Vennelakanti
-
20 ఏళ్ళ కింద పాడిన పాట గురించీ వివరణ అడిగాడు బాలు గారు
-
సినిమా హిట్ అయినా చులకనగా చూస్తారు మమ్మల్ని: రచయిత వెన్నెలకంటి
-
వెన్నెలకంటికి తానా అశ్రు నివాళి
పాటల రచయిత వెన్నలకంటి మృతి పట్ల తానా ప్రపంచ సాహిత్య వేదిక ఘన నివాళి అర్పించింది. ఈ సందర్భంగా వెన్నెలకంటి కుటుంబ సభ్యులకు తానా ప్రగాడ సానుభూతిని తెలుపుతూ భగవంతుడు అయన ఆత్మకు శాంతి చేకూరాలని తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ప్రకటించారు. డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ తానా ప్రపంచ సాహిత్య వేదిక ప్రతి నెలా ఆఖరి ఆదివారం జరుపుతున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశాలలో గత వారం డిసెంబర్ 27 న జరిగిన “సినిమా పాటల్లో సాహిత్యం” అనే 8వ సమావేశంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువనచంద్ర, డా. సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్‌తో పాటు అతిధిగా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న వెన్నెలకంటి తనకు అత్యంత సన్నిహిత మిత్రుడని, తరచూ సంభాషించే ఒక మంచి రచయిత అకస్మాత్తుగా కనుమరుగై పోవడం అత్యంత విషాదకరం అన్నారు. తెలుగు సినిమా పాటకు కేంద్ర స్థాయిలో అన్యాయం జరుగుతోందని, ఎంతోమంది సినీగీత రచయితలు అద్భుతమైన పాటలు రాసినప్పటికీ వాటిని జాతీయ స్థాయిలో గుర్తించకపోవడం శోచనీయమని.. ఈ పరిస్థితి మారాలని అన్నారు. -
చిరునవ్వుల వరమిస్తావా.. చితినుండి లేచొస్తా!!
సాక్షి, హైదరాబాద్: గేయ రచయిత వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. గుండెపోటుతో ఆయన చెన్నైలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. పలువురు సినీ రంగ ప్రముఖులు, నటీనటులు, గాయనీ గాయకులు వెన్నెలకంటి మృతిపై సంతాపం ప్రకటించారు. ఆయన కలం నుంచి జాలువారిన అద్భుతమైన పాటలను, అజరామర సాహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. 1988లో వచ్చిన `మహర్షి` మూవీలోని మాటరాని మౌనమిది ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలాగే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బిగ్గెస్ట్‌హిట్ చంద్రముఖిలోని `కొంత కాలం కొంతం కాలం కాలమాగిపోవాలి’ అనే పాట కూడా అభిమానులకు ఆకట్టుకుంది. దీంతోపాటు బృందావనం చిత్రంలో "మధురమే సుధా గానం", ఓహో ఓహో పావురమా’’, ఆదిత్య 369 చిత్రంలో ‘రాసలీల వేళ ’ లాంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలున్నాయి. వీటితోపాటు స్వాతికిరణం, బిరియానీ, ఆవారా, ఆకాశమంతా, పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాల్లోని ఆయన పాటలు విశేష ఆదరణ పొందాయి. వెన్నెలకంటి అకాలమరణంపై గాయని చిన్మయి శ్రీపాద విచారం వ్యక్తం చేశారు. ‘చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి లేచొస్తాను అంటూ చిరునవ్వుల వరమిస్తావా మూవీ కోసం ఆయన రాసిన గీతాన్ని తలుచుకున్నారు మరో సినీ గేయ రచయిత భాస్కర భట్ల. వెన్నెలకంటికి ట్విటర్ ద్వారా అశృనివాళులర్పించారు. చిరునవ్వుల వరమిస్తావా చితి నుండీ లేచొస్తా మరుజన్మకి కరుణిస్తావా ఈ క్షణమే మరణిస్తా -వెన్నెలకంటి ❤️ వెన్నెలకంటి గారికి అశృనివాళి 💐💐💐 — bhaskarabhatla (@bhaskarabhatla) January 5, 2021 Heartbreaking that Sri Vennelakanti garu has passed on. A legendary writer that’ll be sorely missed. — Chinmayi Sripaada (@Chinmayi) January 5, 2021 -
చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల
‘మాటరాని మౌనమిది... మౌనవీణ గానమిది.. గానమిదీ నీ ధ్యానమిది.. ధ్యానములో నా ప్రాణమిదీ.. ప్రాణమైన మూగ గుండె రాగమిది’... పదాల కూర్పు చదివారు కదా. మౌనంతో ముగించి.. మౌనంతో ఆరంభించి.. గానంతో ముగించి.. గానంతో ఆరంభించి... ధ్యానంతో ముగించి.. ధ్యానంతో ఆరంభించి... మొదటి పంక్తిలోని చివరి పదంతో రెండో పంక్తిని మొదలుపెట్టడం. ఇదే కాదు...‘నేను ఆటోవాణ్ణి..’ అని మాస్‌కి కిక్ ఇచ్చారు. ‘హృదయం ఎక్కడున్నది..’ అంటూ ప్రేమికులకు మంచి పాటిచ్చారు ‘రాసలీల వేళ.. రాయబారమేల..’ అంటూ రొమాన్స్ పండించారు.ఇంకా ఎన్నో ఇచ్చారు... మంచి పాటలా మనసులో నిలిచిపోయారు.ఇప్పుడు ఆ కలం మౌనం వహించింది. మాటలు ఎప్పటికీ ఉంటాయి. ప్రముఖ గేయరచయిత వెన్నెలకంటి (64) మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన అసలు పేరు రాజేశ్వరప్రసాద్. ‘వెన్నెలకంటి’ ఇంటి పేరు. సుమారు 300పై చిలుకు సినిమాల్లో రెండువేలకు పైగా పాటలు రాశారు. ఆ 300 సినిమాల్లో 270కి పైగా సినిమాలు అనువాద చిత్రాల్లోని పాటలే. 1957లో నెల్లూరులో జన్మించారు వెన్నెలకంటి. విద్యాభ్యాసాన్నంతా నెల్లూరులోనే పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచీ సాహిత్యమంటే అభిరుచి ఎక్కువ. వెన్నెలకంటి తండ్రి వి. కోటేశ్వరరావు (సినీ ఇండస్ట్రీలో ప్రొడక్షన్ ఇన్చార్జ్గా చేసేవారు). టైటిల్ కార్డ్స్‌లో తండ్రి పేరు చూసి సినిమాల్లోకి రావాలనే ఆకాంక్ష ఎక్కువైంది. పదకొండేళ్ల వయసున్నప్పుడే ‘దుఃఖనాశ పార్వతీశా’ అనే మకుటంతో శతకం రాశారు వెన్నెలకంటి. అలానే ‘రామచంద్ర శతకం, లలితా శతకం’ కూడా రాశారు. మనసంతా నాటకాలు, సినిమాలతోనే నిండిపోయుండేది. నెల్లూరులో సాంస్కృతిక, సాహిత్యానికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా వెన్నెలకంటి తప్పనిసరి ఉండేవారు. చదువు పూర్తి చేసి బ్యాంక్‌లో ఉద్యోగం పొందినా, దృష్టంతా సినిమాల వైపే. నెల్లూరు నుంచి సరదాగా చెన్నై వెళ్లి వస్తుండేవారు. నటుడు, నిర్మాత ప్రభాకర్ రెడ్డి ద్వారా 1986లో ‘శ్రీరామచంద్రుడు’ సినిమాలో తొలి పాట రాసే అవకాశం వచ్చింది. చదవండి: తేజకు నో చెప్పిన కాజల్.. తాప్సీ ఓకే అలా వెన్నెలకంటి రాసిన మొదటి పాట ‘చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల...’. గాయకులు యస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రోత్సాహంతో 1987లో ‘అన్నా చెల్లెలు’లో ‘అందాలు ఆవురావురన్నాయి..’ అనే పాట రాశారు. ఆ తర్వాత రచయితగా బిజీ కావడంతో బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశారు. 1988లో ‘మహర్షి’ సినిమా రూపంలో ఆయన కెరీర్‌కు పెద్ద బ్రేక్ దొరికింది. ఆ సినిమాకి రాసిన ‘మాట రాని మౌనమిది.. మౌనవీణ గానమిది...’ పాటను తెలుగు రాష్ట్రమంతా పాడుకుంది. దీంతో ‘మహర్షి’ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోరే ‘నాయకుడు’ (మణిరత్నం – కమల్‌హాసన్) తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కి పాటలు రాయించారు. ఆ వెంటనే వంశీ ‘చెట్టుకింద ప్లీడర్’ సినిమాలో ‘చల్తీకా నామ్ గాడీ చలాకీ వన్నె లేడీ...’, ‘అల్లిబిల్లి కలలా రావే.. అల్లుకున్న కథలా రావే..’ పాట రాశారు. సింగీతం శ్రీనివాసరావు ‘బృందావనం’లో రాసిన ‘మధురమే సుధా గానం..., ఓహో ఓహో బుల్లి పావురమా...’ పాటలు రాశారు వెన్నెలకంటి. ఈ పాటలు విని, ‘పింగళిగారితో రాయించుకున్న ఫీలింగ్ కలుగుతోంది’ అని మెచ్చుకున్నారట సింగీతం. ఆ తర్వాత ‘స్వాతి కిరణం, క్షత్రియపుత్రుడు, మహానది’ వంటి అనువాద సినిమాలకు పాటలు రాశారు. అర్జున్, ఖుష్భూ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సంగ్రామం’తో డైలాగ్ రైటర్‌గా మారారు. కమల్ నటించిన ‘పంచతంత్రం, పోతురాజు, ముంబై ఎక్స్‌ప్రెస్, దశావతారం, మన్మధ బాణం’ వంటి సినిమాలకు తెలుగు డైలాగ్స్ రాశారు. లాక్డౌన్లో రామాయణానికి సంబంధించిన పద్యాలు రాశారు. ఆయుష్షు ఉంటే రామాయణ మహాగ్రంధాన్ని రాయాలనుందని ఇటీవలే తన కోరికను పంచుకున్నట్టు వెన్నెలకంటి కుమారుడు శశాంక్ వెన్నెలకంటి పేర్కొన్నారు. వెన్నెలకంటికి భార్య ప్రమీలాకుమారి, ఇద్దరు కుమారులు శశాంక్, రాకేందు మౌళి ఉన్నారు. శశాంక్ రచయితగా, రాకేందు రచయితగా, నటుడిగానూ చేస్తున్నారు. వెన్నెలకంటి మరణం ఆ కుటుంబానికే కాదు సినిమా ఇండస్ట్రీకి కూడా తీరని లోటు. వెన్నెలకంటి కలం నుంచి వచ్చిన మొదటి పాట ‘చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల...’. అవును... ఇప్పుడు నింగి పండగ చేసుకునే వేళ. నింగికి జోల వినిపించడానికి వెన్నెల వెళ్లారు. ఆ వెన్నెల కూడా ఈ వెన్నెలకు జోల పాడబోతోంది. ఇక ‘మాట రాని మౌనం’ ఇక్కడ. కానీ... పాటల వెన్నెల బతికే ఉంటుంది. వెన్నెలకంటి హిట్స్‌లో కొన్ని నేనాటోవాణ్ణి ఆటోవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి (బాష) రాసలీల వేళ రాయబారమేళ (ఆదిత్య 369) శ్రీరంగ రంగనాథుని రూపమే చూడవే (మహానది) సన్నజాజి పడకా (క్షత్రియ పుత్రుడు) హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది (గజిని) చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి బతికొస్తాను (చిరునవ్వుల వరమిస్తావా). -
వీళ్ళు నా చాన్స్ లు కొట్టేశారు!
తెలుగు సినిమాకు సంబంధించి అది ఒక అరుదైన కుటుంబం. తండ్రి - వెన్నెలకంటి (రాజేశ్వర ప్రసాద్) గీత రచయిత, అనువాద చిత్రాల మాటల రచయిత. పిల్లలిద్దరూ అక్షరాలా ఆయనకు వారసులయ్యారు. పెద్ద కొడుకు శశాంక్ వెన్నెలకంటి డబ్బింగ్ చిత్రాల మాటల రచయితగా పదేళ్ళలో ఉన్నతశిఖరాలను అధిరో హించారు. చిన్న కొడుకు రాకేందు మౌళి నేరు చిత్రాలకూ గీత రచయిత, గాయకుడుగా పేరు తెచ్చుకుం టున్నారు. రానున్న ‘మూడు ముక్కల్లో చెప్పాలంటే...’ చిత్రం ఈ ముగ్గురితో ఒక అరుదైన విన్యాసానికి సాక్ష్యమైంది. ఎస్పీబీ కుమారుడు ఎస్పీ చరణ్ తెలుగు, తమిళభాషల్లో ఏకకాలంలో నిర్మించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్‌కు వెన్నెలకంటి పాట, శశాంక్ మాట, హీరోగా రాకేందు ఆట- తెరపై అలరించనున్నాయి. బహుశా ఒక కుటుంబం నుంచి ఏకకాలంలో ముగ్గురు రచయితలు బిజీగా రచన చేస్తుండడం, ఒకే సినిమాకు ముగ్గురూ కలసి పనిచేయడం తెలుగులో అపూర్వ విషయమే. ఈ అరుదైన విన్యాసానికి కారకులైన ముగ్గురినీ ఒకచోట చేర్చి, జరిపిన ప్రత్యేక సంభాషణ... ‘ఫ్యామిలీ’ పాఠకులకు ట్రిపుల్ ధమాకా... కుటుంబం మొత్తం సినీ రచయితలైపోయారు. ఎలా ఉంది? వెన్నెలకంటి: (నవ్వేస్తూ...) ఇప్పుడు కాదు... మా నాన్న గారి నుంచే మాది సినిమా కుటుంబం. ఏయన్నార్‌ను ‘శ్రీసీతారామ జననము’ (1944) చిత్రంతో హీరోగా పరిచయం చేసిన దర్శక - నిర్మాత ఘంటసాల బలరామయ్య గారు, మా నాన్న గారు కోటేశ్వరరావు ఆబాల్యమిత్రులు. సినిమా ప్రొడక్షన్ విభాగంలో ఉన్న బలరామయ్య గారు దర్శక - నిర్మాతగా ఎదిగి, సంస్థకు ఏం పేరు పెడదామని మా నాన్న గారిని అడిగితే, ‘ఇదంతా నీ ప్రతిభే కదా! కాబట్టి ‘ప్రతిభా’ ఫిలిమ్స్ అని పేరు పెడదాం’ అని అన్నారట. ఆ సంస్థలో నిర్మించిన చిత్రాల్లో టైటిల్ కార్డుల్లో కూడా దర్శక - నిర్మాత బలరామయ్యగారి పేరుకు ముందుగా, చీఫ్ టెక్నీషియన్ల కన్నా పెద్ద పీట వేస్తూ ‘ప్రొడక్షన్ చీఫ్ - వి. కోటేశ్వర రావు’ అని మా నాన్న గారి పేరు పడేది. ఎప్పటికైనా నా పేరు కూడా అలా వెండితెర మీద చూసుకోవాలనే కోరిక చిన్నప్పటి నుంచి నాకు ఉండేది. బి.కామ్ చదివి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తూ, సినిమా రచయితగా ఈ రంగానికి వచ్చాను. వెన్నెలకంటి అనే మా ఇంటిపేరుతో పాపులర్ అయ్యాను. గీత రచయితగా తొలి అవకాశం దర్శక - నిర్మాత, నటుడు ప్రభాకరరెడ్డి గారు ఇస్తే, నన్ను ప్రోత్సహించి ఇంతవాణ్ణి చేసింది - ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. బాలు గారికి సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి గారెంత చేశారో, బాలు గారు నాకు అంతకన్నా ఎక్కువ చేశారు. ఆయన లేకపోతే నేను లేను. శశాంక్ వెన్నెలకంటి: డబ్బింగ్, నేరు సినిమాల రచయితగా పదేళ్ళ క్రితం మొదలైన నా ప్రస్థానం వెనుక చాలామంది ప్రోత్సాహం ఉంది. నేను మొదలైంది అసలు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా! ఏడో తరగతి చదువుతున్న రోజుల నుంచి స్కూల్లో నాటకాలు వేస్తూ, బహుమతులు సంపాదించా. హాలీవుడ్ చిత్రం ‘జురాసిక్ పార్క్’ను తెలుగులోకి అనువదించే అవకాశం నాన్న గారికి వచ్చినప్పుడు, మా నాన్న గారి అసిస్టెంట్ రచయిత మల్లూరి వెంకట్ ఆ సినిమాలోని ఒక చిన్న పిల్లాడి పాత్రకు నాతో డబ్బింగ్ చెప్పించారు. అప్పటి నుంచి నన్ను ఈ రంగంలో బాగా సాది, తీర్చిదిద్దింది - ఘంటసాల గారబ్బాయి రత్నకుమార్. ఆయనే నా గురువు. సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ తారాకృష్ణ నాకు ఎంతో నేర్పించారు. బాలనటీనటులతో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘రామాయణం’లో రావణ పాత్రధారిణికి నేను చెప్పిన డబ్బింగ్ బాగా గుర్తింపు తెచ్చింది. మా నాన్న గారితో పాటు వసంతకుమార్, శ్రీరామకృష్ణ, రాజశేఖర రెడ్డి గార్ల లాంటి ప్రసిద్ధ డబ్బింగ్ రచయితలందరి దగ్గరా పని చేశాను. వారి ప్రోత్సాహం, ప్రేరణ నాకెంతో ఉపకరించాయి. రోహిత్, సచిన్ లాంటి హీరోలకూ డబ్బింగ్ చెప్పా. తమిళ హీరో శింబుకు ‘కుర్రాడొచ్చాడు’ చిత్రానికి డబ్బింగ్ చెప్పాక ఆ తరువాత ‘మన్మథ’తెలుగు అనువాదానికి వచ్చినప్పుడు నిర్మాత - బాలూ గారి బంధువైన శివలెంక కృష్ణప్రసాద్, తాడేపల్లిగూడెం కె. విజయ భాస్కరరెడ్డిల ప్రోత్సాహంతో అనుకోకుండా ఆ సినిమాకు రచయితనయ్యా. వాళ్ళు రాయమని అడగగానే, రాస్తానన్నా. ఆ ‘మన్మథ’ చిత్రం, ఆ వెంటనే రాసిన ‘గజని’, ‘పందెంకోడి’ చిత్రాలు హిట్టయ్యేసరికి ఇక అనువాద రచయితగా స్థిరపడ్డా. అప్పటి నుంచి ఈ పదేళ్ళలో దాదాపు 200 సినిమాలకు రచన చేశా. తమ్ముడు కూడా సినీ గీత రచన, గానంతో మొదలుపెట్టి ఇప్పుడు హీరో అయ్యాడు. వారసుల్ని తేవడంలో మీ నాన్న గారి ప్రమేయం? వెన్నెలకంటి: (అందుకుంటూ...) నా ప్రమేయం ఏమీ లేదు. వాళ్ళకు సినిమా పట్ల ఆసక్తి ఉంది. అన్నద మ్ములిద్దరూ ఒకరికొకరు సలహాలిచ్చుకుంటారు. రాకేందుకు హీరో అవకాశమిస్తూ ఎస్పీ చరణ్ వాళ్ళు అడిగినప్పుడు కూడా వాడు, వాళ్ళ అన్నయ్య సలహా అడిగి, ఆ తరువాత వాళ్ళ అమ్మ ప్రమీలకు చెప్పి, ఆఖరుగా నాకు తెలియజేశాడు (నవ్వులు). పెద్దవాడేమో విజువల్ కమ్యూనికేషన్ చదివి, సినీ రచన వైపు వచ్చాడు. చిన్నవాడేమో లక్షల ఖర్చుపెట్టి, నేను ఇంజనీరింగ్ చదివిస్తే, పాటల రచన, నటన వైపు వచ్చాడు. వాళ్ళ ఆసక్తిని నేనెప్పుడూ నిరుత్సాహ పరచలేదు. నమ్మి, వదిలిపెట్టాను. అదే సమయంలో వాళ్ళ రచన, నటన విషయంలోనూ నేనేమీ జోక్యం చేసుకోను. కాకపోతే, వాళ్ళు చేసింది, రాసింది చూపించినప్పుడు ‘బాగుంది, బాగా లేదు’ అనే జడ్జిమెంట్ మాత్రం చెబుతుంటా. గీత రచయితగా, గాయకుడిగా పేరొస్తున్న రాకేందుకు నటించాలన్న కోరిక ఎలా వచ్చింది? రాకేందు మౌళి: మా నాన్న గారు లక్షల ఖర్చుపెట్టి ఇంజనీరింగ్ చదివించారన్న మాటే కానీ, చిన్నప్పటి నుంచి నా దృష్టి అంతా సినిమా మీదే! వెన్నెలకంటి: మా ఆవిడకు సంగీతం, నృత్యం బాగా ఇష్టం. అందుకే, వీణ్ణి ఎలాగైనా సింగర్‌నీ, డ్యాన్సర్నీ చేయాలని, అవి నేర్పించింది. కర్ణాటక సంగీతం వీడికి ఎంత బాగా వచ్చంటే... నెల్లూరులో ఇప్పటికి 50 ఏళ్ళుగా భిక్షాపూర్వకంగా త్యాగరాజ స్మరణోత్సవాలు జరుగుతున్నాయి. ఎస్పీబీ నాన్న గారైన సాంబమూర్తి గారు ప్రారంభించిన ఆ ఉత్సవాల్లో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి తప్ప మహామహులంతా పాడినవారే. ప్రతిష్ఠాత్మకమైన ఆ ఉత్సవాలలో మా వాడు కచ్చేరీలిచ్చాడు. అందుకేనా రాకేందు గాయకుడిగా మొదలుపెట్టారు? రాకేందు: (నవ్వేస్తూ...) ముందు పాటలు రాశా. ‘ఆవారా’ సినిమా పాటల సీడీ కూడా విడుదలయ్యాక, సినిమా చివరలో ఒక పాట వస్తుందని చెప్పారు. ఒక్క రోజులో మిక్సింగ్‌కు వెళ్ళిపోవాలి. అన్నయ్య, నాన్న బిజీగా ఉన్నారు. దాంతో ఆ పాట నేనే రాశా. అలాగే, ‘షాపింగ్ మాల్’లో, ఇంకా కొన్ని చిత్రాల్లో రాశా. నేరు తెలుగు చిత్రం ‘అందాల రాక్షసి’కి ఆ చిత్ర దర్శకుడు నాతో పాట రాయించి, పాడించారు. అలాగే, ‘సాహెబా - సుబ్రహ్మణ్యం’ సినిమాలో పాటలన్నీ నేను రాసినవే. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’లో కూడా రెండు పాటలు రాశా. మొత్తం 70 దాకా పాటలు రాశా. కొన్ని పాటలు పాడా. ‘అందాల రాక్షసి’లో నేను రాసిన ‘ఏమిటో...’ పాట ఏకగ్రీవంగా హిట్టయింది. ఇక, నేనే రాసి, పాడిన ‘మనసు పలికే’ పాట ‘రేడియో మిర్చి’ అవార్డుల్లో ఉత్తమ వర్ధమాన గాయకుడిగా, రచయితగా అవార్డు తెచ్చింది. శశాంక్: నేనూ ‘రైడ్’, ‘శంభో శివశంభో’ లాంటి నేరు చిత్రాలకు మాటలు, కొన్ని సినిమాల్లో పాటలూ రాశా. ఒకే ఇంట్లో ముగ్గురు రచయితలు... మీ మధ్య మీకే పోటీ! వెన్నెలకంటి: వీళ్ళిద్దరూ రచయితలై, నా అవకాశాలు కొట్టేశారు. (నవ్వులు...) తమాషాలు పక్కనపెడితే, సినీ రచయితలైన సీనియర్ సముద్రాల గారు, వారి అబ్బాయి సముద్రాల జూనియర్ లాంటి మహామహులకు దక్కిన అదృష్టం నాకూ, మా కుటుంబానికీ దక్కడం ఆనందం. రాకేందు: అయినా, మాలో ఎవరి రచనా విధానం, శైలి వారిదే! పాటలోని ఆ టెక్చర్లోనే తేడా కనిపిస్తుంది. ఇంతకీ ‘మూడు ముక్కల్లో...’ అవకాశం ఎలా వచ్చింది? రాకేందు: అదో చిత్రమైన కథ. గతంలో ఎస్పీ చరణ్ తమిళంలో నిర్మించిన ‘అరణ్యకాండమ్’ తెలుగు అనువాదం జరుగుతున్నప్పుడు అన్నయ్య శశాంక్ బిజీగా ఉన్నాడు. దాంతో, కొంత నేను రాశా. ఆ పరిచయంతో చరణ్ ‘మూడు ముక్కల్లో...’కి నన్ను రచయితగా ఎంచుకున్నారు. గతంలో నేను నటించిన షార్ట్ ఫిల్మ్ చూసి, నన్నే హీరో పాత్ర చేయమని అడిగారు. కోదండ పాణి గారి మనుమరాలి ళ్ళిలో అడిగారు. శశాంక్: (మధ్యలో అందుకుంటూ...) రాకేందు నాకు ఫోన్ చేసి అడిగాడు. ఒప్పుకోమని చెప్పా. ‘నటన, రచన - రెండూ చేయడం కష్టం కాదా’ అని వాళ్ళడిగితే ‘అన్నయ్య రచన చేస్తాడ’ని చెప్పమన్నా. రచయితనుకున్న రాకేందు హీరో అయ్యాడు. రాకేందు: నిజం చెప్పాలంటే, సినీ రూపకల్పనలో ప్రతిపనీ నాకు ఇష్టమే. ఏ పని అయినా ఇష్టంగా చేసేస్తా. ‘మూడుముక్కల్లో...’ కూడా ఒక పక్కన నటిస్తూనే, నా షాట్ అయిపోగానే దర్శకత్వ విభాగంలో సహాయపడేవాణ్ణి. ఆడుతూ, పాడుతూ సినిమా చేసేశాం. దీని కన్నా ముందు సముద్రకణి దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తయారైన ‘జెండా పై కపిరాజు’కి దర్శకత్వ శాఖలో పనిచేశా. ఒకేసారి నటన, రచన, దర్శకత్వం చేయడం? వెన్నెలకంటి: కష్టం. కానీ, ఇష్టం ఎక్కువున్నప్పుడు కష్టమనిపించదు. సమతూకం చేసుకోగలిగితే సాధ్యమే. శశాంక్: ఎస్పీబీ గారి ద్వారానే నాన్న నిలదొక్కుకు న్నారు. నేనూ సీరియల్స్‌లో ఎస్పీ చరణ్‌కు డబ్బింగ్ చెప్పి, పేరు తెచ్చుకున్నా. తమ్ముడికి కూడా ఎస్పీబీ కుటుంబపు సినిమాలో హీరో చాన్స రావడం విశేషం. రాకేందు: సెంటిమెంటల్‌గా మాకు అది అచ్చొచ్చింది. ఇంతకీ ‘మూడు ముక్కల్లో...’ విశేషాలేంటి? వెన్నెలకంటి: ఏకకాలంలో తెలుగు, తమిళ వెర్షన్లు రెండింటిలో దర్శకురాలు మధుమిత తీసిన సినిమా ఇది. ‘మిథునం’ తరువాత లక్ష్మి, ఎస్పీబీ కలసి నటిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రానికి నేను ఒక పాట రాశా. శశాంక్ మాటలు రాశాడు. రాకేందు నటించాడు. అంటే, ఇది మీ కుటుంబ చిత్రమన్నమాట... వెన్నెలకంటి: (నవ్వేస్తూ...) ఎస్పీబీ ఈ సినిమాలో నటిస్తూ, పాడారు. నిర్మాత ఎస్పీ చరణ్ కూడా ఒక చిన్న వేషం వేశారు. వెంకీ పోషించిన పాత్రకు ఎవరి గొంతూ సరిపోక, తెలుగులో తానే డబ్బింగ్ చెప్పారు. ఇక, ఎస్పీ చరణ్ చేసిన చిన్న వేషానికేమోశశాంకే డబ్బింగ్ చెప్పాడు. అలా ఇది మా ఒక్క కుటుంబమే కాదు, మాది, ఎస్పీబీదీ రెండు కుటుంబాల కథా చిత్రం. ఒకరి గురించి మరొకర్ని మూడు ముక్కల్లో చెప్పమంటే? వెన్నెలకంటి: (శశాంక్ గురించి) పేరునిలబెట్టే వారసుడు! శశాంక్: (తమ్ముడు రాకేందు గురించి...) ఆట, పాట, మాట - మూడింటికీ ఒక కొత్త అడ్రస్. రాకేందు: (తండ్రి వెన్నెలకంటి గురించి...) మంచితనం, మానవత్వం పుష్కలంగా ఉన్న మనసున్న మనిషి. ఫొటోలు: శివ మల్లాల రెంటాల జయదేవ శశాంక్: ‘కష్టపడి పనిచేస్తే సాధించ లేం. ఇష్టపడి చేస్తే సాధించగలం’ అని ‘గజని’లో రాసిన డైలాగే నాకు ఆదర్శం. డబ్బింగ్ రచన చేస్తున్న ప్పుడు కూడా నవతరం ప్రేక్షకులకు తగ్గట్లు ఆ రంగంలో ఏ మార్పు తీసుకురాగలనని ప్రయత్నించా. సక్సెస్ అయ్యా. డబ్బింగ్ చెప్పడం, నటించడం, మాటలు రాయడం, పాటలు రాయడం - ఇలా అన్నీ చేసినా, దర్శకత్వంపై మక్కువ. మంచి స్క్రిప్టుతో, కొత్త నటులతో, కత్తి మీద సామైన దర్శకత్వంలో పేరు తెచ్చుకోవాలని నా కోరిక. వెన్నెలకంటి: అప్పటి సముద్రాల నుంచి ఇవాళ్టి శ్రీమణి దాకా ఎవరు ఏ మంచి పాట రాసినా అది నాకు అభిమాన పాటే. ఆ రచయితకు నేను అభిమానినే. కాకపోతే ఆత్రేయ, వేటూరి గార్లకు పరమభక్తుణ్ణి. నా పాటలైనా చరణాలు కొంత గుర్తుం డవేమో కానీ, పాత పాటలన్నీ నాకు కంఠోపాఠం. పైగా, ఇతరులు రాసిన మంచి పాటలు గుర్తుంటే అలాంటివి రాయాలన్న స్పర్థతో బాగా రాస్తాం. 50 వేల పాటలు పాడినా, ఇప్పటికీ ప్రతిపాటా తొలి పాటలా శ్రద్ధగా పాడే ఎస్పీబీ మార్గం నాకు ఆదర్శం. రాకేందు: లక్షలు ఖర్చుపెట్టి మా నాన్న గారు ఇంజనీరింగ్ చదివించారు. కానీ, నా మనసంతా సినిమానే. అందుకే, ఇటొచ్చా. ఒకవేళ ఇంజనీర్నై ఉంటే, మధ్యరకం ఇంజనీర్‌గా మిగిలే వాణ్ణి. కానీ, ఇష్టపడి సినిమాల్లోకి రావడంతో పరిస్థితి వేరుగా ఉంది. ఫలానావాళ్ళ అబ్బాయినని చెప్పుకొనే కన్నా, కష్టపడి నా కాళ్ళ మీద నేను నిలబడాలనేది నా తపన. రచయితగా మా నాన్నగారు తొలి గురువు. సింగర్‌గా బాలూ గారి ఏకలవ్య శిష్యుణ్ణి. నటనలో చిరంజీవి, రజనీ కాంత్ గార్ల ఫ్యాన్‌ని. కమల హాసన్ గారిలా ఆల్రౌండర్నవ్వాలని కోరిక. -
సుద్దాలకు నాగభైరవ అవార్డు ప్రదానం
నెల్లూరు: ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని పురమందిరంలో ఆదివారం ప్రతిష్టాత్మక డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా అశోక్‌తేజను నాగభైరవ అవార్డు కమిటీ అధ్యక్షుడు వెన్నెలకంటి, అతిథులు సత్కరించి, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రచయిత సలీం పాల్గొన్నారు. -
23న సుద్దాలకు నాగభైరవ అవార్డు ప్రదానం
నెల్లూరు: ప్రతిష్టాత్మక డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు-2014 అవార్డును ప్రముఖ సినీకవి సుద్దాల అశోక్‌తేజకు ఈనెల 23న ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు అవార్డు కమిటీ అధ్యక్షుడు వెన్నెలకంటి, ప్రధాన కార్యదర్శి చిన్నివెంకటేశ్వరరావు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే ప్రముఖ కవి అద్దంకి శ్రీనివాస్‌కు నాగభైరవ సాహితీ అవార్డు , ఆరుగురు కవులకు నాగభైరవ స్ఫూర్తి అవార్డులను అందజేయనున్నట్టు వెల్లడించారు. వారిలో ఏటూరి నాగేంద్ర కుమార్(నెల్లూరు), కోసూరు రవికుమార్(గుంటూరు), తూమాటి సంజీవరావు(చెన్నై), కోకావిమలకుమారి(విజయవాడ), అద్దేపల్లి జ్యోతి(కాకినాడ), శ్రీరామకవచం(ఒంగోలు) ఉన్నారని తెలిపారు. -
పాట వెనుక కథ - వెన్నెలకంటి
-
సినీ కవిగా ఎప్పుడూ రాజీ పడలేదు
పాటల రచయిత వెన్నెలకంటి విజయవాడ : ఆయన పాట యువతీ యువకుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. లాలి పాట రాసినా, ప్రేమ, విరహగీతాలు రచించినా, ప్రబోధ గీతాలకు అక్షర రూపం ఇచ్చినా ఆయన ముద్ర కనపడుతుంది. సినీ కవిగా 25 ఏళ్ల ప్రస్థానానికి చేరుకున్న ఆయనే వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్. విజయవాడలో ఆదివారం జరిగిన మహాకవి శ్రీశ్రీ పాటల పోటీకి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ‘సాక్షి’తో కొద్దిసేపు ముచ్చటించారు. కల్చరల్ : సినీ కవిగా మీ ప్రస్థానం సంతృప్తికరంగా సాగుతోందా? వెన్నెలకంటి : ఇక్కడ ఒక విషయం చెప్పాలి... కవిగా నా సినీ జీవితం ఎప్పుడూ సంతృప్తి కరంగానే సాగింది. నాకు సంబంధించినంత వరకు నా నిర్మాతలు, దర్శకుల నుంచి ఎప్పుడూ ఒత్తిడులకు లోను కాలేదు. సినీ కవిగా ఎప్పుడూ రాజీ పడలేదు. కల్చరల్ : తెలుగు సినీ కవుల్లో పాండిత్యంగలవారు చాలా మంది ఉన్నారు. అరుుతే కేవలం ముగ్గురికే జాతీయ వార్డులు వచ్చాయి. మిగిలినవారికి రాకపోవడానికి కారణం? వెన్నెలకంటి : అవార్డుల కమిటీలో మన తెలుగువారు లేక పోవడమే ప్రధాన కారణం. పాటల్లో సాహిత్యపు విలువలు ఉన్నా, సంబంధిత కమిటీ వారికి అవగాహన లేక పోవడం, మిగతా భాషల వారితో పోలిస్తే మనకు మన భాషపై మమకారం లేకపోవడమూ కారణమే. కల్చరల్ : సినీ సాహిత్యం నేడు బూతు వానలో తేలిపోవడంపై మీ స్పందన? వెన్నెలకంటి : యువకుల భావజాలం మారుతోంది. అందుకు తగిన విధంగానే సినిమాలు తయారవుతున్నాయి. బూతయినా, శృంగారమైనా కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కల్చరల్ : సినీగీతాల్లో శబ్ధ కాలుష్యం పెరిగిపోతోంది. సాహిత్యం కనపడటంలేదు కదా? వెన్నెలకంటి : ఏ వస్తువైనా డిమాండ్‌ను బట్టి తయారవుతుంది. తెలుగు సినీగీతాల పరిస్థితీ అంతే. అయినా అంత నిరాశాజనకంగా మాత్రం తెలుగుపాటలు లేవు. మంచి పాటలు అరుదుగా వస్తూనే ఉన్నాయి. కల్చరల్ : పాట కలకాలం నిలవాలంటే..? వెన్నెలకంటి : సంగీతం, సాహిత్యం, సందర్భం. గాన మాధుర్యం అన్నీ కలవాలి. ఆ గీత జాతకం బాగుండాలి. కల్చరల్ : మీకు నచ్చిన సినీ కవి ఎవరు? వెన్నెలకంటి : మంచి సాహిత్యం, అంతకుమించిన పదలాలిత్యంతో హృదయాన్ని తట్టిలేపే గుబాళింపుతో పాటలురాసే కవి ఎవరైనా నాకు ఇష్టులే. కల్చరల్ : సినీ కవిగా శ్రీశ్రీ గురించి చెప్పండి వెన్నెలకంటి : ఆయనదంతా ఓ యుగం. ప్రభోదాత్మక గీతాలు, విరహగీతాలు, ఒకటేమిటి శ్రీశ్రీ ఏది రాసినా జంఝామారుతమే. అనుకరించ, అనుసరించలేనిది శ్రీశ్రీ బాణి. కల్చరల్ : మీకు నచ్చిన పాట ఏదీ అంటే అన్నీ నాకు నచ్చినవే అంటారు చాలా మంది. మరి మీరేమంటారు? వెన్నెలకంటి : నేను సినీ కవిగా నిలబడటానికి వచ్చాను. బ్యాంకు ఉద్యోగిని కావడంతో ఆర్థిక చిక్కులు లేవు. మంచిపాట కావాలి అంటూ నిర్మాతలు వచ్చినప్పుడు వారి తృప్తి మేరకు చాలానే రాశాను. ‘మామయ్య అన్న పిలుపు’ పాట అంటే చాలా ఇష్టం.