animators
-
‘సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం’
సాక్షి, చిత్తూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని వీవోఏ, సంఘమిత్ర, మెప్మా సిబ్బంది తెలిపారు. ఏపీ ప్రభుత్వం వారి జీతాలు మూడు వేల నుంచి 10 వేలకు పెంచడంతో మంగళవారం సంబరాలు చేసుకున్నారు. సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి మాట్లాడుతూ..ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న గొప్ప నేత వైఎస్ జగన్ అని కొనియాడారు. అనంతరం తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ మంజూరు చేసిన వేలాది మొక్కలను ఇంటింటికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి: ఏపీ ప్రభుత్వం వీవోఏ,ఆర్పీలకు గౌరవ వేతనాన్ని పదివేలు పెంచడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం జంగారెడ్డి గూడెం మసీదు సెంటర్లో ఎమ్మెల్యే ఎలీజా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎలీజా మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలను వైఎస్ జగన్ చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని తెలిపారు. ఆరు నెలల్లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని వెల్లడించారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో కనీస వేతనాలు పెంచాలని ఆర్పీలు, వీవోఏలు ధర్నాలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ జగన్ పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా: తమ గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచడం పట్ల కైకలూరు నియోజకవర్గ బుక్ కీపర్లు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా: సీఎం వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు శృంగవరపుకోట వీవోఏలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఇప్పటివరుకు చాలీ చాలని జీతాలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామన్నారు. 10 వేలు వేతనాన్ని పెంచిన సీఎం వైఎస్ జగన్‌కు ఎంతో రుణపడి ఉంటామన్నారు. దేవి కూడలిలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి వీవోఏలు పూలమాలలు వేశారు. తూర్పుగోదావరి: సీఎం వైఎస్ జగన్ పదివేలు గౌరవ వేతనం ప్రకటించడంపై యానిమేటర్లు హర్షం వ్యక్తం చేశారు. ముమ్మిడివరం వైఎస్సార్సీపీ కార్యాలయంలో సీఎం జగన్ చిత్రపటానికి మెప్మా, ఆర్పీ ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. -
ఫిర్యాదు చేశామని ఇప్పుడు గుర్తొచ్చామా?
గొల్లప్రోలు (పిఠాపురం): గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులు అండ చూసుకుని అక్రమాలకు, అవకతవకలకు పాల్పడిన చెందుర్తి గ్రామానికి చెందిన యానిమేటర్ మాచవరపు పద్మకు ఆమెతో పనిచేస్తున్న మిగిలిన యానిమేటర్లు సంఘీభావం తెలపడం వివాదాస్పదంగా మారింది. యానిమేటర్ పద్మ చెందుర్తి గ్రామంలో పలు మహిళా సంఘాలకు చెందిన పసుపు–కుంకుమ నిధులు, స్కాలర్ షిప్పులు భారీ ఎత్తున స్వాహా చేసినట్లు గ్రామస్తులు ఎమ్మెల్యే దొరబాబుకు, డీఆర్డీఏ పీడీ మధుసూదనరావులకు ఫిర్యాదు చేశారు. దీంతో యానిమేటర్ పద్మ అవకతవకలు బయటపడడంతో మిగిలిన యానిమేటర్లు ఆమె తప్పును కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 32 మంది యానిమేటర్లు రెండు ఆటోలపై చెందుర్తి గ్రామానికి చేరుకున్నారు. యానిమేటర్ పద్మపై ఫిర్యాదు చేసిన డ్వాక్రా సంఘాల వద్దకు వెళ్లి ‘‘తప్పు జరిగిపోయింది.. మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం. ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని కోరారు. దీంతో విషయం తెలుసుకున్న పలువురు మహిళా సంఘాల సభ్యులు, స్కాలర్‌షిప్పు బాధితులు యానిమేటర్లను నిలదీశారు. ఫిర్యాదు చేశామని ఇప్పుడు గుర్తొచ్చామా? అని ప్రశ్నించారు. ఇన్నాళ్లు టీడీపీ నాయకుల అండ చూసుకుని ఎవరికి చెప్పుకుంటారో.. ఏమి చేసుకుంటారో అని ఇష్టాను సారంగా మాట్లాడేవారన్నారు. ఇప్పుడు చేసిన అవకతవకలు బయట పడుతున్నాయనే ఉద్దేశంతో ఉద్యోగాలు పోతాయని ఇప్పుడు గుర్తుకు వచ్చామా? అని బాధితులు వాసా వెంకయమ్మ, చీకట్ల కుమారి, ద్రోణం చిన్ని, బండి ప్రసాద్, నక్కా కృష్ణ తదితరులు నిలదీసారు. పరిస్థితి బయటకు పొక్కడంతో యానిమేటర్లు వెంటనే ఆటోలపై గ్రామం విడిచి వెళ్లిపోయారు. -
కనీస వేతనాలు చెల్లించాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : వెలుగులో పని చేస్తున్న యానిమేటర్స్‌లకు కనీస వేతనం రూ 5వేల రూపాయలు చెల్లించాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని సీఐటీయు కార్యాలయంలో జిల్లా విసృత స్దాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వెలుగు విఓలకు జాతీయ గ్రామీణ జీవనోపాధి పధకం కింద గ్రామస్దాయిలో పని చేస్తున్న యానిమేటర్స్‌లకు సంవత్సరాల తరబడి వెట్టి చాకిరి చేయించుకుంటూ వారికి కనీస వేతనాలు చెల్లించక పోవడం దారుణమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో యానిమేటర్స్ ప్రభుత్వ గుర్తింపు, వేతనాల కోసం అనేక పోరాటాలు చేస్తే ప్రస్తుత టిడిపి ప్రభుత్వం సెర్ప్ నుండి రూ 2వేల రూపాయలు గౌరవ వేతనం చెల్లించిందన్నారు. టిడిపి ప్రభుత్వం యూనిమేటర్స్పై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నప్పటికి వేతనాలు మాత్రం ఇంతవరకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ప్ హెల్ప్ గ్రూపుల ట్రైనరీ పేరుతో యానిమేటర్స్ చేసే పనులతో పాటు పొదుపు సంఘాలకు శిక్షణ పేరుతో వీరిని తొలగించే ప్రయత్నాలను ప్రభుత్వం మానుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పదించి యానిమేటర్స్‌కు గుర్తింపు కార్డులు అందజేసి పనిభారాన్ని తగ్గించాలన్నారు. లేనిపక్షంలో అందోళన బాట పడతామన్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయు నాయకులు ప్రభుదాస్, శేఖర్, రత్నం, రామాంజులు, తదితరులు పాల్గొన్నారు. -
యానిమేటర్ల కదలికలపై పోలీసు నిఘా
కర్నూలు: వెలుగు యానిమేటర్లు ఈ నెల 23న తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిఘా తీవ్రతరం చేశారు. యానిమేటర్ల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండు రోజుల ముందుగానే జిల్లా నుంచి వందలాది మంది వివిధ మార్గాల్లో హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో బస్టాప్‌లు, రైల్వేస్టేషన్లలో పోలీసు అధికారులు తిష్ట వేసి కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ గుంపుగా కాకుండా.. ఎవరికి వారు పోలీసుల కళ్లుగప్పి లారీలు, ఇతర వాహనాల్లో తరలివెళ్లారు. అయితే కర్నూలు కొత్తబస్టాండ్ వద్ద నాల్గవ పట్టణ సీఐ రంగనాయకులు, రైల్వేస్టేషన్లో రెండో పట్టణ సీఐ ములకన్న, పంచలింగాల చెక్‌పోస్టు దగ్గర తాలూకా పోలీసులు తిష్ట వేసి యానిమేటర్లను అడ్డుకునేందుకు వాహనాల తనిఖీ నిర్వహించా రు. 2013 మే నెలలో అప్పటి సెర్ఫ్ సీఈఓ ఇచ్చి న సర్కులర్ ప్రకారం గ్రామైక్య సంఘం అసిస్టెం ట్లకు నెలకు రూ.2 వేల ప్రకారం రెండు నెలల పాటు జీతాలు ఇచ్చి.. ఆ తర్వాత నిలిపేశారు. 15 మాసాలుగా జీతాల సాధనకు వివిధ రూపా ల్లో ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేకపోవడంతో అసెంబ్లీ ముట్టడికి తరలివెళ్లారు. -
