- ‘మీ సేవ’లో అందని మునిసిపల్ సేవలు
- నేటికీ అనుసంధానం చేయని వైనం
- స్వలాభం కోసమే జాప్యమా?
అనంత పురం కార్పొరేషన్ : నగర, పట్టణ ప్రజలకు మరిన్ని సేవలు ‘మీ సేవ’ ద్వారా అందించే ప్రక్రియ అడుగు ముందుకు పడలేదు. జనన, మరణ ధ్రువపత్రాలకు తోడు మరో పది మునిసిపల్ సేవ లను 2014 జనవరి 1వ తేదీ నుంచి అందించాలని గత ఏడాది డిసెంబర్ 18న అప్పటి డీఎంఏ జనార్దన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అరుుతే పదకొండు నెలలు గడుస్తున్నా ఆ ఉత్తర్వులు ఎక్కడా అమల్లోకి రాలేదు. ఎప్పటిలాగానే కేవలం జనన, మరణ ధ్రువపత్రాలను మాత్రమే ఇస్తున్నారు. మీ సేవా ద్వారా అందించాల్సిన పది సేవలకు సంబంధించిన డేటాను అనంతపురం కార్పొరేషన్‌తో పాటు మిగిలిన 11 పురపాలక సంఘాల్లోనూ ‘మీ సేవ’కు అనుసంధానం చేయలేదు. దీంతో పది సేవల్లో ఏ ఒక్కటీ ‘మీ సేవ’ నుంచి పొందే సౌలభ్యం ప్రజలకు అందుబాటులోకి రాలేదు. కొళాయి కనెక్షన్లకు మొదలు టాన్స్‌ఫర్ ఆఫ్ టైటిల్, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ దరఖాస్తులు పురపాలక సంఘాల్లో నేరుగా తీసుకుంటున్నారు.
ఇదో మతలబు వ్యవహారం
పది మునిసిపల్ సేవలను మీ-సేవకు అనుసంధానం చేయకపోవడం వెనుక ఇక్కడి సిబ్బంది మతలబు వ్యవహారం ఉందనే విమర్శలు వినవస్తున్నాయి. మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే నిర్ధేశించిన వ్యవధిలో అనుమతులు మంజూరు చేయాలి. లేదా అనుమతిని ఎందుకు ఇవ్వలేకపోతున్నారో తెలియజేస్తూ ఎండార్స్‌మెంట్ ఇవ్వాలి. ఈ రెండింట్లో ఏది జరిగినా ఇక్కడి వారి జేబుల్లోకి ఏమీ రాదు. నేరుగా దరఖాస్తులు స్వీకరిస్తే దరఖాస్తుదారుడి నుంచి స్థాయి బట్టి ఇక్కడి సిబ్బంది దండుకోవడం జరుగుతోందన్న విమర్శలు ఉన్నారుు. మీ సేవకు అనుసంధానం చేస్తే ‘ఇలాంటి’ ఆదాయానికి బ్రేక్ పడుతుంది. ఈ కారణంగానే పది సేవలను మీ-సేవకు అనుసంధానించడంలో జాప్యం చేస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి.
జనవరి ఒకటి నుంచి అందించాల్సిన సేవలు
= ట్రాన్స్‌ఫర్ ఆఫ్ టైటిల్ (ఆస్తిపై యజమాని పేరు బదలాయింపు)
= నీటి కొళాయి కనెక్షన్‌కి అనుమతి
= ట్రేడ్ లెసైన్స్ దరఖాస్తు
= ట్రేడ్ లెసైన్స్ రెన్యువల్
= భవన నిర్మాణాలకు ప్లాన్ అప్రూవల్ దరఖాస్తు
= న్యూ అసెస్మెంట్ రిక్వెస్ట్ (ఆస్తి పన్ను విధింపు)
= సబ్ డివిజన్ రిక్వెస్ట్
= మినహాయింపు అభ్యర్థన
= వెయికెన్సీ రెమిషనర్ రిక్వెస్ట్
= ఆక్యుపెన్సీ సర్టిఫికెట్