కర్నూలు: వెలుగు యానిమేటర్లు ఈ నెల 23న తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిఘా తీవ్రతరం చేశారు. యానిమేటర్ల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండు రోజుల ముందుగానే జిల్లా నుంచి వందలాది మంది వివిధ మార్గాల్లో హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో బస్టాప్‌లు, రైల్వేస్టేషన్లలో పోలీసు అధికారులు తిష్ట వేసి కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ గుంపుగా కాకుండా.. ఎవరికి వారు పోలీసుల కళ్లుగప్పి లారీలు, ఇతర వాహనాల్లో తరలివెళ్లారు.
అయితే కర్నూలు కొత్తబస్టాండ్ వద్ద నాల్గవ పట్టణ సీఐ రంగనాయకులు, రైల్వేస్టేషన్‌లో రెండో పట్టణ సీఐ ములకన్న, పంచలింగాల చెక్‌పోస్టు దగ్గర తాలూకా పోలీసులు తిష్ట వేసి యానిమేటర్లను అడ్డుకునేందుకు వాహనాల తనిఖీ నిర్వహించా రు. 2013 మే నెలలో అప్పటి సెర్ఫ్ సీఈఓ ఇచ్చి న సర్కులర్ ప్రకారం గ్రామైక్య సంఘం అసిస్టెం ట్లకు నెలకు రూ.2 వేల ప్రకారం రెండు నెలల పాటు జీతాలు ఇచ్చి.. ఆ తర్వాత నిలిపేశారు. 15 మాసాలుగా జీతాల సాధనకు వివిధ రూపా ల్లో ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేకపోవడంతో అసెంబ్లీ ముట్టడికి తరలివెళ్లారు.
యానిమేటర్ల కదలికలపై పోలీసు నిఘా
Published Mon, Dec 22 2014 3:52 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement