‘వీళ్లకంటే దావూద్ గ్యాంగ్ చాలా నయం’ | MP Vijayasai Reddy fires on Kodela family | Sakshi
Sakshi News home page

‘వీళ్లకంటే దావూద్ గ్యాంగ్ చాలా నయం’

Published Mon, Jun 17 2019 10:21 AM | Last Updated on Mon, Jun 17 2019 3:20 PM

MP Vijayasai Reddy fires on Kodela family - Sakshi

సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి నిప్పులు చెరిగారు. కోడెల కుటుంబం అధికారం అండతో ఇన్నాళ్లూ సాగించిన దౌర్జన్యాలు, అరాచకాలు, అక్రమ వసూళ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్న విషయం తెలిసిందే. దీనిపై విజయసాయి రెడ్డి ట్విటర్‌లో స్పందించారు. 'ప్రాధేయపడితే బందిపోట్లన్నా కొన్ని వస్తువులు వదిలి పోతారు. కోడెల కుటుంబం మాత్రం లారీలు నడుపుకుని కుటుంబాలను పోషించుకునే వారిని, రంజీ క్రికెట్ క్రీడాకారుడిని కూడా వదల్లేదు. రూ.15 లక్షల కంటే తక్కువ ఇస్తామంటే ముట్టనే ముట్టరంట. ముంబై దావూద్ గ్యాంగ్ వీళ్లకంటే చాలా నయం అంటున్నారు.

వ్యక్తిగత కక్షలతో జరుగుతున్న దాడులను కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు అంటగట్టడం టీడీపీ దివాళాకోరుతనానికి నిదర్శనం. హింస, ఉన్మాద రాజకీయాలకు ఆ పార్టీ పెట్టింది పేరు.  మా కార్యకర్తలను 400 మందిని పొట్టన పెట్టుకుంది. జగన్ గారు దీనిపై అప్పట్లోనే గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశారు' అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

చదవండి : కోడెల బండారం బట్టబయలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement