ఐరాల: పూతలపట్టు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్ నిరవధిక నిరాహారదీక్షను శుక్రవారం రాత్రి పోలీసులు భగ్నంచేశారు. ఐరాల మండలంలో వివిధ వర్గాల పింఛన్ల తొలగింపును నిరసిస్తూ సునీల్‌కుమార్ గురువారం నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించిన విషయం విదితమే. రెండో రోజు శుక్రవారం రాత్రి 11గంటల ప్రాంతంలో పోలీసులు బలవంతంగా సునీల్ కుమార్‌ను దీక్ష శిబిరం నుంచి అంబులైన్స్‌లో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చిత్తూరు ఆస్పత్రిలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కుటుంబ సభ్యుల అనుమతితో సునీల్ కుమార్‌కు ఫ్లూయిడ్స్ పెట్టారు. వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధికారి ప్రతినిధి బాబు రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి ఆస్పత్రిలో నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఉదయం దీక్ష శిబిరాన్ని వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరె డ్డి భాస్కర్‌రెడ్డి సందర్శించారు. సునీల్ దీక్షకు సంఘీభావం తెలిపారు.
ఫోన్‌లో వైఎస్ జగన్ పరామర్శ
నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్‌ను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే సునీల్ దీక్ష భగ్నం
Published Sat, Mar 7 2015 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 10:24 PM
Advertisement
Advertisement