'చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు' | mp avinash reddy fire on cm chandrababunaidu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు'

Published Thu, Jan 29 2015 2:05 PM | Last Updated on Tue, Aug 14 2018 2:09 PM

mp avinash reddy fire on cm chandrababunaidu

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. గురువారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ.. హంద్రీనీవా ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని  విమర్శించారు. అందుకే తొమ్మిదేళ్ల టీడీపీ పాలనలో ప్రాజెక్టులకు కేవలం రూ.24 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అవినాష్ రెడ్డి ధ్వజమెత్తారు.

వైఎస్సార్ హయాంలో ప్రాజెక్టుల కోసం రూ. 4700 కోట్లు ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తి చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాయలసీమ మీద నిజంగా చంద్రబాబుకు ప్రేమ ఉంటే వెంటనే హంద్రీ నీవా పూర్తి చేయాలని కోరారు. హంద్రీనీవా పనులు తానే చేశానంటూ సీఎం, మంత్రులు ఫొటోలకు ఫోజులివ్వడం హాస్యాస్పదంగా ఉందని అవినాష్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement