మంటల్లో సంగీత వాయిద్యాలు
కాబుల్: అఫ్గన్‌లో తాలిబన్ల షరతుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా సంగీత వాయిద్యాల (మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్)ను అఫ్గన్ తాలిబన్లు నడి వీధిలో తగలబెడుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తన మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్‌ను అఫ్గన్ తాలిబన్లు తగలబెడుతుండగా కన్నీరు పెట్టుకుంటున్న సంగీత విద్యాంసుడు, గన్ పట్టుకుని అతన్ని చూసి హేళనగా నవ్వుతున్న తాలిబన్ ఈ వీడియోలో కనిపిస్తారు.
చుట్టు చేరిన వారిలో కొంత మంది అతని దయనీయ స్థితిని వీడియో తీయడం కూడా కనిపిస్తుంది. ఈ సంఘటనకు చెందిన వీడియోను అఫ్గన్ జర్నలిస్టు అబ్దుల్‌హాక్ ఒమెరి అఫ్గనిస్తాన్‌లోని పాక్టియా ప్రావిన్స్‌లో చోటుచేసుకున్నట్లు ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. కాగా గతంలో తాలిబన్లు వాహనాల్లో సంగీతాన్ని నిషేధించారు. అంతేకాకుండా వివాహాది శుభకార్యాల్లో లైవ్ మ్యూజిక్ కూడా తాలిబన్లు నిషేధించారు. మహిళలు, పురుషులు వేర్వేరు హాళ్లలో సంభరాలు జరుపుకోవాలనే వింత హుకుం జారీ చేసినట్లు అఫ్గనిస్తాన్‌లోని ఓ హోటల్ యజమాని గత ఏడాది అక్టోబర్‌లో మీడియాకు తెలిపాడు.
హెరాత్ ప్రావిన్స్‌కు చెందిన బట్టల దుకాణాల్లోని బొమ్మల (మానెక్వీన్స్) తలలు తొలగించాలని, అది షరియత్ చట్ట ఉల్లంఘన కిందకు వస్తుందని తాలిబన్లు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ విధమైన నిషేధాజ్ఞలు కాబుల్ వీధుల్లో మళ్లీ కనిపించడం ప్రారంభించాయి. అఫ్గనిస్తాన్ టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే డ్రామాలు, ఇతర కార్యక్రమాల్లో మహిళలను ప్రదర్శించడం నిలిపివేయాలని పిలుపునిస్తూ మత పరమైన మార్గదర్శకాలను కూడా తాలిబన్ మినిస్ట్రీ విడుదల చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు అమలుచేయకపోవచ్చని సమూహం చెప్పినప్పటికీ, కరడుగట్టిన షరియా చట్టాన్ని మాత్రం అక్కడ తప్పక అమలుచేసి తీరుతారనేది చరిత్ర చెబుతోంది.
20 ఏళ్ల తర్వాత మరోసారి అఫ్గనిస్తాన్ తాలిబన్ల నియంత్రణలోకి రావడంతో, తీవ్రవాదుల పాలనలో అక్కడి మహిళలు సందిగ్ధభరితమైన అనిశ్చిత జీవితాన్ని జీవించాల్సిఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
Video : Taliban burn musician's musical instrument as local musicians weeps. This incident happened in #ZazaiArub District #Paktia Province #Afghanistan . pic.twitter.com/zzCp0POeKl
— Abdulhaq Omeri (@AbdulhaqOmeri) January 15, 2022
చదవండి: నన్ను కాదని సోనూసూద్ సోదరికి సీటిచ్చారు..! అందుకే బీజేపీలోకి..: కాంగ్రెస్ ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment