Musical instruments
-
మనసుకు నచ్చిన పని.. పాతిక సంవత్సరాల నుంచి ఇదే పనిలో..
ఈనెల 6 నుంచి 18 వరకు ఫ్రాన్స్‌లోని ‘ఇండియన్ యూరోపియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్, నాన్ట్స్’లో ‘ఇండియా– ఆఫ్రికా టువార్డ్స్ ఎ డైలాగ్ ఆఫ్ హ్యూమానిటీస్’ సదస్సు జరిగింది. ఆదివాసీల సంస్కృతి, సంగీతం గురించిన సమగ్ర పరిశోధనకు ఉపకరించే ఆ కార్యక్రమానికి ఆహ్వానితులుగా హాజరైన ప్రొఫెసర్ గూడూరు మనోజ ఆ వివరాలను సాక్షితో పంచుకున్నారు. ‘‘నేను పుట్టింది వరంగల్‌లో. మా నాన్న డీపీఓ. ఆయన బదలీల రీత్యా నా ఎడ్యుకేషన్ తెలంగాణ జిల్లాల్లో ఏడు స్కూళ్లు, నాలుగు కాలేజీల్లో సాగింది. పెళ్లి తర్వాత భర్త ఉద్యోగ రీత్యా మహారాష్ట్ర, నాందేడ్‌కి వెళ్లాను. అక్కడే ఇరవై ఏళ్లు నాందేడ్‌లోని స్వామి రామానంద తీర్థ మరాఠ్వాడా యూనివర్సిటీకి చెందిన ‘స్కూల్ ఆఫ్ లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ కల్చర్ స్టడీస్’లో లెక్చరర్‌గా ఉద్యోగం చేశాను. ఆ తర్వాత నిజామాబాద్‌లో కొంతకాలం చేసి, మహబూబ్‌నగర్ పాలమూరు యూనివర్సిటీ నుంచి 2021లో రిటైరయ్యాను. సంగీతసాధనాల అధ్యయనం ఫ్రాన్స్ సమావేశం గురించి చెప్పడానికి ముందు నేను ఎందుకు ఈ పరిశోధనలోకి వచ్చానో వివరిస్తాను. నా ఉద్దేశంలో ఉద్యోగం అంటే రోజుకు మూడు క్లాసులు పాఠం చెప్పడం మాత్రమే కాదు, యువతకు వైవిధ్యమైన దృక్పథాన్ని అలవరచాలి. నా ఆసక్తి కొద్దీ మన సంస్కృతి, కళలు, కళా సాధనాల మీద అధ్యయనం మొదలైంది. అది పరిశోధనగా మారింది. ఆ ప్రభావంతోనే పాలమూరు యూనివర్సిటీలో నేను ఫోర్త్ వరల్డ్ లిటరేచర్స్ని పరిచయం చేయగలిగాను. మన సాహిత్యాన్ని యూరప్ దేశాలకు పరిచయం చేయడం గురించి ఆలోచన కూడా మొదలైంది. విదేశీ సాహిత్యానికి అనువాదాలు మన సాహిత్యంలో భాగమైపోయాయి. అలాగే మన సాహిత్యాన్ని, సాహిత్యం ద్వారా సంస్కృతిని ప్రపంచానికి తెలియచేయాలని పని చేశాను. వీటన్నింటినీ చేయడానికి నా మీద సామల సదాశివగారు, జయధీర్ తిరుమల రావు గారి ప్రభావం మెండుగా ఉంది. తిరుమలరావుగారు ఆదిధ్వని ఫౌండేషన్ ద్వారా నాలుగు దశాబ్దాలుగా చేస్తున్న పరిశ్రమలో భాగస్వామినయ్యాను. ఆదివాసీ గ్రామాల్లో పర్యటించి ధ్వనికి మూలకారణమైన సాధనాలను తెలుసుకోవడం, సేకరించడం మొదలుపెట్టాం. ఇల్లు, పిల్లలను చూసుకోవడం, ఉద్యోగం చేసుకుంటూనే దాదాపుగా పాతిక సంవత్సరాల నుంచి ఇదే పనిలో నిమగ్నమయ్యాను. చెంచు, కోయ, గోండ్లు నివసించే గ్రామాలకు నెలకు ఒకటి –రెండుసార్లు వెళ్లేవాళ్లం. గోండ్ లిపికి కంప్యూటర్ ఫాంట్ తయారు చేయగలిగాం. గోంద్ భాష యూనికోడ్ కన్సార్టియంలోకి వెళ్లింది కాబట్టి ఇక ఆ భాష అంతరించడం అనేది జరగదు. ఆదిధ్వని ఫౌండేషన్ ద్వారా 250 సంగీత సాధనాల వివరాలను క్రోడీకరించాం. మూలధ్వని పేరుతో పుస్తకం తెచ్చాం. అందులో క్రోడీకరించిన సంగీతసాధనాలు, 27 మంది కళాకారులను ఢిల్లీకి తీసుకువెళ్లి 2020లో ప్రదర్శనలివ్వడంలోనూ పని చేశాను. దేశంలో తెలంగాణ కళలకు మూడవస్థానం వచ్చింది. ఆద్యకళకు ఆహ్వానం ‘ఇండియన్ యూరోపియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్, నాన్ట్స్’ ఈ ఏడాది నిర్వహించిన ‘ఇండియా– ఆఫ్రికా టువార్డ్స్ ఎ డైలాగ్ ఆఫ్ హ్యూమానిటీస్’ సదస్సుకు మా ఆదిధ్వని ఫౌండేషన్ నిర్వహించే ‘ఆద్యకళ’కు ఆహ్వానం వచ్చింది. అందులో పని చేస్తున్న వాళ్లలో నేను, జయధీర్ తిరుమలరావుగారు సదస్సుకు హాజరయ్యాం. ‘ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఎ మ్యూజియమ్’ అనే అంశంపై మీద పత్రం సమర్పించాం. మనదేశంలో ఆదివాసీ సంస్కృతి మీద పరిశోధన చేసిన ఫ్రెంచ్ పరిశోధకులు డేనియల్ నాజర్స్తోపాటు అనేక మంది ఫ్రెంచ్ ప్రొఫెసర్లు ఈ సమావేశాలకు హాజరయ్యారు. అయితే వారంతా మనదేశంలో మూల సంస్కృతి, సంగీతవాద్యాలు అంతరించి పోయాయనే అభిప్రాయంలో ఉన్నారు. మేము వారి అపోహను తొలగించగలిగాం. అంతరించి పోతోందనుకున్న సమయంలో చివరి తరం కళాకారులను, కళారూపాలను ఒడిసి పట్టుకున్నామని చెప్పాం. కాటమరాజు కథ, పన్నెండు పటాలకు సంబంధించిన బొమ్మలు, కోయ పగిడీలను ప్రదర్శించాం. ఆఫ్రికాలో కళారూపాలు ఒకదానికి ఒకటి విడిగా ఉంటాయి. మన దగ్గర కథనం, సంగీతవాద్యం, పటం, గాయకుడు, బొమ్మ అన్నీ ఒకదానితో ఒకటి ముడివడి వుంటాయి. పారిస్‌లో ‘నేషనల్ మ్యూజియమ్ ఆఫ్ ఏషియన్ ఆర్ట్స్’, ఆంథ్రోపాలజీ మ్యూజియాలను కూడా చూశాం. ‘ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఎ మ్యూజియమ్’ అనే మా పేపర్‌కి సదస్సులో మంచి స్పందన లభించింది. ఇండియాలో మరో పార్శా్వన్ని చూసిన ఆనందం వారిలో వ్యక్తమైంది. యునెస్కో అంబాసిడర్, మనదేశానికి శాశ్వత ప్రతినిధి విశాల్ వి శర్మ కూడా ప్రశంసించారు. (క్లిక్ చేయండి: ఉందిలే మంచి టైమ్ ముందు ముందూనా...) చేయాల్సింది ఇంకా ఉంది ఆది అక్షరం, ఆది చిత్రం, ఆది ధ్వని, ఆది లోహ కళ, ఆది జీవనం, పరికరాలతో మ్యూజియం ఏర్పాటు చేయాలి. మ్యూజియం ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రెండెకరాల స్థలం కేటాయించాలి. మ్యూజియం హైదరాబాద్ నగర శివారులో ఉంటే భావి తరాలకు మ్యూజియంకు సంబంధించిన పరిశోధనకి ఉపయోగపడుతుంది.రిటైర్ అయిన తర్వాత మనసుకు నచ్చిన పని చేయాలని నమ్ముతాను. ‘ఆదిధ్వని’ ద్వారా ఐదు మ్యూజియాల స్థాపనకు పని చేశాను. నా జీవితం ఆదిధ్వనికే అంకితం’’ అన్నారీ ప్రొఫెసర్. హైదరాబాద్‌లోని ఆమె ఇల్లు ఆదివాసీ సంస్కృతి నిలయంగా ఉంది. – వాకా మంజులారెడ్డి శబ్దం– సాధనం ప్రస్తుతం ‘ఆది చిత్రం’ పుస్తకం తెచ్చే పనిలో ఉన్నాం. ఇదంతా ఒక టీమ్ వర్క్. మన దగ్గర ఆదివాసీ గిరిజనులు, దళిత బహుజనుల దగ్గర నిక్షిప్తమై ఉన్న సంస్కృతిని వెలికి తీయడానికి మొదటి మార్గం శబ్దమే. ఆదివాసీలు తమ కథలను పాటల రూపంలో గానం చేసే వారు. కొన్ని కథలు తాటాకుల మీద రాసి ఉన్నప్పటికీ ఎక్కువ భాగం మౌఖికంగా కొనసాగేవి. మౌఖిక గానంలో ఇమిడి ఉన్న కథలను రికార్డ్ చేసుకుని, శ్రద్ధగా విని అక్షరబద్ధం చేశాం. ‘గుంజాల గొండి అధ్యయన వేదిక’ ఆధ్వర్యంలో ఐటీడీఏతో కలిసి చేశాం. ఓరల్ నేరేటివ్‌కి అక్షర రూపం ఇవ్వడాన్ని ‘ఎత్తి రాయడం’ అంటాం. ఆది కళాకారులను వెలికి తెచ్చే మా ప్రయత్నంలో భాగంగా సమ్మక్క– సారక్క కథను ఆలపించే పద్మశ్రీ సకినె రామచంద్రయ్యను పరిచయం చేశాం. ఆ కథను ఎత్తిరాసిన పుస్తకమే ‘వీరుల పోరుగద్దె సమ్మక్క సారలమ్మల కథ – కోయడోలీలు చెప్పిన కథ’. ఈ ప్రయత్నం రీసెర్చ్ మెథడాలజీలో పెద్ద టర్నింగ్ పాయింట్. – ప్రొఫెసర్ గూడూరు మనోజ, సభ్యులు, ఆదిధ్వని ఫౌండేషన్ -
కన్నీళ్లకు కరగని తాలిబన్లు! అతని కళ్ల ముందే..
కాబుల్: అఫ్గన్‌లో తాలిబన్ల షరతుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా సంగీత వాయిద్యాల (మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్)ను అఫ్గన్ తాలిబన్లు నడి వీధిలో తగలబెడుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ను అఫ్గన్ తాలిబన్లు తగలబెడుతుండగా కన్నీరు పెట్టుకుంటున్న సంగీత విద్యాంసుడు, గన్ పట్టుకుని అతన్ని చూసి హేళనగా నవ్వుతున్న తాలిబన్ ఈ వీడియోలో కనిపిస్తారు. చుట్టు చేరిన వారిలో కొంత మంది అతని దయనీయ స్థితిని వీడియో తీయడం కూడా కనిపిస్తుంది. ఈ సంఘటనకు చెందిన వీడియోను అఫ్గన్ జర్నలిస్టు అబ్దుల్హాక్ ఒమెరి అఫ్గనిస్తాన్‌లోని పాక్టియా ప్రావిన్స్‌లో చోటుచేసుకున్నట్లు ట్విటర్లో పోస్ట్ చేశాడు. కాగా గతంలో తాలిబన్లు వాహనాల్లో సంగీతాన్ని నిషేధించారు. అంతేకాకుండా వివాహాది శుభకార్యాల్లో లైవ్ మ్యూజిక్ కూడా తాలిబన్లు నిషేధించారు. మహిళలు, పురుషులు వేర్వేరు హాళ్లలో సంభరాలు జరుపుకోవాలనే వింత హుకుం జారీ చేసినట్లు అఫ్గనిస్తాన్‌లోని ఓ హోటల్ యజమాని గత ఏడాది అక్టోబర్‌లో మీడియాకు తెలిపాడు. హెరాత్ ప్రావిన్స్‌కు చెందిన బట్టల దుకాణాల్లోని బొమ్మల (మానెక్వీన్స్) తలలు తొలగించాలని, అది షరియత్ చట్ట ఉల్లంఘన కిందకు వస్తుందని తాలిబన్లు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ విధమైన నిషేధాజ్ఞలు కాబుల్ వీధుల్లో మళ్లీ కనిపించడం ప్రారంభించాయి. అఫ్గనిస్తాన్ టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే డ్రామాలు, ఇతర కార్యక్రమాల్లో మహిళలను ప్రదర్శించడం నిలిపివేయాలని పిలుపునిస్తూ మత పరమైన మార్గదర్శకాలను కూడా తాలిబన్ మినిస్ట్రీ విడుదల చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు అమలుచేయకపోవచ్చని సమూహం చెప్పినప్పటికీ, కరడుగట్టిన షరియా చట్టాన్ని మాత్రం అక్కడ తప్పక అమలుచేసి తీరుతారనేది చరిత్ర చెబుతోంది. 20 ఏళ్ల తర్వాత మరోసారి అఫ్గనిస్తాన్ తాలిబన్ల నియంత్రణలోకి రావడంతో, తీవ్రవాదుల పాలనలో అక్కడి మహిళలు సందిగ్ధభరితమైన అనిశ్చిత జీవితాన్ని జీవించాల్సిఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. Video : Taliban burn musician's musical instrument as local musicians weeps. This incident happened in #ZazaiArub District #Paktia Province #Afghanistan . pic.twitter.com/zzCp0POeKl — Abdulhaq Omeri (@AbdulhaqOmeri) January 15, 2022 చదవండి: నన్ను కాదని సోనూసూద్ సోదరికి సీటిచ్చారు..! అందుకే బీజేపీలోకి..: కాంగ్రెస్ ఎమ్మెల్యే -
ఆది ధ్వనికి... ఆతిథ్యం
సాక్షి, హైదరాబాద్: ఆదివాసి నగరా, గోండుతుడుం, కోయ డోలు,బుర్ర వీణ,మట్టి ఢంకా,అదివాసి మద్దెల ఇంకా చెక్క చెమిడికలు.. ఇలా ఒకటా..రెండా ఏకంగా అరుదైన 124 గిరిజన సంగీత వాయిద్యాలన్నీ ఒకే చోట దర్శనమివ్వను న్నాయి. వందల ఏళ్ల గోండు గూడేలు,ఆదివాసి పల్లెలకు సంగీత ఆహ్లాదం పంచి క్రమంగా కనుమరుగవుతున్న వాయిద్యాలన్నీ 9వ తేదీ నుంచి మాదాపూర్‌లోని స్టేట్‌ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించనున్నారు. తెలంగాణ ఆది ధ్వని వేదిక ఆధ్వర్యంలో 13వ తేదీ వరకు సాగే ప్రదర్శనలో కనుమరుగైన అనేక సంగీత వాయిద్య పరికరాలను ప్రదర్శనగా ఉంచుతారు. పరికరాలతో ఆదివాసి కిన్నెర,బుర్రవీణ, రుంజ తదితర ఎనిమిది రకాల వాయిద్యాలను సైతం ప్రదర్శించే కళాకారులు ఈ వేదికపై పాలుపంచుకోనున్నారు. ఈ విషయమై నిర్వాహకులు ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు ‘సాక్షి’ తో మాట్లాడుతూ ఆదిలాబాద్,ఖమ్మం, బస్తర్ జిల్లాల్లో వినియోగించిన సంగీత పరికరాలన్నీ ప్రదర్శనలో ఉంచుతామని తెలిపారు. దేశంలో అతిపెద్ద గిరిజన సంగీత ప్రదర్శన దీన్ని పేర్కొనవచ్చని జయధీర్ చెప్పారు. -
సుతిమెత్తని శ్రుతిధ్వనులు
ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఇటీవల పుణేలో జరిగిన ‘డుమ్రూ’ ఫెస్టివల్.. పురుషాధిపత్యాన్ని ఛేదించి, పైచేయి సాధించిన ‘ఉమెన్ ఈవెంట్’గా ప్రతి హృదయంలో ప్రతిధ్వనించింది. ‘జస్ట్ బీట్ ఇట్..’ మైఖేల్ జాక్సన్ పాట! కొట్టావా లేదా అన్నదే ముఖ్యం. ఎట్లా కొట్టావన్నది కాదు. తప్పో, రైటో కాదు. అది నీ ఫైట్. జస్ట్ బీటిట్. ఓడామా గెలిచామా కాదు. నువ్వేంటో చూపిస్తున్నావ్.. ఇదీ ఈ పాట అర్థం. అమ్మాయిలు కూడా తామేంటో చూపిస్తున్నారు. లలిత వాద్యాలను ఒడిలోంచి తీసి, మెల్లగా పక్కన పెట్టి.. డ్రమ్స్‌ని ‘డిష్’ మనిపిస్తున్నారు. తబలా చెంపల్ని లయబద్ధంగా వాయించేస్తున్నారు. మృదంగంపై దరువేస్తున్నారు. మగాళ్లకంటూ ఇప్పుడేం సంగీతవాద్యాలు మిగిల్లేవు! పురుషుల ఆధిపత్య రంగాలను వారు తమదైన వినూత్న శైలితో బద్దలు కొట్టారు. ఎన్నో ఏళ్ల నుంచి మగవారికే పరిమితమై ఉన్న వాద్యాలపై వారు బలమైన సంతకం చేశారు. పురుషాధిక్య భావనలు తగ్గేందుకు ఈ అమ్మాయిలు తమ వంతు కృషి చేస్తున్నారు. మృదంగం, తబలా, జాజ్ తదితర వాయిద్యాల ప్రదర్శనలు ఎక్కువగా మగవారికే పరిమితం. కేవలం పియానో, వయొలిన్ వంటి వాద్యాలతోనో, సంగీత, నృత్య ప్రదర్శనలతోనో ఆగిపోకుండా దరువుల్ని కూడా అందుకున్నారు. జాతీయస్థాయిలోనే కాకుండా తమ తమ రాష్ట్రాల్లోనూ ఆయా వాయిద్యాల ప్రదర్శనల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఇటీవల పుణేలో నిర్వహించిన ‘డుమ్రూ’ ఫెస్టివల్ ఇలా.. పురుషాధిపత్యాన్ని ఛేదించిన, పైచేయి సాధించిన ఈవెంట్‌గా నిలిచింది. మొదట 2011లో పుణేలో మొదలైన ఈ వాద్య ఉత్సవాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. అయితే నిర్వాహకులు ఓ ముఖ్యమైన అంశాన్ని ఆలస్యంగా గుర్తించారు. ఈ సంగీతోత్సవాల్లో మహిళా ప్రదర్శకులకు చోటు లేకపోవడం ఒక పెద్ద వెలితిగా వారికి కనిపించింది. దీనిని సవరించుకునేందుకు 2016లో మొదటిసారిగా కేవలం మహిళా వాద్యకారులతోనే కార్యక్రమాలు నిర్వహించారు. ఏడాదిన్నర లోగానే మళ్లీ కేవలం అమ్మాయిల వాద్య కచేరీలు.. అందునా జాజ్, తబలా, మృదంగం వంటి సంగీత సాధనాలతో ప్రదర్శనలు నిర్వహించారు. కొన్ని దశాబ్దాల కింద మహిళల ప్రదర్శనలకు మృదంగం తదితర వాద్యాలను మోగించేందుకు కూడా పురుష వాద్యకారులు ఇష్టపడని రోజుల నుంచి.. ఇప్పుడు తమకు తాముగా ఆ వాయిద్య ప్రదర్శనలిచ్చే స్థాయికి మహిళలు చేరుకున్నారని డుమ్రూ ఫెస్టివల్ వ్యవస్థాపక డైరెక్టర్ ఆదిత్య ప్రభు అంటారు. ‘‘ఈ సంగీత ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో హాజరవుతున్న వారికి మహిళా వాద్యకళాకారుల ప్రదర్శనల ద్వారా అమ్మాయిలు ఏ విషయంలోనూ అబ్బాయిల కంటే తక్కువ కాదనే ఓ సందేశాన్ని ఇవ్వదలిచాం’’ అన్నారు ఆదిత్య. ఈ ఏడాది ‘ ఉమెన్ ఆఫ్ రిథమ్’ పేరిట నిర్వహించిన ఉత్సవంలో ఏడుగురు మహిళా వాద్యకళాకారులు ప్రదర్శనలిచ్చారు. పుణేలో దీనిని నిర్వహించినందువల్ల ముగ్గురు ఆ ప్రాంతానికి చెందినవారే ఉన్నారు. వీరిలో 15 ఏళ్ల జాజ్ డ్రమ్మర్ అనన్య పాటిల్ అందరికంటే పిన్న వయస్కురాలు. మిగతావాళ్లు సవానీ తల్వాల్కర్, మహిమా ఉపాధ్యాయ్, మిథాలీ కర్గాంవ్‌కర్, సిద్ధిషా, రేష్మా పండిట్, చారు హరిహరన్. – కె.రాహుల్ -
శాస్త్రవేత్త కాకపోయి ఉంటే...
మీకు అల్బర్ట్ ఐన్‌స్టీన్ తెలుసా? సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త అని సైన్సు పుస్తకంలో చదువుతుంటారు కదా! ఆయన గురించి మీకు తెలియని మరో సంగతేమిటంటే... ఆయనకు సంగీతంలో మంచి ప్రవేశం ఉంది. ఐన్‌స్టీన్ పదమూడో ఏట మోజార్ట్ అనే సంగీతకారుడి కచేరీ విన్నాడు. అంతే సంగీతంపై మక్కువ ఏర్పడింది. అప్పటి నుంచి వయోలిన్, పియానో సాధన ప్రారంభించాడు. శాస్త్ర పరిశోధనలు, ప్రయోగాల్లో తలమునకలుగా ఉంటూ, తీరిక వేళల్లో సంగీత సాధనతో సేదదీరేవాడు. శాస్త్రవేత్త కాకపోయి ఉంటే సంగీతకారుడిగా ఎదిగేవాడినని చెప్పేవాడు.