MLA Sunil
-
ఒక నాయకుడు పోతే వంద మంది వస్తారు
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వాకాడు : పార్టీ నుంచి ఒక నాయకుడు పోతే వందమంది నాయకులు పుడతారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. వాకాడులోని పార్టీ సీజీసీ సభ్యులు డాక్టర్ నేదుమల్లి పద్మనాభరెడ్డి నివాసంలో శుక్రవారం ఉదయం వాకాడు, చిట్టమూరు మండలాల పార్టీ కార్యకర్తలు, నాయకులతో ప్రసన్న సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ గూడురు ఎమ్మెల్యే సునీల్ పార్టీకి ద్రోహం చేసి వెళ్లడం దారుణమన్నారు. ఎమ్మెల్యే వెళ్లినంత మాత్రన పాపారెడ్డిజ్‌కుమార్‌రెడ్డి పార్టీని వీడటం సరికాదన్నారు. నాయకులు పార్టీ వీడినా ప్రజలు మాత్రం వైఎస్ జగన్ వెంటే ఉన్నారన్నారు. కార్యకర్తలకు, నాయకులకు తమ పార్టీలో కొదవలేదన్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్ట్టి టీడీపీలో చేర్చుకున్నా జగన్‌న్ను ఏం చేయలేరన్నారు. అధికార పార్టీని చూసి ఎవరూ భయపడాల్సిన అవసరంలేదన్నారు. త్వరలోనే నియోజవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి పార్టీని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. వారం రోజుల్లో బయటపెడతా చిల్లకూరు మండలంలో పార్టీని వీడి టీడీపీలో చేరిన ఓ నాయకుడు 590 ఎకరాలు ఆక్రమించి సిలికా వ్యాపారం చేస్తూ అక్రమంగా కోట్లు గడిస్తున్నారన్నారు. వారం రోజుల్లో పూర్తి ఆధారాలతో ఆ నాయకుడు బండారం బయటపెడతామన్నారు. సీఎం చంద్రబాబుకు నిజయితీ ఉంటే ప్రభుత్వ భూముల్లో అక్రమంగా సిలికా వ్యాపారం చేస్తున్న ఆ నాయకుడిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. వైఎస్ జగన్ మహాశక్తి ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. పార్టీ సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, కోట ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కె.నందగోపాల్‌రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి పోకల దుష్యంతయ్య శెట్టి, జిల్లా అధికార ప్రతినిధి చలపతిరావు పాల్గొన్నారు. విజయసాయిరెడ్డికి సముచితస్థానం వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంపికచేయడం సముచితమని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. మాట మీద నిలబడతారు, నమ్ముకున్న వారికి ద్రోహం చేయరనేందుకు నిదర్శనం ఒక్క వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబమేనన్నారు. పార్టీ అభివృద్ధికి పాటుపడుతున్న విజయసాయిరెడ్డిని ఎంపిక చేసినందుకు జగన్మోహన్రెడ్డికి పార్టీ శ్రేణులు అభినందనలు తెలుపుతున్నాయన్నారు. -
ఎమ్మెల్యే సునీల్ దీక్ష భగ్నం
ఐరాల: పూతలపట్టు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్ నిరవధిక నిరాహారదీక్షను శుక్రవారం రాత్రి పోలీసులు భగ్నంచేశారు. ఐరాల మండలంలో వివిధ వర్గాల పింఛన్ల తొలగింపును నిరసిస్తూ సునీల్‌కుమార్ గురువారం నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించిన విషయం విదితమే. రెండో రోజు శుక్రవారం రాత్రి 11గంటల ప్రాంతంలో పోలీసులు బలవంతంగా సునీల్ కుమార్‌ను దీక్ష శిబిరం నుంచి అంబులైన్స్‌లో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చిత్తూరు ఆస్పత్రిలో వైఎస్సార్సీపీ నాయకులు, కుటుంబ సభ్యుల అనుమతితో సునీల్ కుమార్‌కు ఫ్లూయిడ్స్ పెట్టారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధికారి ప్రతినిధి బాబు రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి ఆస్పత్రిలో నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఉదయం దీక్ష శిబిరాన్ని వైఎస్సార్సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరె డ్డి భాస్కర్‌రెడ్డి సందర్శించారు. సునీల్ దీక్షకు సంఘీభావం తెలిపారు. ఫోన్లో వైఎస్ జగన్ పరామర్శ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్‌ను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఫోన్లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. -
కలెక్టర్ చీకటి పాలన
అనారోగ్యం పాలవుతున్న అధికారులు మర్యాద కూడా తెలియని అధికారి ఎమ్మెల్యే చెవిరెడ్డి విమర్శలు ఐరాల : మిట్ట మధ్యాహ్నం లేచి... సాయంత్రం కార్యాలయానికి వచ్చి... అర్ధరాత్రి చీకట్లో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ పాలనసాగిస్తున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ చేస్తున్న నిరవధిక నిరాహారదీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు. దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ చీకట్లో పాలన చేస్తున్న కలెక్టర్ వ్యవహార శైలివల్ల ప్రజలకు, ప్రజాప్రతినిధులకు సమస్యలను చెప్పుకునే వీలుపడడం లేద న్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులే కాకుండా గ్రామీణ స్థాయిలో ఉన్న సిబ్బంది కూడా కలెక్టర్ ప్రవర్తన వల్ల తిండిలేక , నిద్రలేక అనారోగ్యం పాలవుతున్నారని చెప్పారు. కొందరు ఉద్యోగులు ఇక భరించలేక వేరే జిల్లాకు బదిలీ చేయమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారని చెప్పారు. జిల్లా స్థాయి అధికారులను సైతం కలెక్టర్ మర్యాద లేకుండా మాట్లాడడం బాధాకరమన్నారు. మంచి, మర్యాద లేని వ్యక్తి జిల్లా కలెక్టర్ ఎలా అయ్యారో ఆ దేవుడేకే తెలియాలన్నారు. పచ్చికబయళ్లతో నందనవనంలా ఉన్న కలెక్టర్ కార్యాలయాన్ని శ్మశానవాటిక వాతావరణంలా మార్చిన ఘనత కలెక్టర్‌కే దక్కుతుందన్నారు. విజయవంతమైన కార్యక్రమాన్ని ఆయన గొప్పగాను, తేడా వస్తే తప్పు అధికారులదంటూ తోసివేసే సంస్కృతి కలిగిన వ్యక్తి సిద్ధార్థ్‌జైన్ అని విద్యార్థులు వాపోతున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ల్యాబ్‌టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేసుకోలేని దీనస్థితిలో జిల్లా యంత్రాంగం ఉందన్నారు. ముఖ్యమంత్రి వ్యవహారశైలిని తెలుగుతమ్ముళ్లు సైతం బహిరంగంగా విమర్శిస్తున్నారని అన్నారు. జిల్లాలో అస్తవ్యస్తపాలన నడుస్తున్నా కాకిలెక్కలు, కాకమ్మ కబుర్లతో ముఖ్యమంత్రిని సైతం తప్పుదారిపట్టిస్తూ పదవులను కాపాడుకునేందుకు ఐఏఎస్‌లు ప్రయత్నించడం దారుణమన్నారు. కొందరు అధికారుల వల్ల ఐఏఎస్ వ్యవస్థకే మచ్చ ఏర్పడుతోందన్నారు. కలెక్టర్ తీరుకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు దీక్షకు దిగుతున్నారంటే పరిస్థితి తీవ్రతకు అర్థంపడుతుందని, త్వరలోనే ప్రజలు సైతం రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపే దుస్థితి ఏర్పడుతుందని తెలిపారు. జిల్లాలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను ముఖ్యమంత్రికి లేఖ ద్వారా పంపుతున్నామని, ఆయన అయినా జిల్లాను కాపాడుతారా అని ముఖ్యమంత్రి విజ్ఞతకే వదలివేస్తున్నామని తెలిపారు. సెలవుపై వెళ్లిన కలెక్టర్ చిత్తూరు (సెంట్రల్): జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ వ్యక్తిగత పనుల నిమిత్తం శనివారం సెలవుపై వెళ్లారు. శుక్రవారం హోలీ పర్వదినం, ఆదివారం జాతీయ సెలవుదినం కావడంతో పైఅధికారుల అనుమతితో సెలవుపై వెళ్లారు. తిరిగి ఆయన సోమవారం జిల్లాలో విధులకు హాజరుకానున్నారు. కలెక్టర్ వచ్చేంత వరకు ఇన్చార్జ్ కలెక్టర్ జేసీ నారాయణభరత్‌గుప్త వ్యవహరించనున్నారు.