కోవూరు, న్యూస్‌లైన్: సమైక్య రాష్ట్రం కోసం కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సోమవారం చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా నియోజకవర్గంలోని మహిళలు పెద్ద సంఖ్యలో కూర్చున్నారు. కోవూరు గ్రామదేవత నాగవరప్పమ్మ గుడి వద్ద ముందుగా ప్రసన్న పూజలు చేశారు. అక్కడి నుంచి నేరుగా దీక్షా శిబిరానికి చేరుకుని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శిబిరంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం దీక్ష ప్రారంభిం చారు.
ప్రసన్నకు సంఘీభావం తెలిపేందుకు భారీసంఖ్యలో నేతలు, ప్రజ లు తరలి వచ్చారు. సర్వేపల్లి, వెంకటగిరి, నెల్లూరుసిటీ నియోజకవర్గాల వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కొమ్మి లక్ష్మయ్యనాయుడు, పి.అనిల్‌కుమార్‌యాదవ్ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా అధ్యక్షురాలు అనిత, నాయకులు రాధాకృష్ణారెడ్డి, వినోద్‌కుమార్‌రెడ్డి, నిరంజన్‌బాబురెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రసాద్‌రెడ్డి, వేమిరెడ్డి వినిత్‌కుమార్‌రెడ్డి, మంచి శ్రీనివాసులు, అట్లూరి సుబ్రహ్మణ్యం, రూప్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
పాఠశాల విద్యార్థుల సంఘీభావం
కోవూరు జేబీఆర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సోమవారం సాయంత్రం ర్యాలీగా వచ్చి ప్రసన్న కుమార్‌రెడ్డికి సంఘీభావం తెలిపారు. విద్యార్థులు ఒక్కసారిగా జై సమైక్యాంధ్ర నినాదాలతో ప్రాంగణం హోరెత్తింది.
దీక్ష శిబిరంలో నేడు
గూడూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త పాశం సునీల్‌కుమార్, కొడవలూరు మండలంలోని సర్పంచులు, పార్టీ నాయకులు మంగళవారం ఇక్కడికి వచ్చి ప్రసన్నకుమార్‌రెడ్డి దీక్షకు సంఘీభావాన్ని తెలియజేయనున్నారు.
కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్న ఆమరణ దీక్ష
Published Tue, Aug 20 2013 6:50 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM
Advertisement
Advertisement