసుకుందామని ఫోన్లు చేస్తే ఎవరూ స్పందించట్లేదు. నా ఫోన్ కాల్స్‌కి 30 శాతం మంది మాత్రమే స్పందించి బదులిస్తున్నారు’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలపై అసహనం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలంలోని తాతకుంట్ల గ్రామంలో శుక్రవారం గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష జరిపారు. ప్రతి వారిచేతిలో సెల్‌ఫోను ఉన్నా దానిని వినియోగించడంలో శ్రద్ధ చూపట్లేదని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటేనే ప్రగతి సాధ్యమని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ఇంటింటికీ కుళాయిలు మంజూరు చేస్తామని, ప్రతి ఇంట్లో చెత్తసేకరణను డిజిటలైజేషన్ చేసి స్వయంగా తాను పర్యవేక్షిస్తానన్నారు. ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి డిజిటల్ లాకర్లో భద్రపరుస్తామని, అధిక బరువున్న విద్యార్థులకు త్వరలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్ లక్ష్మీకాంతంకు సూచించారు. కృష్ణాజిల్లా వాళ్లకి కొవ్వు ఎక్కువ.. రాయలసీమలో పౌష్టికాహారలోపంతో ప్రజలు బాధపడుతుంటే కృష్ణాజిల్లాలో అధిక బరువుతో, కొవ్వు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇందుకు తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసే నిదర్శనమని సీఎం చెణుకులు విసిరారు. విద్యార్థుల్లో పోషక విలువలు పెంచడానికి ‘బాలసంజీవని’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో మేము సైతం కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు, మహిళలకు సజ్జ లడ్డూల పంపిణీతో సత్ఫలితాలు వస్తున్నాయని, ఇందుకు జిల్లా కలెక్టర్‌ను అభినందిస్తున్నానన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నానీ, మంత్రులు దేవినేని ఉమమహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, మార్క్‌ఫెడ్ చైర్మన్ కంచి రామారావు, ఎస్సీ కమిషన్ సభ్యురాలు నల్లగట్ల సుధారాణి, మాజీ ఎమ్మెల్యేలు స్వామిదాసు, బాలవర్థనరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, కలెక్టర్ లక్ష్మీ కాంతం, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ సత్యనారాయణ, ఎస్సీ త్రిపాఠీ పాల్గొన్నారు. ‘2024లో మళ్లీ వస్తా’ తాతకుంట్ల(విస్సన్నపేట): ‘మీ ఊరు స్మార్ట్ విలేజ్‌గా అభివృద్ధి చెందాలి.. మళ్లీ 2024లో వస్తా అప్పటికి ఈ ఊరి స్వరూపమే మారిపోవాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. మండలంలోని తాతకుంట్లగ్రామంలో శుక్రవారం నిర్వహించిన గ్రామదర్శిని, రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మొదటగా ఏరువాక కార్యక్రమంలో పాల్గొని, ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంటగుంటను పరిశీలించారు. అనంతరం మండలపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల పరిశీలనలో విద్యార్థులు జీఎస్టీ అంటే ఏమిటి.. దానివల్ల ఉపయోగమా, నష్టమా? అనే అంశాలపై విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం చెరువు కట్టమీద మొక్క నాటి, గ్రామంలో నిర్మించిన ఆరోగ్య ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. పక్కా గృహ లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. వ్యర్థాల నుంచి సంపద యూనిట్‌ను ప్రారంభించారు. అనంతరం గ్రామసభ, రచ్చబండ నిర్వహించారు. ఈ–అంబులెన్స్ యాప్‌ను ప్రారభించిన సీఎం గ్రామ వనాలు, గ్రామ సంతలు, గోకులాలకు శంకుస్థాపన చేశారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని శ్రీనివాస్, జిల్లాపరిషత్ చైర్పర్సన్ అనూరాధ, మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు, ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యురాలు సుధారాణి, గ్రామ నాయకుడు ఎన్టీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సీఎంను నిలదీసిన దివ్యాంగురాలు తాతకుంట్ల గ్రామదర్శిని తిరువూరు: ‘నాకు 95శాతం వైకల్యం ఉంది. డాక్టర్లు 67శాతమే ఉన్నట్లు సర్టిఫికెట్ ఇవ్వడంతో నెలకు రూ.వెయ్యి మాత్రమే పింఛన్ వస్తోంది. నేను ఏ పనీ చేయలేను, నాకు తల్లిదండ్రులు కూడా లేరు. ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జీవిస్తున్నా.. నాకు పూర్తిస్థాయి పింఛన్ ఎందుకివ్వరు’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఓ దివ్యాంగురాలు కోలేటి జ్యోతి నిలదీసింది. విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామదర్శిని, రచ్చబండ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాతకుంట్ల వచ్చిన ముఖ్యమంత్రి స్థానికుల సమస్యలు తెలుసుకునే క్రమంలో దివ్యాంగురాలు కోలేటి జ్యోతి సీఎంతో మట్లాడుతూ.. తాను తాతకుంట్ల శివారు గౌరంపాలెంలో నివసిస్తున్నానని, నా అనేవారు ఎవరూ లేరని, ఇతర దివ్యాంగులకు నెలకు రూ.15వందల పింఛన్ వస్తుంటే తనకు మాత్రం రూ.వెయ్యి ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదని వివరించింది. నాలుగేళ్ల క్రితం ఇచ్చిన మూడు చక్రాల సైకిలు కూడా పాడైపోయిందని అధికారులకు విన్నవించినా కొత్తది ఇవ్వట్లేదని వాపోయారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఆమెకు ఇకపై నెలకు రూ.15వందల పింఛన్ ఇవ్వాలని సీఎం స్థానిక అధికారులను ఆదేశించారు. రూ.50వేల ఆర్థికసాయం చెక్కును అందజేసి కొత్త మూడు చక్రాల సైకిలు కూడా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. -
పవన్ కళ్యాణ్ మాట, రూటు మార్చేశాడు
సాక్షి, కృష్ణా : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట, రూటు మార్చేశాడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. శుక్రవారం కృష్ణా జిల్లా విసన్నపేటలో ఏర్పాటు చేసిన గ్రామదర్శిని కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సింగపూర్ తరహా పరిపాలన కావాలన్నాడని, ఫాక్ట్ ఫైండింగ్ సమావేశం పెట్టి 74వేల కోట్లు కేంద్రం నుంచి రావాలన్నాడని ఎద్దేవా చేశారు. బీజేపీ మాయమాటలు చెపుతూ ప్రజలను మభ్య పెడుతోందని వ్యాఖ్యానించారు. తాను అడగకుండానే జాతీయ పార్టీలు వచ్చి అవిశ్వాసానికి మద్దతిచ్చాయన్నారు. రాష్ట్ర హక్కుల కోసం బీజేపీని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. నదులు అనుసంధానం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. ప్రధానమంత్రి తనకు మెచ్యురిటీ లేదని మాట్లాడటం సరికాదన్నారు. బీజేపీ నేతలే రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్‌పై రోజుకొక మాట మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై పాండవులు విజయం సాధించినట్లు కేంద్రంపై టీడీపీ తప్పకుండా విజయం సాధిస్తుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదంటే ఎవరూ నమ్మొద్దని పేర్కొన్న చంద్రబాబు.. ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్ధిక సంఘం చెప్పలేదన్నారు. హామీలపై ప్రజల్లో బీజేపీని దోషిగా నిలబెడతామని బాబు అన్నారు. -
రిహార్సల్ పక్కా!
తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం తాతకుంట్లలో శుక్రవారం సీఎం చంద్రబాబు నిర్వహించనున్న గ్రామదర్శినికి అధికారులు రిహార్సల్ పక్కాగా చేశారు. ఎవరు మాట్లాడాలి...ఏం మాట్లాడాలి... అనే విషయాలపై కూడా ముందుగానే శిక్షణ ఇచ్చారు. గ్రామంలో ఏ ఒక్కరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వ పనితీరు బ్రహ్మాండం.. పథకాలు ఆహో ఓహో అని చెప్పే విధంగా వందిమాగదులకు తర్ఫీదునిచ్చారు. సాక్షి, అమరావతిబ్యూరో : ‘సీఎం గారూ నమస్కారం...అయ్యా మేము సాధికార మిత్రులం.. గ్రామంలో ఇంటింటా తిరిగి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నాం... అర్హులైన వారందరికీ లబ్ధి చేకూరేలా చూస్తున్నాం... ప్రతి మహిళ చేతి వృత్తుల ద్వారా కుటుంబ పోషణ గడిచేలా తర్ఫీదు ఇస్తున్నాం’..అంటూ విస్సన్నపేట మండలం తాతకుంట్లలో శుక్రవారం నిర్వహించే గ్రామదర్శిని సభలో ప్రసంగించాలని సాధికార మిత్రలతో అధికారులు ముందుగానే రిహార్సల్స్ చేయించారు. ఒక్కో సాధికార మిత్రకు 35 కుటుంబాలను అప్పగించి పక్కా ఇళ్లు, పింఛన్లు, దీపం పథకం, మరుగుదొడ్ల నిర్మాణం, ఉపకార వేతనాలు, ఇతర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా.? ఇతరత్రా సమస్యల వివరాలను గురువారం సాయంత్రం వరకు సేకరించి అధికారులకు నివేదిక అందించారు. నెలరోజులుగా హడావుడి... జిల్లాలోని కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరుకాబోతున్నారు. నెల రోజుల కిందట గ్రామదర్శిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో హడావుడి మొదలైంది. జిల్లా యంత్రాంగం మొత్తం ఆ గ్రామంపై దృష్టి సారించింది. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయా? ఇప్పటిదాకా ఎంతమందికి అందాయి? ఇంకా ఎంత మందికి అందాల్సి ఉంది? మౌలిక సదుపాయాల కల్పన మాటేమిటి? అన్న అంశాలపై సమగ్ర నివేదికను తెప్పించుకున్నారు. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలకు ఈ పథకాలు పక్కాగా అమలయ్యాయా లేదా అన్న వివరాలను సేకరించడంతోపాటు కొత్తగా కొంత మంది జాబితాను సిద్ధం చేశారు. ఒకవేళ గ్రామదర్శినిలో ముఖ్యమంత్రి ప్రజలను అడిగినా పథకాలు భేష్‌గా అమలవుతున్నాయనేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. వ్యతిరేక గళం వినిపించకూడదు... ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా ఏ ఒక్కరూ గ్రామదర్శిని కార్యక్రమంలో వ్యవహరించరాదని జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో అధికారపార్టీకివ్యతిరేకంగా మాట్లాడేవారెవరు ఉన్నారని గుర్తించి వారిని శుక్రవారం రోజు వీలైతే మరో ప్రాంతానికి తరలించే ఏర్పాట్లను చేయడానికి సైతం అధికారులు సిద్ధమయ్యారు. ముఖ్యం గా తాతకుంట్ల తండావాసులను, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులను గ్రామదర్శిని కార్యక్రమ పరిసరాలకు కూడా రానివ్వరాదన్న నిబంధనపై గ్రామస్థులు మండిపడుతున్నారు. జేజేలు కొట్టేవారికే అక్కడ పెద్దపీట వేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాగైతే తమ సమస్యల గోడు ప్రభుత్వానికి తెలిసేదేలా అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పసుపలలో ఎమ్మెల్యే నిలదీత
కర్నూలు సీక్యాంప్ : ‘గ్రామంలో సమస్యలు చాలా ఉన్నాయి. ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు. ఎన్నికలు దగ్గరకొస్తున్నాయని గ్రామదర్శిని అంటూ మా దగ్గరకు వచ్చారు. మా సమస్యల సంగతేంటి’ అంటూ పసుపల గ్రామస్తులు ఎమ్మెల్యే మణిగాంధీని నిలదీశారు. బుధవారం పసుపలలో గ్రామ దర్శిని గ్రామ వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10గంటలకు గ్రామానికి చేరుకొని గ్రామంలో తిరుగుతున్న తెలుగుదేశం నాయకులను మహిళలు అడుగడుగున నిలదీశారు. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదని, నాలుగేళ్ల తర్వాత గ్రామాల్లోకి వస్తే ఫలితం ఏంటని ప్రజలు నిలదీశారు. మీకు డ్వాక్రా రుణాలు, రైతు రుణాలు మాఫీ అయ్యాయి కదా అని టీడీపీ నేతలు అడగ్గా మా గ్రామంలో ఎవ్వరికి కాలేదని ప్రజలు బదులిచ్చారు. దీంతో చేసేదేమీ లేక తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యే మణిగాంధీ అక్కడి నుంచి వెనుదిరిగారు. -
కుట్ర రాజకీయాలు చేస్తే వదలం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: మనోభావాలు దెబ్బ తినేలా, కుట్ర రాజకీయాలు చేస్తే వదిలే సమస్యే లేదని ప్రధాని మోదీని ఉద్దేశించి సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుధవారం అనంతపురం జిల్లా పేరూరు డ్యాంకు నీళ్లిచ్చే కార్యక్రమానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ఆయన పేరూరులో గ్రామదర్శిని నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. నాకు రాజకీయాలు నేర్పిస్తారా? ‘నాకు మెచ్యూరిటీ లేదని ప్రధాని మోదీ విమర్శిస్తున్నారు. ఆయనకేదో ఉన్నట్లు! ఎక్కడికి పోతున్నామని అడుగుతున్నా. హుందాతనాన్ని కోల్పోయే స్థితికి వచ్చారు. నేనేదో వైఎస్సార్ సీపీ ట్రాప్‌లో పడ్డానని అంటున్నారు. బీజేపీ, ఎన్డీఏనే కుడితిలో పడ్డాయి. నా తర్వాతే వీరంతా రాజకీయాల్లోకి వచ్చారు. వీరందరికంటే ముందే నేనే ముఖ్యమంత్రిని అయ్యా. నాకు రాజకీయాలు నేర్పిస్తున్నారు.మీకు అవకాశాలొచ్చాయి. కేంద్రంలో ఉన్నారు. ప్రజాహితం కోసం పనిచేయండి. నిన్న కూడా ప్రధాని విమర్శించారు. నేనేదో హైదరాబాద్‌లోని ఆస్తులు కావాలనుకుంటున్నానని. ఇది వాస్తవం కాదు. హైదరాబాద్ కంటే భిన్నంగా ప్రపంచంలోని ఐదు అగ్రనిర్మాణాలో ఒకటిగా ఉండేలా రాజధానిని అభివృద్ధి చేస్తున్నాం. నేను అన్యాయంపై పోరాడుతున్నా. పోరాడాల్సి వస్తే నా తర్వాతే ఎవరైనా. అవినీతి ప్రక్షాళన ఏమైంది? స్విస్‌బ్యాంక్‌లోని నల్లధనం వెనక్కి తెచ్చి ఒక్కో ఖాతాలో రూ.15 లక్షలు చొప్పున వేస్తామని, అవినీతిని ప్రక్షాళన చేస్తామని 2014 ఎన్నికలకు ముందు మోదీ హామీ ఇచ్చారు. కానీ ఏం చేశారు? కర్నాటక ఎన్నికల్లో నేను ఇచ్చిన పిలుపుతో బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారంటే అది తెలుగువారికి తెలుగుగడ్డపై ఉన్న ప్రేమే కారణం. జనసేన ఉందా? జనసేన ఉందా? అని అడుగుతున్నా. నిజ నిర్ధారణ కమిటీ అన్నారు. ఏం చేశారు? కేంద్రంపై అవిశ్వాసం పెట్టండి, నేను అన్ని రాష్ట్రాల ఎంపీలను సమన్వయం చేసి కలుపుతానని పవన్ చెప్పారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం నాకు తెలుసు. నాది యూటర్న్ అంటున్నారు. నాదే రైట్‌టర్న్! మీది యూటర్న్! ప్రత్యేకహోదా కచ్చితంగా సాధిస్తాం. ఇకపై వారానికి రెండు మూడురోజులు ప్రజల మధ్యలోనే ఉంటా’ అని చంద్రబాబు పేర్కొన్నారు. పేరూరుకు నీళ్లిచ్చే కాలువకు పరిటాల రవీంద్ర కాలువగా నామకరణం చేశారు. అంతకు ముందు చంద్రబాబు అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించి గ్రామస్తులను కలుసుకున్నారు. సెంట్రల్ వర్సిటీ వచ్చేదాకా వదలను! అనంతపురం జిల్లాలో పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుపై అవగాహన లేకుండా మాట్లాడారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘సెంట్రల్ యూనివర్సిటీ ఇస్తామని ఇప్పటిదాకా సహకరించలేదు. యూనివర్సిటీ వచ్చేదాకా వదిలే సమస్యే లేదు. అనంతకు సెంట్రల్ యూనివర్సిటీ వచ్చి తీరుతుందని హామీ ఇస్తున్నా’ అని ప్రసంగంలో చంద్రబాబు చెప్పారు. అయితే అనంతపురానికి సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పటికే మంజూరై జీవో కూడా వచ్చింది. ఈ ఏడాది నుంచే జేఎన్టీయూ ఇంక్యుబేషన్ సెంటర్లో తాత్కాలికంగా తరగతులు కూడా ప్రారంభం కానుండటం గమనార్హం. నాలుగేళ్లవుతున్నా రుణమాఫీ కాలేదు కనగానపల్లి: ‘నాలుగేళ్లు అవుతున్నా ఈ ప్రభుత్వంలో నాకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదు. టీడీపీ కార్యకర్తనని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది’ అని సీఎం చంద్రబాబు ఎదుట టీడీపీ కార్యకర్త ఒకరు వాపోయారు. బుధవారం పేరూరులో గ్రామదర్శిని సందర్భంగా రైతులు, మహిళలతో సీఎం ముఖాముఖి కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.