
23న సుద్దాలకు నాగభైరవ అవార్డు ప్రదానం
నెల్లూరు: ప్రతిష్టాత్మక డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు-2014 అవార్డును ప్రముఖ సినీకవి సుద్దాల అశోక్‌తేజకు ఈనెల 23న ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు అవార్డు కమిటీ అధ్యక్షుడు వెన్నెలకంటి, ప్రధాన కార్యదర్శి చిన్నివెంకటేశ్వరరావు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
అలాగే ప్రముఖ కవి అద్దంకి శ్రీనివాస్‌కు నాగభైరవ సాహితీ అవార్డు , ఆరుగురు కవులకు నాగభైరవ స్ఫూర్తి అవార్డులను అందజేయనున్నట్టు వెల్లడించారు. వారిలో ఏటూరి నాగేంద్ర కుమార్(నెల్లూరు), కోసూరు రవికుమార్(గుంటూరు), తూమాటి సంజీవరావు(చెన్నై), కోకావిమలకుమారి(విజయవాడ), అద్దేపల్లి జ్యోతి(కాకినాడ), శ్రీరామకవచం(ఒంగోలు) ఉన్నారని తెలిపారు.