కదం తొక్కిన యానిమేటర్లు
కలెక్టరేట్ ముట్టడి 300 మంది అరెస్టు, విడుదల విశాఖపట్నం : ఇందిర క్రాంతి పథం (ఐకేపీ) యానిమేటర్లు బుధవారం కలెక్టరేట్ ఎదుటు కదం తొక్కారు. 15 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. యానిమేటర్లపై రాజకీయ వేధింపులు, అధికారుల తొలగింపులు ఆపాలని, గుర్తింపు కార్డులు, నియామకపత్రాలు ఇవ్వాలని ప్లకార్డులు చేతబూని కలెక్టరేట్ గేటు వద్ద నినాదాలు చేస్తూ బైఠాయించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ పది రోజులుగా ఐకేపీ యానిమేటర్లు చేస్తున్న రాష్ట్ర వ్యాప్త సమ్మెను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. నిత్యం మహిళా ఉద్ధరణపై ఉపన్యాసాలు చేస్తున్న సీఎం చంద్రబాబు మహిళలచేత వెట్టిచాకిరీ చేయించుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. వీరి పోరాటానికి, న్యాయమైన సమస్యల పరిష్కారానికి సీపీఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. జిల్లా కార్యదర్శి లోకనాథం మాట్లాడుతూ యానిమేటర్లకు అభయ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ప్రభావతి, జిల్లా అధ్యక్షురాలు దాక్షాయిణి, సీఐటీయూ వర్కింగ్ కమిటీ కన్వీనర్ అరుణ, ఐకేపీ జిల్లా కార్యదర్శి, ఆర్. రామసుశీల, అధిక సంఖ్యలో ఐకేపీ యానిమేటర్లు పాల్గొన్నారు. -
ఊహలకు జీవం పోసే.. యానిమేటర్
ఛోటా భీమ్, హనుమాన్, రామాయణ, మహాభారత్, డోరేమాన్, ష్రెక్ లాంటి యానిమేషన్ చిత్రాలు ప్రేక్షకులకు కనువిందు కలిగిస్తాయి. సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. కేవలం ఊహాలోకానికే పరిమితమైన ఈ పాత్రలు కళ్లముందు కదలాడుతాయి. ఆడుతాయి, పాడుతాయి, శత్రువులతో పోరాడుతాయి, లెక్కలేనన్ని సాహసాల్లో పాల్గొంటాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాయి. చూపరులకు విజ్ఞానం, వినోదం పంచుతాయి. కాల్పనిక పాత్రలు దృశ్యరూపంలోకి మారి, ఇన్ని పనులు ఎలా చేయగలుగుతున్నాయి? యానిమేటర్ల కృషితోనే ఇదంతా సాధ్యమవుతోంది. బొమ్మను గీసి, ప్రాణం పోసి, కనుల ముంగిట సజీవంగా కదలాడేలా చేసే అపర బ్రహ్మలు యానిమేటర్లు. అప్‌కమింగ్ కెరీర్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యానిమేషన్ రంగం కొత్తపుంతలు తొక్కుతోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు వేదికగా నిలుస్తోంది. వినూత్నమైన ఊహాశక్తి, సృజనాత్మకత, కనువిందైన రంగురంగుల బొమ్మలు గీసే నేర్పు ఉంటే చాలు.. యానిమేషన్ రంగంలో అద్భుతాలు సృష్టించొచ్చు. తగిన అనుభవం సంపాదిస్తే దేశ విదేశాల్లో రూ.లక్షల్లో వేతనాలు అందుకోవచ్చు. ప్రజ్ఞావంతులైన యానిమేటర్లకు విదేశాలు ఎర్ర తివాచీ పరుస్తున్నాయి. ఉన్నత హోదాలను కట్టబెడుతున్నాయి. హాలీవుడ్లో భారతీయ యానిమేటర్లు సత్తా చూపుతున్నారు. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన ఎన్నో చిత్రాలు భారత యానిమేటర్ల చేతుల్లోనే రూపుదిద్దుకోవడం విశేషం. యానిమేషన్ నిపుణులకు డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. దీంతో మన దేశంలోని టెక్నాలజీ, ఆర్ట్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్స్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్లో ఎన్నో స్పెషలైజేషన్లను ఆఫర్ చేస్తున్నాయి. యానిమేషన్ రంగం ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉంటుంది. 90 నిమిషాల నిడివిగల చిత్రాన్ని రూపొందించేందుకు కొన్నిసార్లు వారాలు, నెలలు, సంవత్సరాలపాటు కూడా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. యానిమేటర్లకు సహనం, ఓర్పు చాలా అవసరం. సాధారణంగా యానిమేటర్లకు చిత్రలేఖనంలో మంచి పట్టు ఉండాలి. అయితే 3డీ యానిమేషన్ ఆర్ట్‌తో పెయింటింగ్‌లో పట్టులేకున్నా అద్భుతమైన యానిమేషన్ చిత్రాలను రూపొందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవకాశాలు పుష్కలం యానిమేటర్ ఒక కళాకారుడు. తన ఊహాశక్తితో పాత్రలను సృష్టించి, అవి పరస్పరం సంభాషించుకొనేలా చేస్తాడు. యానిమేటర్లకు ప్రస్తుతం ఎన్నో రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. ఫిలిం, టెలివిజన్, వీడియో గేమ్స్, ఇంటర్నెట్ వంటి వాటిలో యానిమేషన్ నిపుణులకు మంచి డిమాండ్ ఉంది. యానిమేషన్, గే మింగ్, విజువల్ ఎఫెక్ట్స్ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ శరవేగంగా విస్తరిస్తోంది. అర్హతలు స్కెచ్చింగ్‌పై మంచి పట్టు, యానిమేషన్‌పై నిజమైన ఆసక్తి ఉంటే ఈ రంగంలోకి ప్రవేశించాలి. మొదట యానిమేషన్ కోర్సులో డిప్లొమా లేదా డిగ్రీ పూర్తిచేయాలి. వీటికి కనీస అర్హత ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత. తర్వాత పోస్టుగ్రాడ్యుయేషన్(పీజీ) చేసి అర్హతలు పెంచుకుంటే అవకాశాలు మెరుగవుతాయి. ఐడీసీ-ముంబయిలో యానిమేషన్లో పోస్టుగ్రాడ్యుయేషన్ చేయడానికి ఆర్కిటెక్చర్, టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్, ఫైనార్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు అర్హులు. కావాల్సిన స్కిల్స్ - విభిన్నమైన ఊహాశక్తి ఉండాలి. - రంగుల మేళవింపు, బొమ్మల పరిమాణంపై మంచి అవగాహన అవసరం. - ఎలాంటి ఒత్తిళ్లనైనా తట్టుకొని పనిచేసే సామర్థ్యం ఉండాలి. ఇతరులతో కలిసి పనిచేసే నేర్పు తప్పనిసరి. - మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. యానిమేషన్ రంగంలో ప్రోగ్రామర్స్, ఇలస్ట్రేటర్స్, డిజైనర్లు, స్టోరీ బోర్డు ఆర్టిస్టులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. యానిమేషన్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: - బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-నోయిడా... వెబ్సైట్: https://www.bitmesra.ac.in/ - ఇండస్ట్రియల్ డిజైన్ సెంటర్(ఐడీసీ), ఐఐటీ-ముంబయి... వెబ్సైట్: http://www.idc.iitb.ac.in/ మాయా అకాడమీ ఆఫ్ అడ్వాన్స్డ్ సినిమాటిక్స్... వెబ్సైట్: ww.maacindia.com - టూంజ్ అకాడమీ-తిరువనంతపురం... వెబ్సైట్: http://toonzacademy.com/ -
ఈ భారం మోయలేం..
సాక్షి, కాకినాడ :డ్వాక్రా సంఘాల పొదుపు సొమ్ముకు వేతనాల సాకుతో కోత పెట్టనుంది సర్కారు. ఈ భారం మోయలేమన్న డ్వాక్రా మహిళల గగ్గోలును పెడచెవిన పెట్టి సంఘానికి రూ.1000 చొప్పున జిల్లాలోని మహిళా సంఘాల పొదుపు ఖాతాల నుంచి ఏటా రూ.8.5 కోట్లకు పైగా బలవంతంగా వసూలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో పాటు ఏజెన్సీతో కలిపి 90 వేల సంఘాల పరిధిలో సుమారు 9.50 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వారు నెలకు రూ.50 చొప్పున తమ పొదుపు ఖాతాలో జమ చేసుకుంటారు. సంఘాల నెలవారీ సమావేశాలు, రుణాల మంజూరు, ఇతర పనుల్లో సహకరించేందుకు జిల్లావ్యాప్తంగా 2900 మంది యానిమేటర్లు, బుక్ కీపర్లు పనిచేస్తున్నారు. ఒక్కో యానిమేటర్, బుక్ కీపర్ల పరిధిలో పది నుంచి ముప్ఫై సంఘాల వరకు ఉంటాయి. వీరికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నుంచి రూ.2000, మండల సమాఖ్యల ద్వారా మరో రూ.వెయ్యి నుంచి రూ.1300 చొప్పున ఇచ్చేవారు. అయినా వీరు ప్రతి నెలా జరిగే సంఘ సమావేశం మినిట్స్ రాసే నెపంతో రూ.50 చొప్పున వసూలు చేస్తుంటారు. ఇక మంజూరైన రుణాన్ని బట్టి ఒక్కో సంఘం వద్దా రూ.50 నుంచి రూ.500 వరకు దండుకోవడం పరిపాటి. ఈ అనధికారిక వసూళ్లకు అడ్డుకట్ట వేయడంతో పాటు వీరికి క్రమం తప్పకుండా వేతనాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. సెర్ప్ ఇచ్చే రూ.2000కు అదనంగా సీనియారిటీని బట్టి రూ.1000 నుంచి రూ.2500 చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఈ అదనపు సొమ్మును ప్రభుత్వం ఇవ్వడం కాక ప్రతి సంఘం నుంచి ఏటా రూ.1000 చొప్పున వసూలు చేయాలని గత నెలలో జరిగిన జిల్లా మహిళా సమాఖ్య సమావేశంలో తీర్మానం చేశారు. ఆరునూరైనా అమలుకే సిద్ధం.. సమాఖ్య నిర్ణయాన్ని మండల, గ్రామసమాఖ్యలు తీవ్రంగా వ్యతిరేకించి, ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించబోమని తేల్చిచెప్పినా అధికారులు ఖాతరు చేయడం లేదు. ఈ నెలాఖరులోగా జిల్లాలోని సంఘాల పొదుపుఖాతాల నుంచి రూ.1000 చొప్పున మినహాయించుకోవాలని బుధవారం సామర్లకోటలో జరిగిన జిల్లా సమాఖ్య సమావేశంలో తీర్మానించారు. ఈ నెల 25 నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయాలనీ నిర్ణయించారు. సమాఖ్యలు, సంఘాలు గగ్గోలు పెడుతున్నా జిల్లా అధికారులు మొండిగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి నెలా ఠంచన్‌గా వేతనాలు అందజేస్తున్నా సంఘాల నుంచి బుక్ కీపింగ్, సమావేశాల నిర్వహణ, రుణాల మంజూరు తదితర సేవలకు గతంలో మాదిరిగానే వసూళ్లను కొనసాగిస్తారని, అవగాహన లేని సంఘాల సభ్యులు వారికి ప్రతి నెల మాదిరిగా ముట్టజెబుతుంటారని పలువురు అంటున్నారు. జిల్లా సమాఖ్య నిర్ణయం వల్ల సంఘాల నెలవారీ చెల్లింపులతో పాటు పొదుపు ఖాతాలో కూడా కోత పడే పరిస్థితులు తలెత్తుతాయంటున్నారు. కాగా జిల్లా సమాఖ్య తీర్మానం మేరకే సంఘాల పొదుపు ఖాతాల నుంచి రూ.1000 వసూలు చేయనున్నట్టు డీఆర్డీఏ ప్రాజెక్టు మేనేజర్ బాబూరావు చెప్పారు. సెర్ప్ నుంచి ఇచ్చే మొత్తానికి అదనంగా మండల సమాఖ్యల నుంచి సీనియారిటీని బట్టి చెల్లించనున్నందున, సంఘాలు నేరుగా యానిమేటర్లకు ఎలాంటి చెల్లింపులు చేయనవసరం లేదన్నారు. మా పొదుపు నుంచి జీతాలా? ఇంత దారుణం ఎక్కడా ఉండదు. 1995 నుంచి డ్వాక్రా సంఘాలను నడుపుకొంటున్నాం. డబ్బులు పోగేసుకుంటున్నాం. ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు. మేము పొదుపు చేసుకున్న సొమ్ములో నుంచి యానిమేటర్లకు జీతాలివ్వడం అన్యాయం - గురిమెళ్ల గంగారత్నం, డ్వాక్రా సంఘ సభ్యురాలు, పోలేకుర్రు, తాళ్లరేవు మండలం మేము చెల్లించే ప్రసక్తే లేదు.. క్షేత్ర స్థాయిలో డ్వాక్రా సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఈ వసూళ్లకు పాల్పడడం సరికాదు. గ్రామ సమాఖ్యల ఆమోదం లేకుండా జిల్లా సమాఖ్య తీర్మానాన్ని అమలు చేయాల్సిన అవసరం మాకు లేదు. మేము చెల్లించే ప్రసక్తే లేదు. - కె.వెంకటరమణ, శ్రీవిజయలక్ష్మి డ్వాక్రా సంఘ సభ్యురాలు, తూర్పుపేట, తాళ్లరేవు మండలం వారి జీతాల్ని ప్రభుత్వమే చెల్లించాలి యానిమేటర్ల జీతాల చెల్లింపుల భారాన్ని డ్వాక్రా సంఘాల సభ్యులపై మోపడం భావ్యం కాదు. వారి పొదుపు సొమ్ముకు ఎసరు పెట్టే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలనుకోవడం అన్యాయం. ప్రభుత్వమే యానిమేటర్ల జీతాలను నేరుగా చెల్లించాలి. - గునిపే అన్నామణి, తాళ్లరేవు మండల మహిళా సమాఖ్య మాజీ అధ్యక్షురాలు