Corp
-
డెల్టా కార్ప్‌కు మరో రూ.6,384 కోట్ల జీఎస్టీ నోటీస్
న్యూఢిల్లీ: డెల్టా కార్ప్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. రూ. 6,384 కోట్ల షార్ట్ పేమెంట్ కోసం ఒక జీఎస్టీ నోటీసును అందుకుంది, దీనితో కంపెనీపై మొత్తం పన్ను డిమాండ్ దాదాపు రూ. 23,000 కోట్లు దాటింది. పన్ను డిమాండ్లు ఏకపక్ష మైనవని, చట్ట విరుద్ధంగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. వీటిని సవాలు చేయనున్నట్లూ వెల్లడించింది. సంస్థ ప్రకటన ప్రకారం, డీజీజీఐ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్), కోల్‌కతా విభాగం అక్టోబర్ 13న డెల్టా కార్ప్ అనుబంధ సంస్థ అయిన డెల్టాటెక్ గేమింగ్‌కు జీఎస్టీ నోటీసు పంపుతూ, జనవరి 2018 నుండి నవంబర్ 2022 కాలానికి సంబంధించి రూ. 6,236.8 కోట్ల పన్ను చెల్లింపుల డిమాండ్ చేసింది. జూలై 2017 నుండి అక్టోబర్ 2022 వరకు మరో 147.5 కోట్ల రూపాయల పన్ను డిమాండ్ నోటీసునూ అందించింది. రూ. 16,800 కోట్ల షార్ట్ పేమెంట్ నిమ్తి్తం కంపెనీకి గత నెలలో షోకాజ్ నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే. ఆన్లైన్ గేమింగ్ సంస్థలు, కాసినోలు తమ ప్లాట్‌ఫారమ్‌లపై ఉంచిన స్థూల పందెం విలువపై 28 శాతం జీఎస్టీ చెల్లించవలసి ఉంటుందని ఆగస్టులో జీఎస్టీ అత్యున్నత స్థాయి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కంపెనీకి తాజా జీఎస్టీ నోటీసులు వెలువడ్డం గమనార్హం. చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఈ–గేమింగ్ కంపెనీలకు రెట్రాస్పెక్టివ్ ప్రాతిపదికన జీఎస్టీ పన్ను డిమాండ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ ఇటీవల స్పష్టం చేశారు. డేటాను పూర్తిగా విశ్లేషించిన మీదటే పన్ను మొత్తంపై నిర్ధారణకు వస్తున్నట్లు తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో డెల్టా కార్ప్ షేర్ ధర 9 శాతం పడిపోయి రూ.120కి పడింది. -
పెద్ద షాక్ ఇచ్చిన మస్క్.. ఆ కంపెనీలో ట్విట్టర్ విలీనం.?
-
కరువు తీర్చే పంట!
తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతల మధ్య సాధారణ పంటల సాగుకు పనికిరాని (ఎడారి) భూముల్లో సైతం బతికి ఉండటమే కాకుండా అధిక దిగుబడిని ఇచ్చే పంట ఏమైనా ఉందా?అవును. అలాంటిదే ‘బ్రహ్మజెముడు’! బ్రహ్మజెముడు మనకు కొత్తదేమీ కాదు. దీని కాండమే ఆకులా ఉంటుంది. సాధారణంగా మనకు తెలిసిన బ్రహ్మజెముడుకు ముళ్లుంటాయి. అయితే, ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది ‘ముళ్లు లేని బ్రహ్మజెముడు’ పంట గురించి. వాతావరణ మార్పు తీవ్ర రూపం దాల్చుతున్న వేళ ప్రతికూల వాతావరణ పరిస్థితులను సునాయాసంగా ఎదుర్కొనగల బ్రహ్మజెముడుకు ప్రపంచవ్యాప్తంగా ఏటేటా గిరాకీ పెరుగుతోంది. గడ్డుకాలంలో సవాలుగా మారే పశుపోషణలో రైతులకు తోడ్పడుతుంది. అంతేకాదు.. గాలి, వానలకు భూమి పైపొర కోతకు గురవకుండా కూడా బ్రహ్మజెముడు తోడ్పడుతుంది. దీని కాండపు ముక్కను ఒకసారి నాటుకుంటే చాలు.. 50 ఏళ్ల పాటు దిగుబడినిస్తుంది. అందుకే ఇది ‘కరువు తీర్చే పంట’. ఏడాది పొడవునా పశుగ్రాసాన్ని అందించే దీర్ఘకాలపు పశుగ్రాసపు పంటగా శాస్త్రవేత్తలు దీన్ని మన రైతులకు పరిచయం చేస్తున్నారు. ముళ్లులేని బ్రహ్మజెముడు పంటకు పశువులకు, మనుషులకు గడ్డు పరిస్థితుల్లోనూ ఉపయోగపడే ఆహార పంటగానే కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఎడారి పంటగా కూడా గుర్తింపు ఉంది. ఇది కాక్టస్ (Cactus - Opuntia ficus indica) జాతికి చెందిన మొక్క. మెక్సికో దీని పుట్టిల్లు. నీటిని/వర్షాన్ని అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవడంలో దీనికి ఇదే సాటి. ప్రపంచవ్యాప్తంగా మెట్ట, తరచూ కరువు బారిన పడే ప్రాంతాలు, ఎడారి ప్రాంతాల్లో సాగుకు ఇది చాలా అనువైన పంట. దీన్ని బ్రెజిల్, మెక్సికో, సౌదీ అరేబియా, ఇటలీ, అమెరికా, ఆఫ్రికా దేశాలలో మొత్తం 24 దేశాల్లో సాగు చేస్తున్నారు. కాండపు ముక్కలను కూరగాయగా, పానీయాలకు ముడి పదార్థంగా, ఔషధంగా 50 రకాలుగా దీన్ని ఉపయోగిస్తున్నారు. 1970 దశకంలో ఈ పంట మన దేశానికి పరిచయమైనా పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. జోద్పూర్(రాజస్థాన్) లోని కేంద్రీయ మెట్ట ప్రాంత పరిశోధనా సంస్థ, ఝాన్సీ(ఉ.ప్ర.)లోని భారతీయ పశుగ్రాస పరిశోధనా సంస్థ, కేంద్రీయ అగ్రో ఫారెస్ట్రీ పరిశోధనా సంస్థ, కర్నల్(హర్యానా)లోని కేంద్రీయ చౌడు భూముల పరిశోధనా సంస్థ, బికనెర్(రాజస్థాన్)లోని కేంద్రీయ వర్షాధార ఉద్యాన పరిశోధనా సంస్థ, ఫల్తన్(మహారాష్ట్ర)లోని నింబికర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(నారి), పుణే జిల్లా ఉరులికాంచన్లోని బి.ఎ.ఐ.ఎఫ్. డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ తదితర మెట్ట/ఎడారి ప్రాంత వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో కొన్ని ఏళ్లుగా దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. జో«ద్‌పూర్‌లో చేపట్టిన పరిశోధనల్లో పశువుల మేతగా బ్రహ్మజెముడు సమర్థవంతంగా పనికివస్తుందని రుజువైంది. అనంతపురం జిల్లా రేకులకుంటలో ఉన్న వ్యవసాయ పరిశోధనా స్థానంలో కూడా ముళ్లు లేని బ్రహ్మజెముడును ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. బ్రహ్మజెముడు అనగానే ముట్టుకుంటే గుచ్చుకునే ముళ్లు్ల గుర్తుకొస్తాయి. కానీ.. ఈ బ్రహ్మజెముడుకు ముళ్లు ఉన్నట్లు కనిపించినా అవి మెత్తగా ఉంటాయి. ముళ్లులేని బ్రహ్మజెముడు కాండపు ముక్కలు పశువుల మేతగా బాగా పనికివస్తాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ ఆర్.వీరరాఘవయ్య(99896 25222), శాస్త్రవేత్తలు డాక్టర్ జి.నారాయణస్వామి(62812 84235), డాక్టర్ కె.అరుణ్‌కుమార్(83092 30136) అంటున్నారు. అతి తక్కువ వర్షపాతం చాలు వార్షిక వర్షపాతం అత్యల్పంగా(150 నుంచి 200 మి.మీ) నమోదయ్యే ప్రాంతాల్లో కూడా ముళ్లు లేని బ్రహ్మజెముడు సాగు చేసుకోవచ్చు. బంజరు భూములు, అటవీ ప్రాంతాల్లోనూ దీని కాండం (ఆకు) ముక్కలను నర్సరీలో పెంచి నాటుకోవచ్చు. మొక్క సులువుగా బతుకుతుంది. ఎలాంటి తెగుళ్లు, చీడపీడలు ఆశించవు. పశువులకు రోజువారీ ఇచ్చే పప్పుజాతి/ధాన్యపు జాతి మేతలో దీన్ని 33 శాతం మేరకు కలిపి ఇవ్వవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ముళ్లు లేని ఆకులను రెండు, మూడు భాగాలుగా కత్తిరించి నాటుకోవచ్చు. పశువులకు మేతగా ఇచ్చే సమయంలో మట్టి అంటకుండా చూసుకోవాలి. ఈ పంట వల్ల భూసారం పెరుగుతుందని నిరూపణ అయింది. బంజరు భూములు, అటవీ భూములలో నాటుకోవచ్చు. తోటలు, పొలాల చుట్టూ రక్షణ పంట(జీవకంచె)గా వేసుకొని పశువుల మేతకు వినియోగించుకోవచ్చు. కాయలు లేదా పండ్లను కూడా పశువులు, గొర్రెలు తింటాయి. ఏ వయసు పశువులకైనా మేపవచ్చు. ఎకరానికి 667 మొక్కలు నాటాలి జోద్పూర్ నుంచి తెచ్చిన బ్రహ్మజెముడు ముక్కలను రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానంలో సాగు చేస్తున్నారు. ఎకరానికి 667 మొక్కలు నాటుకోవాలి. 15–20 రోజుల వ్యవధిలో 10–15 సెం.మీ. పొడవు, 30 గ్రాముల బరువు ఉండే బ్రహ్మజెముడు కాండపు ముక్కల(క్లాడోడ్స్) దిగుబడి పొందవచ్చు. అనంతపురం వంటి తీవ్ర కరువు ప్రాంతాల్లో అయితే.. వరుసల మధ్య 2–3 మీటర్లు, మొక్కల మధ్య 1.5–2 మీటర్ల దూరం ఉండాలి. వర్షపాతం, భూసారం మెరుగ్గా ఉండే ప్రాంతాల్లో అయితే.. వరుసల మధ్య 3 మీటర్లు, మొక్కల మధ్య 2–2.5 మీటర్ల దూరం పాటించాలి. హెక్టారు భూమిలో సంవత్సరానికి 20 టన్నుల వరకు గ్రాసాన్ని పొందవచ్చు. 50–55 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలను సైతం తట్టుకుంటుంది. మట్టి పాళ్లు తక్కువగా ఉండే రాళ్ల/ఇసుక భూములు, కొండ వాలు, బంజరు భూముల్లో పెంచుకోవచ్చు. భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో ముళ్లు లేని బ్రహ్మజెముడు కరువు కాలపు పంటగా గుర్తెరగడం అవసరం.– గంగుల రామలింగారెడ్డి,సాక్షి, అగ్రికల్చర్, అనంతపురం రాత్రి పూటేకిరణజన్య సంయోగ క్రియ! ముళ్లులేని బ్రహ్మజెముడు తీవ్ర ప్రతికూల వాతావరణంలోనూ అతి తక్కువ నీటితోనే మనుగడ సాగిస్తుంది. అదెలా? సాధారణ పంటలు(సి3 రకం), నీటిని తక్కువగా వాడే చిరుధాన్య పంటలు(సి4 రకం) పగటి పూటే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. వీటి పత్ర రంధ్రాలు పగటి పూటే తెరుచుకొని నీటి ఆవిరిని వాతావరణంలోకి విడుదల చేస్తూ ఉంటాయి. కాబట్టి నీటి అవసరం ఎక్కువ. బ్రహ్మజెముడు మొక్కలు పగలు గమ్మునుండి రాత్రి పూటే ఈ పనిచేస్తాయి. అందువల్ల సి3, సి4 పంటలకన్నా 3–5 రెట్లు తక్కువ నీటినే బతుకుతుందని ఆహార–వ్యవసాయ సంస్థ(ఎఫ్.ఎ.ఓ.) నిపుణుడు హరిందర్ పి.ఎస్. మక్కర్ అంటున్నారు. కిలో బ్రహ్మజెముడు కాండపు ముక్కల ఉత్పత్తికి 250 లీటర్ల నీరు చాలు. అతి చలిని, అతి వేడిని తట్టుకుంటుంది. సారవంతమైన భూమిలో నీటిపారుదల ఉంటే అత్యధిక దిగుబడినిస్తుంది. నిస్సారమైన భూముల్లో తక్కువ నీటితో కూడా పెరిగి మోస్తరు దిగుబడినిస్తుంది. నీరు నిలిచే, చౌడు భూములు పనికిరావు. పాల దిగుబడిని పెంచే మేత ♦ ముళ్లులేని బ్రహ్మజెముడును పశువుల మేతగా ఏ మేరకు పనికివస్తుందనే దానిపై డీఆర్డీఏ–వెలుగు(సెర్ప్) ఆధ్వర్యంలో కొందరు రైతుల చేత ప్రయోగాత్మకంగా అనంతపురం జిల్లాలో సాగు చేయిస్తున్నారు. గుత్తి, నల్లమాడ, ముదిగుబ్బ, తనకల్లు, శింగనమల, ఉరవకొండ మండలాల పరిధిలో స్వల్ప విస్తీర్ణంలో గత జనవరి నుంచి సాగు చేస్తున్నారు. ♦ పూణె సమీపంలోని ఊర్లికాంచంలోని బి.ఎ.ఐ.ఎఫ్. బయో రీసెర్చ్ స్టేషన్ నుంచి 7 వేల కణుపులు తెచ్చి ఎకరాకు 700 కణుపులు నాటించామని అనంతపురం ప్రాంతీయ పశు శిక్షణా కేంద్రం నిపుణులు డాక్టర్ శ్రీకాంత్(94411 84152) తెలిపారు. ♦ రెండు అడుగుల గుంత తీయించి మొక్కల మధ్య రెండున్నర మీటర్లు, వరుసల మధ్య 3 మీటర్ల ఎడంలో నాటించాం. శిలీంధ్ర సమస్య తలెత్తకుండా 2 గ్రాములు మాంకోజెబ్ పురుగుమందులో కణుపులు ముంచి నాటించామన్నారు. నాటిన తర్వాత 10–12 నెలల నుంచి ఆకులు (కాండపు ముక్కలు) చిన్న ముక్కలుగా కోసి పశువులకు మేపుకోవచ్చు. ♦ వర్షాకాలంలో నాటుకుంటే మేలు. ఒక మొక్కకు వారం లేదా పది రోజులకోసారి ఒక లీటర్ నీళ్లు చాలు. నాటిన మొదట్లో 10 నుంచి 15 రోజులకో తడి ఇస్తే సరిపోతుంది. సంవత్సరానికి ఎంతలేదన్నా ఎకరాకు 10 టన్నుల మేత అందుబాటులోకి వస్తుంది. ♦ తక్కువ మేతలోనే ఎక్కువ శక్తినిచ్చే పోషకాలు ఉంటాయి. ఎముక బలం, పాల దిగుబడి పెరుగుతాయి. ♦ ఒక మొక్కకు సంవత్సరానికి 25 నుంచి 37 కణుపులు వస్తాయి. ఒక్కో మొక్క నుంచి ఎంతలేదన్నా సంవత్సరానికి 15 కిలోల వరకు మేత పొందవచ్చు. -
క్యాప్సికం కాసులవర్షం
యశవంతపుర: సంప్రదాయ రాగి, జొన్న, వరి పంటలకు భిన్నంగా సాగిన రైతు నెలకు రూ. లక్ష లాభాలను కళ్లజూస్తున్నాడు. పాలిహౌస్ ద్వారా క్యాప్సికంను సాగు చేసి లాభాలు గడిస్తున్నాడు రైతు మైలారప్ప సోమప్ప చలవాది. గదగ్ జిల్లా నరగుంద తాలూకా కపలి గ్రామానికీ చెందిన రైతు మైలారప్ప పాలి హౌస్ ద్వారా రెడ్ క్యాప్సికంను సాగు చేశాడు. ఉద్యానవనశాఖ సాయంతో 20 గుంటల భూమిలో 16 లక్షల ఖర్చుతో వేశాడు. అం దులో రెండు వేల క్యాప్సికం మొక్కలను నాటారు. మంచి కాపు రావటంతో రైతులో ఆనందం కలిగిస్తోంది. రెడ్ క్యాప్సికం కు మంచి డి మాండ్ ఉంది. ఆయన పంటను ఇతర రాష్ట్రాల కు ఉత్పత్తి చేస్తున్నాడు. తక్కువ నీటితోనే మం చి దిగుబడినివ్వడం ఈ పంట ప్రత్యేకత. ఇందులోనే టమోటా సాగును కూడా చేస్తున్నాడు. తాలూకాలోనే మొదటి రైతు తాలూకాలో మొదటిసారిగా పాలిహౌస్ ద్వారా కాయగూరల పండించే రైతును తానేనని ఆయన చెప్పాడు. క్యాప్సికం కేజీ నూరు రూపాయిలు పలుకుతోంది. 8 నెలల పాటు దిగుబడినిస్తుంది. నెలకు కనీసం రూ. లక్ష ఆదాయం పొందుతున్నట్లు సమాచారం. సాగుకు రెండు లక్షల రూపాయలు ఖర్చయింది. ఐదు లక్షల వరకు లాభం వస్తుందని రైతు తెలిపాడు. ప్రతి నెలా క్యాప్సికం ద్వారా రూ. లక్ష లాభం పొందవచ్చని చెప్పారు. మూడు నెలలలో పంట సంపూర్ణంగా చేతికి అందుతుంది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తక్కువ నీటితో పంట సాగు చేయవచ్చని చెప్పాడు. పాలి హౌస్ విధానంలో తక్కువ నీటితోనే పంటలు పండించవచ్చని చెప్పాడు. -
ఉప్పుతిప్పలు
యలమంచిలి : పెనుమర్రు ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతులు ఉప్పునీరువల్ల తమ పొలాలకు నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా పట్టించుకోని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే వ్యవహరిస్తే తమకు ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చరిస్తున్నారు. కారణం ఏమిటంటే.. పెనుమర్రు ఎత్తిపోతల పథకం ఆయకట్టు పరిధిలో 2,088 ఎకరాల్లో వరి సాగవుతోంది. ఈ పొలాలకు నక్కల డ్రెయిన్ నీటిని చించినాడ కాల్వలోకి తోడి పంట చేలకు ఇస్తున్నారు. అయితే నక్కల డ్రెయిన్ నీటిలో ఉప్పుశాతం ఎక్కువగా ఉండడంతో పంటలు పాడవుతున్నాయని రైతులు చెబుతున్నారు. దీనిపై గత డిసెంబర్లోనే దాళ్వాకు నక్కల డ్రెయిన్ నీటిని ఎత్తిపోయవద్దని అధికారులను వేడుకున్నారు. డిసెంబర్ 27న పెనుమర్రు ఎత్తిపోతల పథకం వద్దకు వచ్చిన నరసాపురం సబ్ కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీకి తమ గోడు విన్నవించుకున్నారు. రూ.కోట్లాది రూపాయలతో నిర్మించిన ఎత్తిపోతల పథకం నీరు తమకు వద్దని రైతులు స్పష్టం చేశారు. దీనిపై ఆయన రైతులను ప్రశ్నించగా, నక్కల డ్రయిన్ నీటిలో ఉప్పుశాతం ఎక్కువగా ఉంటుందని, ఆ నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా చేలకు తోడితే పైరు చౌడు బారిపోతుందని చెప్పారు. దిగుబడీ గణనీయంగా తగ్గుతుందన్నారు. దీంతో ఆయన నక్కల డ్రెయిన్‌లోని నీటిని పరీక్ష చేయించగా 0.8 శాతం ఉప్పు సాంద్రత ఉన్నట్టు నివేదిక వచ్చింది. దీనిపై వ్యవసాయ అధికారి జాన్సన్‌ను పిలిచి వరి సాగుకు ఎంత ఉప్పు శాతం ఉండవచ్చునని అడగ్గా 4 శాతం వరకూ ఉండవచ్చని చెప్పారు. దీంతో గాంధీ జనవరి 10వ తేదీ వరకు దమ్ములు పూర్తి కావడానికి మాత్రమే ఎత్తిపోతల పథకం నుంచి నీటిని తోడతామని రైతులకు చెప్పారు. ప్రస్తుతం 0.8 శాతం మాత్రమే ఉప్పు ఉంది కాబట్టి పరీక్ష యంత్రాన్ని నీటి సంఘ అధ్యక్షుడు పెన్మెత్స రామభద్రరాజు వద్ద ఉంచుతామని, జనవరి 10 లోపు ఎప్పుడు రెండు శాతానికి మించి ఉప్పు వచ్చినా వెంటనే మోటార్లు ఆపివేస్తామని హామీనిచ్చారు. అక్కడి నుంచి మార్చి 31వ తేదీ వరకు పంటకాల్వ నీరే ఇస్తామని స్పష్టం చేశారు. అయితే ఆ హామీలు అమలు కాలేదు. మార్చి వచ్చినా ఎత్తిపోతల నీటినే తోడుతున్నారు. దీనిపై సోమవారం కలెక్టర్ వద్ద తేల్చుకుంటామని రైతులు స్పష్టం చేస్తున్నారు. మోసం చేస్తున్నారు ఎత్తిపోతల పథకం ద్వారా నీరివ్వడం వలన రైతులు నష్టాలపాలవుతున్నారు. అందుకే నారుమడలు వేయకుండానే సాగు చేయలేమని చెప్పారు. సాక్షాత్తు సబ్ కలెక్టర్ వచ్చి దమ్ముల వరకే ఎత్తిపోతల పథకం నీరు తోడతామని, మార్చి నెలాఖరు వరకు కాల్వ నీరు ఇస్తామని హామీ ఇవ్వడంతో రైతులు నమ్మి సాగుచేసి మోసపోయారు. – తోటకూర వెంకట్రామరాజు, మాజీ సర్పంచ్, పెనుమర్రు నక్కల డ్రెయిన్‌లో 5శాతం ఉప్పు ఉంది పెనుమర్రు ఎత్తిపోతల పథకం ఆయకట్టులో రావిపాడు, పెనుమర్రు, మేడపాడు, యలమంచిలి, కట్టుపాలెం, శిరగాలపల్లి గ్రామాలలో 2,088 ఎకరాలు సాగవుతోంది. నక్కల డ్రెయిన్ నీటిలో 5 శాతం ఉప్పు ఉంది. ఆ నీటిని పంట చేలకు పెడితే గింజలన్నీ చౌడుబారి పోయి రైతులు నష్టపోతారు. కాల్వ నీరు ఇవ్వాలని, ఎత్తిపోతల నుంచి నీరు తోడవద్దని రైతులు ఎంత మొత్తుకుంటున్నా అటు అధికారులు, ఇటు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా రైతులకు ఆత్మహత్యలే శరణ్యంలా ఉన్నాయి. – పాకా సూర్యనారాయణ, రైతు -
ప్రాణాలు తుంచే కంచె..
పొలాల మాటున విద్యుత్ కంచెలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవలకాలంలో జిల్లాలో అనేక ప్రాంతాల్లో రైతులు తమ పొలాల్లోకి ప్రవేశించే పందులు, ఎలుగులు(ఎలుగుబంట్లు) మట్టు పెట్టేందుకు పొలం చుట్టూ జీఏ వైరుతో పెన్సింగ్ ఏర్పాటు చేసి కరెంట్ పెడుతున్నారు. పందుల మాట ఎలా ఉన్నా ఈ విధానం వల్ల ఏకంగా మనుషుల ప్రాణాలే గాల్లో కలిసిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇవేమీ పట్టించుకోకుండా రైతులు గుట్టుచప్పుడు కాకుండా పొలాల చుట్టూ విద్యుత్ కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. అధికార యంత్రాంగం నిఘా పెట్టి నియంత్రణ చేయకుంటే మున్ముందు ఈ విధానం ప్రాణాలకే ముప్పు. పశ్చిమగోదావరి: జిల్లాలో ఇటీవలకాలంలో పందులు తమ పొలాల్లో చొరబడకుండా రైతులు తీగలతో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి వాటికి విద్యుత్ సరఫరా ఇస్తున్నారు. కంటికి కనిపించని రీతిలో ఈ తీగలు ఉండటంతో పొలాల వెంబడి నడిచి వెళ్లేవారు గుర్తించలేక మృత్యువాత పడుతున్నారు. ఈ విధానం తొలుత డెల్టా ప్రాంతం నుంచి ప్రారంభమై నేడు ఏజెన్సీ, మెట్ట ప్రాంతానికి సైతం పాకింది. సరఫరా ఆపకుంటే ప్రాణాలు గాల్లోకే.. పందులు, ఎలుగుల నివారణ కోసం రైతులు జీఏ వైరును అమర్చి విద్యుత్ మోటారు స్విచ్ బోర్డు నుంచి విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నారు. తిరిగి మరుసటి రోజు ఉదయమే సరఫరా నిలుపుదల చేస్తూ ఈ విధానాన్ని కొనసాగిస్తున్నారు. దీని వల్ల ప్రమాదం పొంచి ఉందని అనేక మంది సాటి రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏ మాత్రం విద్యుత్ సరఫరా నిలుపుదల చేయడం మరచినా విద్యుత్ తీగలే యమపాశాలుగా మారే అవకాశం ఉంది. సరదాగా పొలాలకు వెళ్లే చిన్నారుల నుంచి పెద్దల వరకు ఈ తీగలను గమనించకుంటే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. గత ఏడాది అక్టోబర్ 13వ తేదీన కర్నూర్ జిల్లా సంజామల మండలం మిక్కినేని పల్లెలో అడవి పందుల నివారణ కోసం పొలం చుట్టూ అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి షేక్ సుకుర్ బాషా, ప్రవల్లిక అనే ఇద్దరు మృతి చెందిన ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విద్యుత్ కంచెల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. చర్యలు తీసుకుంటాం రైతులు పొలాల్లో తీగలతో కంచెలు ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా ఇవ్వడం చట్టరీత్యా నేరం. ఎక్కడైనా రైతులు ఈ విధానానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. –సత్యనారాయణ రెడ్డి, ఎస్ఈ, విద్యుత్ శాఖ -
లక్ష్మీ దేవికి అవమానం
భువనేశ్వర్: వరి పంటకు చీడపీడలు ఆవరించడంతో కలవరపడుతున్న రైతాంగం పొలాల్లో పంటకు నిప్పు పెట్టి ఆవేదన వ్యక్తం చేయడం తప్పు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి డాక్టరు దామోదర్ రౌత్ అన్నారు. వరి పంట సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. వర్థమాన పరిస్థితుల దృష్ట్యా పంటకు నిప్పు పెట్టడం అంటే లక్ష్మీ దేవిని దహించినట్లే అవుతుందన్నారు. ఇటువంటి తప్పిదానికి పాల్పడరాదని అన్నదాతను అభ్యర్థించారు. నకిలీ మందుల విక్రేతలపై చర్యలు తప్పవు రైతులకు నకిలీ క్రిమి సంహారక మందుల్ని విక్రయించిన వారిని గుర్తించి ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని ఆయన అన్నారు. బాధ్యుల్ని ఖరారు చేసిన మేరకు విభాగం వీరి వ్యతిరేకంగా చర్యల్ని చేపట్టేందుకు సన్నాహాలు చేస్తుందని ప్రకటిం చారు. ముగ్గురు స భ్యుల బృందాన్ని వ్యవసాయ విభా గం ప్రభావిత ప్రాం తాలకు పంపించి ందన్నారు. క్షేత్ర స్థా యిలో వాస్తవ స్థితిగతుల్ని క్షుణ్ణంగా ప రిశీలించిన మేరకు వీరితో సంప్రదించి భావి కార్యాచరణ ఖరారు చేయడం జరుగుతుందని తెలిపారు. బర్గడ్, సంబల్పూర్, రాయగడ, గంజాం జిల్లాల్లో రైతులు వరి పంటకు నిప్పు పెడుతున్నట్టు విభాగానికి ఇప్పటివరకు సమాచారం అందినట్టు మంత్రి చెప్పారు. -
సాగునీటి గండం
♦ గోదావరి జిల్లాలకు పొంచివున్న ముప్పు ♦ తెలంగాణలో గోదావరి, దాని ఉపనదులపై 9 ఎత్తిపోతల పథకాలు ♦ అవి పూర్తయితే సహజ జలాల రాకకు అడ్డుకట్టే ♦ పోలవరం ప్రాజెక్టు నిర్మాణమే శాశ్వత పరిష్కారం ♦ ప్రచార ఆర్భాటాలకే పరిమితమైన ప్రభుత్వం ♦ పట్టిసీమ, పురుషోత్తపట్నం పథకాలపై మమకారం కర్ణాటక ప్రభుత్వం ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంచినా అప్పటి చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. ఫలితంగా నేడు కృష్ణా డెల్టా రైతులు సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మొదటి పంటకు సైతం నీరందక ఇబ్బందులను చవిచూస్తున్నారు. తెలంగాణ సర్కారు గోదావరి, దాని ఉప నదులపై ఏకంగా తొమ్మిది ఎత్తిపోతల పథకాల నిర్మాణం చేపడుతోంది. దీంతో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే దిగువకు నీళ్లు వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి పోలవరం/కొవ్వూరు : ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే గోదావరి డెల్టా ఆయకట్టు పరిధిలో ఉన్న రైతులు రెండో పంటకు సాగునీరు అందక ఇబ్బందులను చవిచూస్తున్నారు. ఏటా రబీ సీజన్లో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. 2009 తర్వాత రెండేళ్లు మినహా రెండో పంటకి ఏటా వంతుల వారీ విధానంలో సాగునీరు అందిస్తున్నారు. ఆరేళ్ల నుంచి రెండో పంటకు సీలేరు జలాలపైనే ఆధారపడి నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తొమ్మిది పథకాలు పూర్తయితే భవిష్యత్‌లో మరింత విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సిన ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటా సరాసరి 2,500 టీఎంసీలకు పైగా గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. గోదావరి నీటిని ఒడిసిపట్టి నిల్వ చేసుకునే మార్గం లేకపోవడంతో వేలాది టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో 7.20 లక్షల ఎకరాలకు నీరందించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చుతోంది. 194.60 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం గల పోలవరం ప్రాజెక్టు పూర్తయితే సాగునీటి సమస్యకు తెరపడే అవకాశం ఉంది. అంతే కాకుండా 960 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తూ కేవలం తాత్కలిక లబ్ధిని చేకూర్చే పట్టిసీమ, పురుషోత్తపట్నం పథకాల పేరుతో రూ.3,200 కోట్లు పైగా ప్రజాధనం వృథా చేస్తోంది. కేవలం కమీషన్లు దండుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ రెండు పథకాల నిర్మాణం చేపట్టిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొమ్మిది ఎత్తిపోతలు పూర్తయితే గోదావరి ఎడారే....? నది పరివాహకంలో నీటి లభ్యత పడిపోవడంతో ఏటా రబీ సీజన్లో ఉభయ గోదావరి జిల్లా రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం గోదావరి ఉపనదులైన వార్ధా, పెన్‌గంగ, ప్రాణహిత కలిసే ప్రదేశాల్లో రూ.6,286 కోట్ల వ్యయంతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, రూ.685 కోట్లతో ప్రాణహిత ఎత్తిపోతల పథకాల నిర్మాణం చేపట్టింది. దిగువన భద్రాచలం సమీపంలో భక్తరామదాసు, సీతారామ పథకం రూ.1,151.59 కోట్లతో, లోయర్ పెన్‌గంగ రూ.124.90 కోట్లతో, లెండి రూ.19.02 కోట్లతో, దేవాదుల రూ.695 కోట్లతో, కుంతనాపల్లికి రూ.200 కోట్లతో, బీమా ఎత్తిపోతల పథకాన్ని రూ.125 కోట్లతో చేపట్టింది. గత ఏడాది బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది. ఎగువన ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే వరదల అనంతరం అక్టోబర్, నవంబర్‌లో గోదావరికి వచ్చే సహజ జలాలకు అడ్డుకట్ట పడినట్లే అవుతుంది. పొంచి ఉన్న ప్రమాదం : గోదావరికి ఎగువ నుంచి అక్టోబర్ నెలలో రోజుకి సగటున 40 వేల క్యూసెక్కులు, నవంబర్‌లో 20 వేల క్యూసెక్కుల చొప్పున మాత్రమే ఇన్‌ఫ్లో వస్తుంది. తెలంగాణలో ఈ ప్రాజెక్టులు పూర్తయితే అక్టోబర్, నవంబర్ నెలల్లో ఇన్‌ఫ్లో పడిపోవడం ఖాయం. ఆ సమయంలో గోదావరి జిల్లాల్లో ఖరీఫ్ పంట కీలక దశలో ఉంటుంది. ఏటా రబీకి 80 టీఎంసీల నీరు అవసరం. దీనిలో ఎగువ నుంచి సహజ జలాల రూపంలో 40 టీఎంసీలు వస్తుంది. సీలేరు జలాలతో పాటు నీటి పొదుపు చర్యల ద్వారా ఏటా గోదావరి జిల్లాల్లో రబీ సాగు గట్టెక్కుతుంది. ఎగువన ప్రాజెక్టులు పూర్తయితే గోదావరి డెల్టా ఆయకట్టులో 10.13 లక్షల ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఉభయ గోదావరితో పాటు కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కృష్ణా ఆయకట్టు గట్టెక్కాలంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణమే శాశ్వత పరిష్కారం. ప్రచారం ఎక్కువ–పనులు తక్కువ పోలవరం రిజర్వాయర్ ద్వారా 194.60 టీఎంసీల గోదావరి జలాలను నిల్వ చేసుకోవటంతో పాటు 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మరో 79 టీఎంసీల నీటిని లైవ్ స్టోరేజ్‌గా వినియోగించుకునే అవకాశం ఉంది. 80 టీఎంసీల నీటిని కృష్ణా జిల్లాకు తరలిస్తే, కృష్ణా నదిలోని 30 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్ వద్ద నుంచి రాయలసీమ అవసరాలకు వినియోగించవచ్చు. 540 గ్రామాలకు తాగునీరుతోపాటు, విశాఖ పరిశ్రమలకు, తాగునీటి అవసరాలకు నీరు అందుతుంది. 2018 నాటికి నీటిని విడుదల చేయాలంటే కాపర్ డామ్ నిర్మాణాన్ని పూర్తిచేయాలి. ఇంతవరకు కాపర్‌డామ్‌కు సంబంధించి డిజైన్లు ఖరారు కాలేదు. ఐదు రెట్లు పెరిగిన అంచనా వ్యయం 2005–06లో ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.10,151.45 కోట్లుగా నిర్ధారించారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఈ ప్రాజెక్టును 2014 ఏప్రిల్ 1న జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన ఈప్రాజెక్టు నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. కేంద్రం ఇచ్చే నిధుల వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యుటిలైజేషన్ బిల్లులు సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన బిల్లులకు, ఖర్చు చేసిన నిధులకు పొంతన లేదనే అనుమానాలు ఉన్నాయి. ఇటీవల సీఎం చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.48 వేల కోట్లు పెరిగినట్టు ప్రకటించారు. -
ఉత్తర్వులే!
‘మీ సేవ’లో అందని మునిసిపల్ సేవలు నేటికీ అనుసంధానం చేయని వైనం స్వలాభం కోసమే జాప్యమా? అనంత పురం కార్పొరేషన్ : నగర, పట్టణ ప్రజలకు మరిన్ని సేవలు ‘మీ సేవ’ ద్వారా అందించే ప్రక్రియ అడుగు ముందుకు పడలేదు. జనన, మరణ ధ్రువపత్రాలకు తోడు మరో పది మునిసిపల్ సేవ లను 2014 జనవరి 1వ తేదీ నుంచి అందించాలని గత ఏడాది డిసెంబర్ 18న అప్పటి డీఎంఏ జనార్దన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అరుుతే పదకొండు నెలలు గడుస్తున్నా ఆ ఉత్తర్వులు ఎక్కడా అమల్లోకి రాలేదు. ఎప్పటిలాగానే కేవలం జనన, మరణ ధ్రువపత్రాలను మాత్రమే ఇస్తున్నారు. మీ సేవా ద్వారా అందించాల్సిన పది సేవలకు సంబంధించిన డేటాను అనంతపురం కార్పొరేషన్‌తో పాటు మిగిలిన 11 పురపాలక సంఘాల్లోనూ ‘మీ సేవ’కు అనుసంధానం చేయలేదు. దీంతో పది సేవల్లో ఏ ఒక్కటీ ‘మీ సేవ’ నుంచి పొందే సౌలభ్యం ప్రజలకు అందుబాటులోకి రాలేదు. కొళాయి కనెక్షన్లకు మొదలు టాన్స్‌ఫర్ ఆఫ్ టైటిల్, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ దరఖాస్తులు పురపాలక సంఘాల్లో నేరుగా తీసుకుంటున్నారు. ఇదో మతలబు వ్యవహారం పది మునిసిపల్ సేవలను మీ-సేవకు అనుసంధానం చేయకపోవడం వెనుక ఇక్కడి సిబ్బంది మతలబు వ్యవహారం ఉందనే విమర్శలు వినవస్తున్నాయి. మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే నిర్ధేశించిన వ్యవధిలో అనుమతులు మంజూరు చేయాలి. లేదా అనుమతిని ఎందుకు ఇవ్వలేకపోతున్నారో తెలియజేస్తూ ఎండార్స్మెంట్ ఇవ్వాలి. ఈ రెండింట్లో ఏది జరిగినా ఇక్కడి వారి జేబుల్లోకి ఏమీ రాదు. నేరుగా దరఖాస్తులు స్వీకరిస్తే దరఖాస్తుదారుడి నుంచి స్థాయి బట్టి ఇక్కడి సిబ్బంది దండుకోవడం జరుగుతోందన్న విమర్శలు ఉన్నారుు. మీ సేవకు అనుసంధానం చేస్తే ‘ఇలాంటి’ ఆదాయానికి బ్రేక్ పడుతుంది. ఈ కారణంగానే పది సేవలను మీ-సేవకు అనుసంధానించడంలో జాప్యం చేస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. జనవరి ఒకటి నుంచి అందించాల్సిన సేవలు = ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ (ఆస్తిపై యజమాని పేరు బదలాయింపు) = నీటి కొళాయి కనెక్షన్‌కి అనుమతి = ట్రేడ్ లెసైన్స్ దరఖాస్తు = ట్రేడ్ లెసైన్స్ రెన్యువల్ = భవన నిర్మాణాలకు ప్లాన్ అప్రూవల్ దరఖాస్తు = న్యూ అసెస్మెంట్ రిక్వెస్ట్ (ఆస్తి పన్ను విధింపు) = సబ్ డివిజన్ రిక్వెస్ట్ = మినహాయింపు అభ్యర్థన = వెయికెన్సీ రెమిషనర్ రిక్వెస్ట్ = ఆక్యుపెన్సీ సర్టిఫికెట్