ప్రభుత్వ పథకాల ద్వారా అందరినీ సంతృప్తిపరుస్తున్నామని సీఎం అంటుండగా కుందుర్పి మండలం బెస్తరపల్లికి చెందిన రామాంజనేయులు అనే రైతు లేచి అభ్యంతరం తెలిపాడు. తనకు రూపాయి కూడా రుణమాఫీ కాలేదని, టీడీపీ కార్యకర్తనని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందనడంతో సీఎం జోక్యం చేసుకుంటూ భూ రికార్డులన్నీ సక్రమంగా ఉంటే కచ్చితంగా రుణమాఫీ వర్తిస్తుందని, దీన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. – చంద్రబాబు ఎదుట టీడీపీ కార్యకర్త ఆవేదన -
ఎమ్మెల్యే ముప్పిడి నిలదీత
పశ్చిమ గోదావరి, దేవరపల్లి : టీడీపీ చేపట్టిన గ్రామదర్శిని కార్యక్రమం కృçష్ణంపాలెంలో మంగళవారం వాగ్వివాదానికి దారితీసింది. టీడీపీ ఎమ్మెల్యేపై ఆ పార్టీ కార్యకర్తలు నిరసనవ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల సమస్య గురించి అల్లూరి సీతారామరాజు కాలనీ వాసులు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును నిలదీశారు. భూమిలేనందున స్థలాలు ఇవ్వలేక పోతున్నామని, రైతులు భూమి ఇవ్వడానికి ముందుకు వస్తే చెప్పండి కొనుగోలు చేస్తామని, సమస్యలు వెంటనే పరిష్కారం కావని ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు సమాధానం ఇవ్వడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఓట్లు ఎందుకు వేయించుకున్నారని, ఒక్కొక్క ఇంటిలో నాలుగు కుటుంబాలు ఉంటూ ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడంలేదని మహిళలు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇళ్ల స్థలాలు అడిగితే కార్యకర్తలను నాయకులు దుర్భాషలాడారని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు కె.చినబాబులతో కడలి త్రిమూర్తులు, కాలనీకి చెందిన టీడీపీ కార్యకర్తలు, మహిళలు వాగ్వివాదానికి దిగారు. సుమారు గంటసేపు వివాదం జరిగింది. అనంతరం గ్రామదర్శిని కార్యక్రమాన్ని కాలనీ వాసులు బహిష్కరించారు. గ్రామంలో జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని, పార్టీ జెండాలు మోసే కార్యకర్తలకు అన్యాయం జరగుతున్నా పట్టించుకోవడంలేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హతగల పేదలకు సంక్షేమ పథకాలు అందడంలేని, అర్హతలేని అగ్రవర్ణాలకు పథకాలు అందుతున్నాయని కాలనీ వాసులు ఆరోపించారు. ఇల్లు కావాలన్నా, మరుగుదొడ్డి కావాలన్నా జన్మభూమి కమిటీ సభ్యులకు మొక్కవలసి వస్తోందని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎస్వీ నరసింహరావు, ఏఎంసీ ఛైర్మన్ ముమ్మిడి సత్యనారాయణ, ఎంపీడీఓ కె.కోటేశ్వరరావు, సర్పంచ్ కె. దుర్గాశ్రీనివాస్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కె.రవికుమార్, పలువురు నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. -
మా ఎంపీలు రాజీనామా చేయరు
సాక్షి, విశాఖపట్నం: తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేయరని, పదవులు వదులుకోరని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పార్లమెంటులోనే ఉండి పోరాటం చేస్తారని చెప్పారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయాలని వైఎస్సార్సీపీ నేతలు చేస్తున్న డిమాండ్‌పై ఆయన ఈ మేరకు స్పందించారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా మంగళవారం విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం గుడివాడలో సీఎం చంద్రబాబు పర్యటించారు. అనంతరం గ్రామ స్తులతో రచ్చబండ సమావేశాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ఉప్పలం గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రూ.1.46 లక్షల కోట్ల లోటు ఉంటుందని 14వ ఆర్థిక సంఘం లెక్కతేల్చింది. కానీ కేంద్రం ఇప్పటి దాకా రూ.22,500 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇంకా రూ.1.24 లక్షల కోట్ల లోటు ఉంది. దీనికి తోడు మొదటి సంవత్సరం రూ.16,500 కోట్ల లోటు ఉంటే రూ.4 వేల కోట్లే ఇచ్చారు’ అని సీఎం చెప్పారు. రాష్ట్రానికి హోదా ఇస్తామని ప్రధాని మోదీ గత ఎన్నికల్లో హామీ ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. హోదా ఒక్కటే కాదు.. రాజధాని నిర్మాణానికి కూడా డబ్బులిస్తామని చెప్పారన్నారు. విశాఖకు రైల్వే జోన్, కడపలో స్టీల్‌ప్లాంట్.. ఇలా అనేక హామీలిచ్చారని వివరిం చారు. కానీ వీటిలో ఒక్క హామీని కూడా మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నెరవేర్చడం లేదని మండిపడ్డారు. అందుకే ఎన్డీఏతో విబేధించి, కేంద్రం నుంచి బయటకొచ్చామని చెప్పారు. రాజధాని, పోలవరానికి నిధులివ్వాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందన్నారు. బీసీలకే మొదటి ప్రాధాన్యం! వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటామని.. వారి కోసం రూ.750 కోట్లు ఖర్చు పెట్టిఆదరణ పథకం కింద పరికరాలు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. తన మొదటి ప్రాధాన్యత బీసీలకేనని చెప్పుకొచ్చారు. అలాగే కాపులకు బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించామన్నారు. రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యంగ సవరణ చేయాల్సి ఉంటుందని.. ఇందుకోసం కేంద్రానికి సిఫార్సు చేశామన్నారు. ప్రత్యేక హోదా, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టుల్లాగానే.. రిజర్వేషన్ల అంశం కూడా కేంద్రం పరిధిలోనే ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే మీరు మాట్లాడరా? అని వైఎస్సార్సీపీని ప్రశ్నించారు. అలాగే మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చాలని కూడా కేంద్రానికి సిఫార్సు చేశామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తుంటే.. వైఎస్సార్సీపీ, జనసేన ఎన్డీయేతో లాలూచీ పడి అడుగడుగునా అడ్డుతగులుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టానని సీఎం మరోసారి చెప్పుకొచ్చారు. తాను పట్టించుకోకపోతే హైదరాబాద్‌కు ఇంత గుర్తింపు వచ్చేది కాదన్నారు. అలాగే ఏపీని కూడా అభివృద్ధి చేసి.. ప్రపంచ పటంలో నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెడతానన్నారు. కార్యక్రమంలో మంత్రులు చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ అతిపెద్ద కుంభకోణం.. సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలోకి రాకముందు జరిగిన అతిపెద్ద కుంభకోణం అగ్రిగోల్డ్ స్కామ్ అని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏపీ, తెలంగాణ సహా మొత్తం 8 రాష్ట్రాల్లో 32 లక్షల మంది బాధితులున్నారని పేర్కొన్నారు. ఒక్క ఏపీ నుంచే రూ.3,941 కోట్ల విలువైన డిపాజిట్లున్నాయని.. అందరికీ న్యాయం చేస్తానని చెప్పారు. మంగళవారం ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో జరిగిన కార్యక్రమంలో 43 మంది అగ్రిగోల్డ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అగ్రిగోల్డ్ సంస్థ నుంచి ప్రతి పైసా వసూలు చేసి, బాధితులకు అందజేస్తామన్నారు. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ఏడు ఆస్తులను వేలం వేయడానికి హైకోర్టు అనుమతిచ్చిందని తెలిపారు. వాటిలో ఒకదానికి సంబంధించి కృష్ణా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వేలంలో రూ.11 కోట్ల 11 లక్షలు వచ్చాయని చెప్పారు. మిగతా ఆరు ఆస్తులకు సంబంధించి వేలంలో పాల్గొనడానికి ఎవరూ ముందుకు రాలేదని సీఎం వివరించారు. అగ్రిగోల్డ్ బాధిత సంఘాలు కూడా ఈ కేసులో ఇంప్లీడ్ కావాలని, ప్రభుత్వం తరఫున న్యాయ సహాయం అందిస్తామన్నారు. కాగా, అగ్రిగోల్డ్ ఆస్తులు రూ.30 వేల కోట్లు ఉన్నాయని ప్రతిపక్ష నేత ఆరోపిస్తుంటే ఎందుకు ఖండించలేదని బాధిత సంఘాల నాయకులను సీఎం దబాయించారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, డీజీపీ ఠాకూర్, సీఐడీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ అమిత్ గార్గ్ మాట్లాడారు. -
సుదీర్ఘ ప్రసంగం.. విసుగెత్తిన జనం
కొవ్వూరు/కొవ్వూరు రూరల్ : సీఎం చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగానికి పశివేదల గ్రామ జనం విసుగెత్తిపోయారు. గురువారం ఉదయం 11.30 గంటలకు చంద్రబాబు గ్రామానికి వచ్చారు. గ్రామంలో పలువీధుల్లో పర్యటించి జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన గ్రామదర్శిని–గ్రామ వికాసం కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి జవహర్, స్థానిక సర్పంచ్ కాశీఅన్నపూర్ణ తప్ప వేదికపైన వేరొకరికి మాట్లాడే అవకాశం కల్పించలేదు. కొవ్వూరులోను మంత్రి జవహర్, మునిసిపల్ చైర్పర్సన్ జొన్నలగడ్డ రాధారాణి, కలెక్టర్ కాటమనేని భాస్కర్లు మాత్రమే ప్రసంగించారు. కొవ్వూరులో ఏకంగా గంటా నలభై నిమిషాలు సీఎం ప్రసంగించడంతో జనం విసుగెత్తిపోయారు. ఇక వినలేక నెమ్మదిగా జారుకున్నారు. పోలీసులు జనాన్ని నిలువరించేందుకు ప్రవేశ ద్వారాల వద్దకట్టడి చేసే ప్రయత్నాలు చేశారు. నాయకులు సైతం జనానికి సర్దిచెప్పి కూర్చోపెట్టాల్సి వచ్చింది. సీఎం తన ప్రసంగంలో ప్రభుత్వ పథకాల అమలు, వాటి ద్వారా చేకూరే లబ్ధిని వివరించడానికి ప్రాధాన్యం ఇచ్చారు. పశివేదల గ్రామానికి ప్రత్యేక వరాలేమీ ప్రకటించలేదు. మంత్రి కేఎస్ జవహర్ గ్రామంలో ఎస్సీ బాలుర సంక్షేమ గురుకుల పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ సీఎం ఏవిధమైన ప్రకటన చేయకపోవడంతో స్థానికులు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. స్థానిక సర్పంచ్ బేతిన కాశీఅన్నపూర్ణ సర్పంచ్ల పదవీ కాలం పొడిగించాలని కోరినా సీఎం ఏవిధమైన ప్రకటన చేయలేదు. పథకాల వారిగా కాల్‌సెంటర్ ద్వారా నిర్వహిస్తున్న సర్వేలో వచ్చిన మార్కులను మండల శాఖ అధికారులతో చర్చించారు. గ్రామ వికాసం పుస్తకావిష్కరణ, పవర్ ఆఫ్ పశివేదల వెబ్‌సైట్‌ను సీఎం ఆవిష్కరించారు. గ్రామ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ ఆంధ్ర పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. మంత్రి జవహర్ మాట్లాడుతూ పశివేదలలో 90 శాతం సీసీ రోడ్లు పూర్తి చేశామన్నారు. గ్రామంలో ఇంకా పది కుటుంబాలకే ఇళ్లు నిర్మించాల్సి ఉందన్నారు. అంతకు ముందు కొవ్వూరు –నందమూరు రోడ్డులోని హెలిప్యాడ్ వద్ద సీఎం చంద్రబాబుకు నాయకులు స్వాగతం పలికారు. మంత్రి కెఎస్ జవహర్, ఏఎంసీ చైర్మన్ వేగి చిన్నా, మున్సిపల్ చైర్మన్ జొన్నలగడ్డ రాధారాణి, జెడ్పీటీసీ గారపాటి శ్రీదేవి, ఎంపీపీ వాడవెల్లి రాజ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, మున్సిపల్ వైస్‌చైర్మన్ దుద్దుపూడి రాజా రమేష్, నాయకులు మద్దిపట్ల శివరామకృష్ణ, సూరపనేని చిన్ని, కంఠమణి రామకృష్ణ, బేతిన నారాయణ, యలమాటి సత్యనారాయణ తదితరులు స్వాగతం పలికారు. సీఎంకు సమస్యలపై వినతులు బూరుగుపల్లి సుబ్బారావు అనే రైతు చాగల్లు చెరకు ఫ్యాక్టరీలో రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇప్పించాలని కోరారు. ఊనగట్ల గ్రామంలో గుండాల పుంత రోడ్డు నిర్మాణం చేపట్టాలని వినతిపత్రం అందజేశారు. నందమూరుకు చెందిన గన్నమని గణేష్ అనే దివ్యాంగుడు ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ ఇప్పించాలని కోరారు. అడ్వకేట్ కొడవలి బాలాజీ వికలాంగులకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తున్నందున పదవీకాలం పొడించాలని సర్పంచ్ల ఛాంబర్ సభ్యులు సీఎంకి వినతిపత్రం అందజేశారు. కొవ్వూరు పట్టణానికి.. నగర దర్శిని–నగర వికాసం కార్యక్రమంలో భాగంగా పట్టణంలో సంస్కృత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పట్టణంలో అవుట్ పాల్ డ్రయిన్ నిర్మాణానికి నిధులు ఇస్తామన్నారు. ప్రభుత్వ డిగ్రీకళాశాల వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయిస్తామని ప్రకటించారు. అంతకు ముందు మంత్రి జవహర్ మాట్లాడారు. మునిసిపల్ చైర్పర్సన్ రాధారాణి, మంత్రి పితాని సత్యనారాయణ, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు పెండ్యాల అచ్యుత రామయ్య (అచ్చిబాబు), కలెక్టర్ భాస్కర్ పాల్గొన్నారు. -
గ్రామదర్శిని..మళ్లీ తెరపైకి
చిలుకూరు, న్యూస్‌లైన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టే పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు గ్రామదర్శనం కార్యక్రమం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో గ్రామదర్శిని పేరుతో జరిగిన కార్యక్రమాన్ని ఇప్పుడు గ్రామదర్శనంగా మార్పు చేశారు. ఈ కార్యక్రమం తిరిగి శుక్రవారం నుంచి జిల్లాలో అమలు కానున్నది. ఈ మేరకు మండల స్థాయి అధికారులకు బుధవారం జిల్లా కలెక్టర్ చిరంజీవులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత జిల్లా కలెక్టర్ ముక్తేశ్వరరావు ఈ పథకాన్ని 2012 ఫిబ్రవరిలో జిల్లాలో ప్రవేశపెటినా అశించిన స్థాయిలో అమలు కాలేదు. తిరిగి నూతనంగా వచ్చిన కలెక్టర్ చిరంజీవులు ఈ గ్రామదర్శనం పథకం పకడ్బందీగా అమలు చేసేందుకు తగు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతి మండలంలో ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. మండల పరిషత్ ప్రత్యేక అధికారి సమక్షంలో మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని అక్కడ గ్రామదర్శనం కార్యక్రమం నిర్వహించాలి. గ్రామాల్లో పథకాల పనితీరును పర్యవేక్షించడం, ఉద్యోగుల్లో జవాబుదారీ తనం పెంపొందించడం, మనంకోసం మనం కార్యక్రమం విజయవంతం చేయడం, గ్రామస్థాయి అధికారుల పనితీరును పర్యవేక్షించడం, ప్రభుత్వ పాఠశాలల పనితీరు, రహదారులు, మురుగు కాలువలు, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర పనులను పర్యవేక్షించి వాటిని సక్రమంగా అమలు చేయడమే గ్రామదర్శనం ప్రధాన ఉద్దేశ్యం. ప్రతి శుక్రవారం అమలు ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో ప్రతి శుక్రవారం అమలు చేస్తారు. కార్యక్రమానికి మండలస్థాయి అధికారుల నుండి గ్రామస్థాయి అధికారులు అందరూ హజరవుతారు. మండల పరిషత్ ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంఈవో, మండల పశువైద్యాధికారి, ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, వ్యవసాయాధికారి, అంగన్వాడీ సూపర్వైజర్, ఉపాధిహమీ ఏపీఓ, ఐకేపీ ఏపీఎం, సాక్షర భారత్ మండల కోఆర్డినేటర్, హౌసింగ్, పంచాయితీ రాజ్, విద్యుత్ ఏఈలు తదితరులు పాల్గొంటారు. వీరేకాకుండా గ్రామస్థాయి అధికారులు పాల్గొంటారు. వీరంతా గ్రామంలో ప్రభుత్వ పథకాల అమలు తీరును పర్యవేక్షించి లోపాలను సవరించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఉద్యోగులపై జవాబుదారీతనం పెరుగుతుంది.