ఇదే నా ప్లాట్‌ఫాం | my Platforms | Sakshi
Sakshi News home page

ఇదే నా ప్లాట్‌ఫాం

Published Mon, Jan 25 2016 12:23 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 PM

ఇదే నా ప్లాట్‌ఫాం

ఇదే నా ప్లాట్‌ఫాం

ఆనం కళాకేంద్రంలో గాయకుడు మల్లికార్జున్
 కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : తన ప్రస్థానానికి రాజమహేంద్రవరంలోని ఆనం కళా కేంద్రమే వేదికని సినీ నేపథ్య గాయకుడు మల్లికార్జున్ అన్నారు. శ్రీహరి ఆర్కెస్ట్రా రజతోత్సవం సందర్భంగా స్థానిక ఆనం కళా కేంద్రంలో ఆదివారం రాత్రి సినీ సంగీత విభావరి జరిగింది. ఇందులో పాల్గొన్న మల్లికార్జున్ మాట్లాడుతూ 1985లో తన తొమ్మిదో ఏట తొలిసారిగా ఇదే వేదికపై గళం విప్పానని చెప్పారు.
 
  గోదారి తీరాన తొలిసారిగా పాటల పోటీల్లో పాల్గొని, విజయం సాధించానని జ్ఞప్తి చేసుకున్నారు. అప్పటి నుంచి మొదలైన తన ప్రస్థానంలో అంతర్జాతీయ వేదికలపైనా పాడే అవకాశం కలిగిందని పేర్కొన్నారు. గాయకురాలు గోపికా పూర్ణిమ మాట్లాడుతూ రాజమహేంద్రవరం అంటే తనకెంతో ఇష్టమన్నారు. ఇక్కడి ప్రేమాభిమానాలు మరెక్కడా దొరకవని చెప్పారు. తాను పాడిన పాటలెన్నో గోదావరి తీరంలో చిత్రీకరించిన చిత్రాల్లో ఉన్నాయని తెలిపారు. సంగీత విభావరి అనంతరం వారిని సత్కరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement