వాషింగ్టన్ : వీసాల నిలిపివేతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల అగ్రరాజ్యంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హెచ్1బీ వీసాలపై ఆంక్షలు భారత ప్రొఫెషనల్స్‌కు ఆటంకం కాగా ఇవి చైనాకు వరంలా మారతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీసాల నిలిపివేత నిర్ణయం అమెరికన్లకు ఉద్యోగాలను అందుబాటులోకి తీసుకురావడంలో ఏమాత్రం ఉపయోగపడదని లాస్‌ఏంజెల్స్ టైమ్స్ హెచ్చరించింది.
డ్రాగన్‌కు సానుకూలం
ట్రంప్ నిర్ణయం చైనాకు మాత్రమే ఉపకరిస్తుందని వాల్‌స్ట్రీట్ జర్నల్ స్పష్టం చేసింది. సింథటిక్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్స్, బయోటెక్ రంగాల్లో చైనా నైపుణ్యాలతో అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో వారే పాతుకుపోతారని, అధ్యక్షుడి నిర్ణయంతో హువాయి, బైదు, టెన్సెంట్ వంటి డ్రాగన్ కంపెనీలకు మేలు చేకూరుతుందని వాల్‌స్ర్టీట్ జర్నల్ పేర్కొంది. ఇక బహుళజాతి సంస్థలు అమెరికాకు విదేశీ మేనేజర్లను రప్పించే వెసులుబాటు లేకుంటే ఈ ఉద్యోగాలను విదేశాలకే తరలిస్తాయని, అమెరికన్లకు అవకాశాలు అందుబాటులో ఉండవని వ్యాఖ్యానించింది.
టెకీల్లో అలజడి..
అమెరికన్ల ఉద్యోగాలు కాపాడేందుకు ట్రంప్ తీసుకున్న నిర్ణయం అత్యంత నైపుణ్యాలతో కూడిన విదేశీ ప్రొఫెషనల్స్‌ను కలవరపాటుకు గురిచేసింది. తమ భవిష్యత్‌పై పలువురు ప్రొఫెషనల్స్‌లో గుబులు మొదలైంది. మరోవైపు హెచ్1బీ వీసాదారులపై ఆధారపడిన వారి భాగస్వాములు అత్యవసరంగా భారత్‌కు వచ్చిన క్రమంలో తిరిగి అమెరికాలో అడుగుపెట్టేందుకు అనుమతించాలని అమెరికన్ అధికారులను కోరతున్నారు. వీసాల నిలిపివేతపై ట్రంప్ ఉత్తర్వులపై విశ్లేషకుల్లో సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి : హెచ్ 1బీ: భవిష్యత్తుపై మనోళ్ల బెంగ!
Comments
Please login to add a commentAdd a comment