ఇంటి స్థలం వివాదానికి సంబంధించి బావమరిదిని హత్య చేసిన కేసులో నిందితుడు కొనుకు నాగేశ్వరరావును పి.గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు.
పి.గన్నవరం (తూర్పుగోదావరి): ఇంటి స్థలం వివాదానికి సంబంధించి బావమరిదిని హత్య చేసిన కేసులో నిందితుడు కొనుకు నాగేశ్వరరావును పి.గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. మండలంలోని ముంగండ గ్రామంలో ఈనెల 7న కొనుకు నాగేశ్వరరావు అతడి బావమరిది రొక్కాల ముత్యాలు(61)పై చాకుతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. బాధితుడిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ కేసు వివరాలను సీఐ రమణ సోమవారం వెల్లడించారు.
విభేదాల కారణంగా నాగేశ్వరరావుతో విడిపోయి అతడి భార్య లక్ష్మి పిల్లలతో కలసి హైదరాబాద్‌లో నివసిస్తోంది. ఆమెకు పుట్టింటివారు ముంగండ గ్రామంలో ఇచ్చిన ఇంటి స్థలంలో మట్టిని నాగేశ్వరరావు విక్రయిస్తుండడంతో దానికి ముత్యాలు (లక్ష్మి సోదరుడు) అభ్యంతర పెట్టాడు. దీంతో అతడిపై కక్ష పెంచుకున్న నాగేశ్వరరావు దాడికి పాల్పడ్డాడు.


