
సభ ముందుకు ఎమ్మెల్యే రోజా వివరణ లేఖ
అసెంబ్లీలో స్పీకర్ కోడెల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: గతేడాది డిసెంబర్ 18న సభలో జరిగిన పరిణామాలకు సంబంధించి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా ఇచ్చిన వివరణ లేఖను సభ ముందుంచుతున్నట్లు శనివారం స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీలో పేర్కొన్నారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలకు రోజాను బాధ్యురాలిని చేస్తూ ఏడాది పాటు సస్పెండ్ చేసినట్లు స్పీకర్ అప్పట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీనిపై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సభాపతికి వివరణ లేఖ సమర్పించాలని, దానిని పరిశీలించి వివాదాన్ని పరిష్కరించేందుకు స్పీకర్ సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో ఆమె ఇచ్చిన వివరణ లేఖను సభకు సమర్పించినట్లు స్పీకర్ పేర్కొన్నారు.