
సాక్షి, అనంతపురం : కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్సీ షేక్ మహ్మద్ ఇక్బాల్ స్పష్టం చేశారు. కరోనా కట్టడికి సీఎం జగన్ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కోవిడ్-19తో ఇంటికే పరిమితం అయిన పేదలకు ఉచితంగా రేషన్ అందజేయడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి రూ. వెయ్యి ఇచ్చి ఆర్థిక భరోసా కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శనివారం కొత్తగా మరో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment