ముస్లింల సంక్షేమానికి వైఎస్ కృషి మరువలేనిది: అక్బరుద్దీన్ | Muslim reservation introduced by Y S Rajasekara reddy, says Akbaruddin owaisi | Sakshi
Sakshi News home page

ముస్లింల సంక్షేమానికి వైఎస్ కృషి మరువలేనిది: అక్బరుద్దీన్

Published Sun, Mar 2 2014 12:33 PM | Last Updated on Sat, Sep 2 2017 4:16 AM

ముస్లింల సంక్షేమానికి వైఎస్ కృషి మరువలేనిది: అక్బరుద్దీన్

ముస్లింల సంక్షేమానికి వైఎస్ కృషి మరువలేనిది: అక్బరుద్దీన్

దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్కరే ముస్లింల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేశారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఎంఐఎం పార్టీ 56వ వార్షికోత్సవం ఆదివారం పాతబస్తీలోని దారుస్సాలాంలో కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ... మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. ముస్లింలకు ప్రస్తుతం నాలుగు శాతం రిజర్వేషన్ ఉందంటే అది మహానేత ముస్లింలకు ఇచ్చిన వరమేనన్నారు.

 

వైఎస్ ముస్లింలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఎందరో ముస్లింలు వైద్యులు అయ్యారని తెలిపారు. 56వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్తోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైదరాబాద్ నగర మేయర్ మాజిద్, కార్పొరేటర్లులతోపాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement