crackdown
-
ఇలా సరిహద్దులకు కాపలాగా ఉంటే ఎలా సార్! అవతల మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయ్!
-
ఇక ఊరుకునేదిలే: రిషి సునాక్
లండన్: అక్రమ వలసదారులను అరికట్టేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తాజాగా తెచ్చిన కొత్త పథకం(అక్రమ వలసల కట్టడి బిల్లు).. విమర్శలకు తావు ఇస్తోంది. బ్రిటన్‌లోకి అక్రమంగా ప్రవేశించే వారిని ఆశ్రయం పొందేందుకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని సునాక్ తాజాగా హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు కొత్త చట్టం తీసుకురాగా.. తద్వారా అక్రమ చొరబాట్లను ఉక్కుపాదంతో అణిచివేసేందుకు ప్రభుత్వానికి హక్కు లభించినట్లయ్యింది. అయితే ఈ చట్టంపై ప్రతిపక్షాలు, మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. మీరు చట్టవిరుద్ధంగా ఇక్కడకు వస్తే.. ఆశ్రయం పొందలేరు. ఆధునిక బానిసత్వ రక్షణల నుంచి ప్రయోజనం పొందలేరు. మీరు నకిలీ మానవ హక్కుల దావాలు చేయలేరు. ఇక్కడ ఉండలేరు అంటూ ట్వీట్ చేశారాయన. చట్టవిరుద్ధంగా ఇక్కడికి ప్రవేశించేవాళ్లను అదుపులోకి తీసుకుని.. కొన్ని వారాలలోపు వాళ్లను పంపించేస్తాం. సురక్షితమని భావిస్తే.. వాళ్ల సొంత దేశానికే పంపిస్తాం. కుదరకుంటే రువాండా లాంటి మరో దేశానికి తరలిస్తాం. అమెరికా, ఆస్ట్రేలియాలో ఉన్నాసరే మా దేశంలోకి మళ్లీ ప్రవేశించకుండా నిషేధించబడతారు అంటూ హెచ్చరించారాయన. If you come to the UK illegally you will be stopped from making late claims and attempts to frustrate your removal. You will be removed in weeks, either to your own country if it is safe to do so, or to a safe third country like Rwanda. pic.twitter.com/8NFaa4DbwT — Rishi Sunak (@RishiSunak) March 7, 2023 ఇల్లీగల్ మైగ్రేషన్ బిల్లుగా పిలవడబడుతున్న ముసాయిదా చట్టం.. ఇంగ్లీష్ చానెల్ గుండా చిన్నచిన్న బోట్ల ద్వారా అక్రమంగా ప్రవేశించే వాళ్లపై ప్రత్యేకంగా దృష్టిసారించనుంది. ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది సౌత్ఈస్ట్ ఇంగ్లండ్ గుండా 45 వేలమంది వలసదారులు బ్రిటన్‌కు చేరుకున్నారు. ఇది గత ఐదేళ్లలుగా పోలిస్తే.. వార్షికంగా 60 శాతం పెరిగిందని నివేదికలు చెప్తున్నాయి. రిషి సునాక్ తీసుకొచ్చిన కొత్త పథకంపై మానవ హక్కుల సంఘాలు, బ్రిటన్ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. కొత్త చట్టం వర్కవుట్ అయ్యే అవకాశమే లేదని, అంతర్జాతీయ చట్టాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావొచ్చని ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఈచట్టంతో దుర్బల పరిస్థితుల్లో ఉన్న శరణార్థులు బలి పశువులు అవుతారంటూ వాదిస్తున్నాయి మానవ హక్కుల సంఘాలు. మూలాలను ప్రస్తావించిన హోం సెక్రెటరీ ఇదిలా ఉంటే.. బ్రిటన్ హోం కార్యదర్శి Suella Braverman సుయెల్లా బ్రేవర్మాన్(భారత సంతతి).. మంగళవారం కొత్త చట్టాన్ని ప్రకటించారు. అక్రమ వలసల కట్టడి బిల్లు ప్రకారం.. చిన్న చిన్న పడవలపై అక్రమంగా యూకేలోకి వచ్చే వలసదారులను అదుపులోకి తీసుకుని.. వాళ్లను వీలైనంత త్వరగా బయటకు పంపించేస్తారు. ఈ చట్టం చట్టవిరుద్ధమైన వలసలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన బలమైన విధానమని బ్రేవర్మాన్ ప్రకటించారు. అంతేకాదు.. బిల్లు గురించి ప్రకటించే సమయంలో ఆమె తన స్వంత వలస మూలాలను కూడా ప్రస్తావించారు. బ్రేవర్మాన్ తండ్రి గోవాకు చెందిన వ్యక్తి, అలాగే తల్లి తమిళ మూలాలున్న వ్యక్తి. ఇప్పుడు.. యూకే ప్రపంచంలోని అత్యంత దుర్బలమైన శరణార్థులకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 2015 యూకే దాదాపు ఐదులక్షల మందికి పైగా ఆశ్రయం అందించింది. హాంకాంగ్ నుండి 150,000 మంది, ఉక్రెయిన్ నుంచి 1,60,000 మంది ప్రజలు.. అలాగే తాలిబాన్ చెర నుంచి పారిపోయి చేరుకున్న అఫ్ఘన్లు పాతిక వేల మంది దాకా ఉన్నారు. వాస్తవానికి.. నా తల్లిదండ్రులు దశాబ్దాల కిందట ఈ దేశంలో భద్రత, అవకాశాలను కనుగొన్నారు. ఇందుకు నా కుటుంబం ఎప్పటికీ బ్రిటన్‌కు కృతజ్ఞతలు తెలుపుతుంది అని తెలిపారామె. అయినప్పటికీ.. మన సరిహద్దులను ఉల్లంఘించే అక్రమ వలసదారుల అంశంపై ప్రభుత్వం స్పందించకపోవడం అంటే.. మనల్ని ఎన్నుకున్న ప్రజల అభీష్టానికి ద్రోహం చేసినట్టే అని పేర్కొన్నారామె. కొత్త చట్టం నుంచి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. పద్దెనిమిదేళ్ల లోపు వాళ్లకు అదీ తీవ్రమైన వైద్య పరిస్థితులు ఉన్నవారికి, ప్రాణ హాని ఉన్నవారిని యూకేలోకి అనుమతిస్తారు. -
హాలీవుడ్ సినిమాలు చూస్తే జైలుకే
సియోల్: హాలీవుడ్, ముఖ్యంగా దక్షిణ కొరియా సినిమాలు, టీవీ కార్యక్రమాల ప్రభావాన్ని తగ్గించేందుకు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ కఠిన చర్యలను ప్రకటించారు. పిల్లలు హాలీవుడ్ సినిమాలు చూస్తున్నారని తెలిస్తే వారి తల్లిదండ్రుల్ని ఆరు నెలలపాటు నిర్బంధ లేబర్ క్యాపులకు తరలిస్తామని హెచ్చరించారు. అంతేకాదు, సదరు పిల్లలు ఏకంగా ఐదేళ్ల జైలు శిక్ష అనుభవాల్సి ఉంటుందని కూడా ప్రకటించారని మిర్రర్ పత్రిక పేర్కొంది. దక్షిణ కొరియా పౌరుడిలా కనిపించాలని చూసినా 6 నెలల జైలు జీవితం తప్పదని పేర్కొంది. గతంలో ఈ నేరాలకు పాల్పడిన వారిని గట్టి హెచ్చరికలతో వదిలేసేవారు. తాజాగా, ప్రభుత్వం ఇన్మిబన్ అనే కార్యక్రమాన్ని ప్రకటించిందని మిర్రర్ తెలిపింది. అంటే ప్రతి ఒక్కరూ తమ పక్క ఇళ్లలో ఏం జరిగే వాటిపై ఓ కన్నేసి ఉంచాల్సి ఉంటుంది. డ్యాన్సులు, పాటలు పాడటం, మాట్లాడటంపైనా కిమ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. -
కన్నీళ్లకు కరగని తాలిబన్లు! అతని కళ్ల ముందే..
కాబుల్: అఫ్గన్‌లో తాలిబన్ల షరతుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా సంగీత వాయిద్యాల (మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్)ను అఫ్గన్ తాలిబన్లు నడి వీధిలో తగలబెడుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ను అఫ్గన్ తాలిబన్లు తగలబెడుతుండగా కన్నీరు పెట్టుకుంటున్న సంగీత విద్యాంసుడు, గన్ పట్టుకుని అతన్ని చూసి హేళనగా నవ్వుతున్న తాలిబన్ ఈ వీడియోలో కనిపిస్తారు. చుట్టు చేరిన వారిలో కొంత మంది అతని దయనీయ స్థితిని వీడియో తీయడం కూడా కనిపిస్తుంది. ఈ సంఘటనకు చెందిన వీడియోను అఫ్గన్ జర్నలిస్టు అబ్దుల్హాక్ ఒమెరి అఫ్గనిస్తాన్‌లోని పాక్టియా ప్రావిన్స్‌లో చోటుచేసుకున్నట్లు ట్విటర్లో పోస్ట్ చేశాడు. కాగా గతంలో తాలిబన్లు వాహనాల్లో సంగీతాన్ని నిషేధించారు. అంతేకాకుండా వివాహాది శుభకార్యాల్లో లైవ్ మ్యూజిక్ కూడా తాలిబన్లు నిషేధించారు. మహిళలు, పురుషులు వేర్వేరు హాళ్లలో సంభరాలు జరుపుకోవాలనే వింత హుకుం జారీ చేసినట్లు అఫ్గనిస్తాన్‌లోని ఓ హోటల్ యజమాని గత ఏడాది అక్టోబర్‌లో మీడియాకు తెలిపాడు. హెరాత్ ప్రావిన్స్‌కు చెందిన బట్టల దుకాణాల్లోని బొమ్మల (మానెక్వీన్స్) తలలు తొలగించాలని, అది షరియత్ చట్ట ఉల్లంఘన కిందకు వస్తుందని తాలిబన్లు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ విధమైన నిషేధాజ్ఞలు కాబుల్ వీధుల్లో మళ్లీ కనిపించడం ప్రారంభించాయి. అఫ్గనిస్తాన్ టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే డ్రామాలు, ఇతర కార్యక్రమాల్లో మహిళలను ప్రదర్శించడం నిలిపివేయాలని పిలుపునిస్తూ మత పరమైన మార్గదర్శకాలను కూడా తాలిబన్ మినిస్ట్రీ విడుదల చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు అమలుచేయకపోవచ్చని సమూహం చెప్పినప్పటికీ, కరడుగట్టిన షరియా చట్టాన్ని మాత్రం అక్కడ తప్పక అమలుచేసి తీరుతారనేది చరిత్ర చెబుతోంది. 20 ఏళ్ల తర్వాత మరోసారి అఫ్గనిస్తాన్ తాలిబన్ల నియంత్రణలోకి రావడంతో, తీవ్రవాదుల పాలనలో అక్కడి మహిళలు సందిగ్ధభరితమైన అనిశ్చిత జీవితాన్ని జీవించాల్సిఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. Video : Taliban burn musician's musical instrument as local musicians weeps. This incident happened in #ZazaiArub District #Paktia Province #Afghanistan . pic.twitter.com/zzCp0POeKl — Abdulhaq Omeri (@AbdulhaqOmeri) January 15, 2022 చదవండి: నన్ను కాదని సోనూసూద్ సోదరికి సీటిచ్చారు..! అందుకే బీజేపీలోకి..: కాంగ్రెస్ ఎమ్మెల్యే -
రు. కోటి పెట్టి నిర్మించిన రోడ్డు.. కొబ్బరికాయ దెబ్బకు బీటలు
లక్నో: మన దగ్గర రోడ్లు, ప్రాజెక్ట్‌ల నిర్మాణం ఎంత అధ్వానంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయా నిర్మాణాల నాణ్యత సదరు కాంట్రాక్టర్ ఎంత నిజాయతీపరుడనే దాని మీద ఆధారపడి ఉంటుంది. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కోటి రూపాయలు పెట్టి నిర్మించిన రోడ్డు ఒపెనింగ్ రోజునే దాని నాణ్యత ఎలా ఉందో బట్టబయలు అయ్యింది. రోడ్డు ఒపెనింగ్‌లో భాగంగా కొబ్బరి కాయ కొట్టడానికి ప్రయత్నించగా.. అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. కొబ్బరి కాయ బదులు రోడ్డు బీటలు వారింది. ఈ సంఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ వివరాలు.. (చదవండి: చిలక కాదు.. మొలక: ఆసక్తిగా తిలకిస్తున్న జనం ) ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ బిజ్నోర్‌లో చోటు చేసుకుంది. ఇక్కడ ప్రభుత్వం 1.16 కోట్ల రూపాయల ఖర్చుతో 7 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మించింది. రహదారి ప్రారంభోత్సవానికి బిజ్నోర్, సదార్ నియోజకర్గ బీజేపీ ఎమ్మెల్యే సుచి మౌసం చౌదరీని ఆహ్వానించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పూజ చేసి.. కొబ్బరి కాయ కొట్టి.. రోడ్డును ప్రారంభిద్దామని భావించారు. అయితే కొబ్బరి కాయ పగలలేదు కానీ.. రోడ్డు మాత్రం బీటలు వారింది. (చదవండి: అద్భుతం.. ఇంటి మేడ మీద 4 వేల మొక్కలు) ఈ సంఘటనపై మౌసం చౌదరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అధికారులు వచ్చి.. నమూనాలు సేకరించాల్సిందిగా ఆదేశించారు. మూడు గంటలు నిరీక్షించిన తర్వాత అధికారులు అక్కడకు చేరుకున్నారు. అనంతరం ఆమె తారు నమూనాను సేకరించడంలో అధికారులకు సహాయం చేయడానికి గాను ఆ ప్రదేశంలో తవ్విన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతున్నాయి. This 7 km road in west UP’s Bijnor took 1.16 crores to renovate but when @BJP4UP MLA Suchi Chaudhary tried a coconut cracking ritual to formally inaugurate it , its the road that cracked open, she says …. pic.twitter.com/fvtaEEsNWf — Alok Pandey (@alok_pandey) December 3, 2021 చదవండి: ‘ఛ ఛ.. నీవల్లే ఇన్ని నేర్చుకున్నాను’ -
పగిలిన డిస్ప్లే ఫోన్లకు ఐఐటీ పరిశోధకుల అద్భుత ఆవిష్కరణ
స్మార్ట్‌ఫోన్ మన నిత్యజీవితంలో ఒక భాగమైంది. వేలకువేలు డబ్బులు పోసి మీరు స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే, ఒక్కసారిగా మీ ఫోన్ అనుకోకుండా కింద పడి డిస్ప్లే పగిలిపోతే అంతే సంగతులు...! గుండె బద్దలైపోతుంది. ఎంతోకొంత డబ్బును వెచ్చించి తిరిగి ఫోన్‌కు కొత్త డిస్ప్లే వేయిస్తాం..! మనలో చాలా మంది ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్న వారిమే. ఫోన్ పొరపాటున ఎక్కడ కింద పడిపోతదేమో అనే భయంతో మన ఫోన్లను జాగ్రత్తగా చూసుకుంటాం. ఇకపై ఫోన్ కింద పడితే డిస్ప్లే పగిలిపోతుందన్న భయం వీడండి. ఎందుకంటే భవిష్యత్తులో స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే పగిలితే స్క్రీన్ తనంతటతాను స్క్రీన్ మంచిగా కానుంది. ఈ అద్భుతమైన ఆవిష్కరణకు ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐఎస్ఈఆర్ కోల్కత్తా పరిశోధకులు పురుడుపోశారు. పగిలిన ఫోన్ల డిస్ప్లే దానంతటా అదే హీల్ అయ్యే టెక్నాలజీను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణకు సంబంధించిన విషయాలను ‘ సేల్ఫ్ హీలింగ్ క్రిస్టలిన్ మెటిరియల్’ జర్నల్ పేపర్లో పబ్లిష్ చేశారు. ఈ బృందం స్పటికకార స్థితిలో ప్రత్యేక సాలిడ్ మెటిరియల్‌ను తయారుచేశారు. ఈ పదార్థం ఫీజోఎలక్ట్రిక్ ధర్మాన్ని కలిగి ఉంది. మెకానికల్ ఎనర్జీను ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేయనుంది. ఈ పదార్థంలో ఏర్పడిన పగుళ్లలో ఉపరితలాల వద్ద వ్యతిరేక విద్యుత్ శక్తిని ప్రేరేపిస్తుంది. దీంతో ఈ పదార్థం తిరిగి సెల్ఫ్ హీల్ అవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఆవిష్కరణతో డిస్ప్లే క్రాక్‌లకు చెక్ పెట్టవచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు. -
భారత్‌కు భారం..డ్రాగన్‌కు వరం
వాషింగ్టన్ : వీసాల నిలిపివేతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల అగ్రరాజ్యంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హెచ్1బీ వీసాలపై ఆంక్షలు భారత ప్రొఫెషనల్స్‌కు ఆటంకం కాగా ఇవి చైనాకు వరంలా మారతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీసాల నిలిపివేత నిర్ణయం అమెరికన్లకు ఉద్యోగాలను అందుబాటులోకి తీసుకురావడంలో ఏమాత్రం ఉపయోగపడదని లాస్ఏంజెల్స్ టైమ్స్ హెచ్చరించింది. డ్రాగన్‌కు సానుకూలం ట్రంప్ నిర్ణయం చైనాకు మాత్రమే ఉపకరిస్తుందని వాల్‌స్ట్రీట్ జర్నల్ స్పష్టం చేసింది. సింథటిక్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్స్, బయోటెక్ రంగాల్లో చైనా నైపుణ్యాలతో అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో వారే పాతుకుపోతారని, అధ్యక్షుడి నిర్ణయంతో హువాయి, బైదు, టెన్సెంట్ వంటి డ్రాగన్ కంపెనీలకు మేలు చేకూరుతుందని వాల్‌స్ర్టీట్ జర్నల్ పేర్కొంది. ఇక బహుళజాతి సంస్థలు అమెరికాకు విదేశీ మేనేజర్లను రప్పించే వెసులుబాటు లేకుంటే ఈ ఉద్యోగాలను విదేశాలకే తరలిస్తాయని, అమెరికన్లకు అవకాశాలు అందుబాటులో ఉండవని వ్యాఖ్యానించింది. టెకీల్లో అలజడి.. అమెరికన్ల ఉద్యోగాలు కాపాడేందుకు ట్రంప్ తీసుకున్న నిర్ణయం అత్యంత నైపుణ్యాలతో కూడిన విదేశీ ప్రొఫెషనల్స్‌ను కలవరపాటుకు గురిచేసింది. తమ భవిష్యత్‌పై పలువురు ప్రొఫెషనల్స్‌లో గుబులు మొదలైంది. మరోవైపు హెచ్1బీ వీసాదారులపై ఆధారపడిన వారి భాగస్వాములు అత్యవసరంగా భారత్‌కు వచ్చిన క్రమంలో తిరిగి అమెరికాలో అడుగుపెట్టేందుకు అనుమతించాలని అమెరికన్ అధికారులను కోరతున్నారు. వీసాల నిలిపివేతపై ట్రంప్ ఉత్తర్వులపై విశ్లేషకుల్లో సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి : హెచ్ 1బీ: భవిష్యత్తుపై మనోళ్ల బెంగ! -
వందలాది యాప్‌లను తొలగించిన గూగుల్
నిబంధనల ఉల్లంఘన, ప్రకటనల ద్వారా మోసాలకు పాల్పడుతున్న యాప్‌లపై శోధన దిగ్గజం గూగుల్ మరోసారి వేటు వేసింది. మొబైల్ ప్రకటన మోసాలను ఎదుర్కునే ప్రయత్నంలో గూగుల్ తన గూగుల్ ప్లే స్టోర్ నుండి వందలాది యాప్‌లకుచెక్ పెట్టింది. ఈ మేరకు గూగుల్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. తమ భద్రతా చర్యల్లో భాగంగా కొత్తగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాల సహాయంతో దాదాపు 600 అనువర్తనాలను గూగుల్ ప్లే స్టోర్ నుండి తీసివేసామని వెల్లడించింది. తమ ప్రకటనల మోనిటైజేషన్ ప్లాట్‌ఫామ్‌లైన గూగుల్ యాడ్‌మాబ్, గూగుల్ యాడ్ మేనేజర్ నుండి నిషేధించామని ప్రకటించింది. భంగపరిచే ప్రకటనల తీరును తాము అనుమతించమని కంపెనీ బ్లాగ్ పోస్ట్‌లో యాడ్ ట్రాఫిక్ క్వాలిటీ సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్ పెర్ బిజోర్కే తెలిపారు. విఘాతకరమైన ప్రకటనలతో సహా, అనవసర ట్రాఫిక్‌ను సృష్టిస్తున్న యాప్‌లను నిరోధించడంతో పాటు, వినియోగదారులు, ప్రకటనదారులకు భరోసా కల్పించేలా తమ ప్లాట్‌ఫాంపై తగిన విధానాలను అభివృద్ధికి, రూపకల్పనకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాలలో పెట్టుబడులు పెడుతూనే వుంటామన్నారు. యూజర్ బ్రౌజర్లో ఊహించని రీతిలో ఈ ప్రకటనలు పాప్ అప్అవుతూ అంతరాయం కలిగిస్తున్నాయని తెలిపింది. వాస్తవానికి వినియోగదారు యాప్‌లో చురుకుగా లేనప్పుడు కూడా ఒక విధమైన విఘాతకర ప్రకటనలనుహానికరమైన డెవలపర్లు మొబైల్స్‌లో అందిస్తున్నారని గూగుల్ ఆరోపించింది. తొలగించిన యాప్‌లు 4.5 బిలియన్లకు పైగా డౌన్లోడ్ అయినట్టు తెలిపింది. ప్రధానంగా ఇంగ్లీష్ మాట్లాడే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ యాప్‌లు ఉన్నట్టు తెలిపింది. ఈ యాప్‌ల డెవలపర్లు ప్రధానంగా చైనా, హాంకాంగ్, సింగపూర్, భారతదేశంలో ఉన్నారని వివరించింది. అయితే తొలగించిన అప్లికేషన్ల వివరాలను మాత్రం గూగుల్ వెల్లడించలేదు. -
వైన్‌షాప్‌లో పగిలిన బీరు బాటిళ్లు
సాక్షి, సిద్దిపేట అర్బన్ : వైన్స్ షాప్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగి సీసీ కెమెరాలు, ఫ్రిజ్ దగ్ధమైంది. ఈ ఘటన శనివారం సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని ఎన్సాన్పల్లి గ్రామంలో జరిగింది. సిద్దిపేట రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్సాన్పల్లి గ్రామంలో ఉన్న లక్ష్మీనరసింహ వైన్స్ నిర్వహకుడు కొండం బాలకిషన్ గౌడ్ శుక్రవారం రాత్రి షాప్‌ను బంద్ చేసి ఇంటికి వెళ్లిపోయాడు. శనివారం ఉదయం షాప్ నుంచి పొగలు వస్తున్నాయని స్థానికులు షాప్ నిర్వహకుడికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకొని షాప్ తెరిచి చూడగా సీసీ కెమెరాల మానిటర్, ఫ్రిజ్, అందులోని మద్యం బాటిళ్లు దగ్ధమయ్యాయని గుర్తించాడు. వెంటనే ఫైర్ స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై షాప్ నిర్వహకుడు బాలకిషన్‌గౌడ్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కోటేశ్వర్రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చైనాలో పది వేలమందిని చంపేశారు..!
బీజింగ్: చైనాలో జరిగిన ఓ పోరాటానికి సంబంధించిన ప్రాణ నష్టంపై బ్రిటన్ రహస్య దౌత్య సమాచార విభాగం సంచలన విషయం తెలిపింది. తమకు ప్రజాస్వామ్యం కావాలంటూ 1989 జూన్ నెలలో తియాన్మెన్ కూడలి వద్ద జరిగిన పోరాటంలో దాదాపు 10 వేలమందిని చైనా సైన్యం చంపేసిందని వెల్లడించింది. 'ఆ నాడు జరిగిన ఉద్యమంలో కనీసం 10,000మందిని చంపేసినట్లు అంచనా' అని బ్రిటన్ రాయబారి అలాన్ డోనాల్డ్ లండన్‌కు నాడు పంపిన టెలిగ్రాంలో తెలిపారు. ఆ విషయానికి సంబంధించిన డాక్యుమెంట్ ఒకటి ఇప్పుడు తాజాగా 28 ఏళ్ల తర్వాత బయటకు వచ్చింది. చైనాలో కమ్యునిస్టు ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. అయితే, తమకు మిగితా దేశాల మాదిరిగా ప్రజాస్వామ్య పరిపాలన కావాలంటూ దాదాపు ఏడు వారాలపాటు పౌరులు వీధుల్లోకి వచ్చి పోరాడారు. 1989 మే నెల నుంచే ఇది ప్రారంభమైంది. అయితే, జూన్ 5న వారంతా తియాన్మెన్ కూడలి వద్దకు చేరుకొని ఉద్యమించగా వారిపై సైన్యం కాల్పులు జరిపింది. ఆ సమయంలో ఒక వెయ్యిమంది చనిపోయారంటూ ప్రపంచాన్ని నమ్మించారు. అయితే, అందుకు పది రెట్లమందిని చంపేసినట్లు నాటి బ్రిటన్ రాయబారి టెలిగ్రాం ద్వారా తాజాగా తెలిసింది. -
పోలీసుల గుప్పిట్లో కిర్లంపూడి!
‘ఛలో అమరావతి’పై భారీ నిర్బంధం కాకినాడ: బీసీ రిజర్వేషన్ సాధన కోసం ఉద్యమిస్తున్న కాపులపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కాపు సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26 నుంచి 'ఛలో అమరావతి' పేరిట కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేపడుతుండటంతో.. ఈ పాదయాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని సర్కారు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. పాదయాత్ర తేదీ దగ్గరపడుతున్న కొద్దీ తూర్పు గోదావరి జిల్లాలో సర్కారు పోలీసు నిర్బంధాన్ని పెంచుతోంది. కాపు ఉద్యమానికి కేంద్రమైన కిర్లంపూడి ప్రస్తుతం ఖాకీల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. కాపు నేతల కదలికలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. గత మూడురోజులుగా కిర్లంపుడిలో 144 సెక్షన్ అమలవుతోంది. అడుగడుగునా చెక్‌పోస్టులు పెట్టి.. వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. కాపు ఉద్యమనేత ముద్రగడ నివాసం చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. బయటి వ్యక్తులు ముద్రగడ నివాసంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. పాదయాత్రకు తరలిరాకుండా కాపునేతలపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదుచేస్తున్నారు. ఇలా అడుగడుగున పాదయాత్రను అడ్డుకునేందుకు ఆంక్షలు, కఠినమైన నిర్బంధాన్ని ప్రయోగించడంపై కాపు జేఏసీ నేతలు మండిపడుతున్నారు. -
పాన్ నెంబర్ తీసుకోవడంలో రాజీ వద్దు: రెవెన్యూ
-
10వేల మంది సివిల్ సర్వెంట్లపై వేటు
తిరుగుబాటుదారులను అణచివేయడంలో పూర్తిగా విఫలమయ్యారని మరో 10వేల మంది సివిల్ సర్వీసు అధికారులను టర్కీ ప్రభుత్వం తొలగించింది. తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే నెపంతో 15కు పైగా మీడియా సంస్థలపై వేటు వేసింది. అమెరికాలో ఉంటున్న తమ మతగురువు ఫతుల్లా గులెన్ అనుచరులే ఈ తిరుగుబాటుకు కారణమని టర్కీ ఆరోపిస్తోంది. రాజ్యాంగ సవరణ చేసిన మరణశిక్షను మళ్లీ తీసుకురావాలని టర్కీ చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా యూరప్ మండలి ఆ దేశాన్ని హెచ్చరించింది. మరణశిక్షను అమలుచేయడం యూరప్ మండలికి పూర్తిగా విరుద్ధమని పేర్కొంది. యూరప్ మండలి హెచ్చరికలతో టర్కీ మళ్లీ ప్రభుత్వాధికారులపై వేటు వేయడం ప్రారంభించింది. 47 సభ్యుల సంస్థగా ఏర్పడిన యూరప్ మండలిలో, టర్కీ కూడా భాగస్వామ్యమే. యూరోపియన్ యూనియన్ ఆదేశాలతో 2004లో టర్కీలో మరణశిక్షలను నిషేధించారు. ఇప్పటికే టర్కీలో నెలకొన్న సైనిక తిరుగుబాటు నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం లక్షమంది ప్రభుత్వాధికారులపై వేటు వేసింది. 37వేల మందిని అరెస్టు చేసింది. తొలగించిన వారిలో వేలకు పైగా సివిల్ సర్వీసెస్ అధికారులు, పోలీసులు, న్యాయమూర్తులు, టీచర్లు, సైనికులు. ఫోరెన్సిక్ నిపుణులు ఉన్నారు. విచారణ నిమిత్తం వారందరిన్నీ ఆ దేశ ప్రభుత్వం నిర్భందంలో ఉంచింది. వీరిని అరెస్టు చేయడం లేదా తొలగించడంపై అంతర్జాతీయంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. -
కాల్‌మనీ వ్యవహారంలో కొత్త కోణాలు
-
ఎమ్మెల్యే సునీల్ దీక్ష భగ్నం
ఐరాల: పూతలపట్టు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్ నిరవధిక నిరాహారదీక్షను శుక్రవారం రాత్రి పోలీసులు భగ్నంచేశారు. ఐరాల మండలంలో వివిధ వర్గాల పింఛన్ల తొలగింపును నిరసిస్తూ సునీల్‌కుమార్ గురువారం నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించిన విషయం విదితమే. రెండో రోజు శుక్రవారం రాత్రి 11గంటల ప్రాంతంలో పోలీసులు బలవంతంగా సునీల్ కుమార్‌ను దీక్ష శిబిరం నుంచి అంబులైన్స్‌లో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చిత్తూరు ఆస్పత్రిలో వైఎస్సార్సీపీ నాయకులు, కుటుంబ సభ్యుల అనుమతితో సునీల్ కుమార్‌కు ఫ్లూయిడ్స్ పెట్టారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధికారి ప్రతినిధి బాబు రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి ఆస్పత్రిలో నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఉదయం దీక్ష శిబిరాన్ని వైఎస్సార్సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరె డ్డి భాస్కర్‌రెడ్డి సందర్శించారు. సునీల్ దీక్షకు సంఘీభావం తెలిపారు. ఫోన్లో వైఎస్ జగన్ పరామర్శ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్‌ను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఫోన్లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.