నగర కమిషనర్ నాగవేణి బదిలీ? | Nagaveni transferred to the Commissioner? | Sakshi
Sakshi News home page

నగర కమిషనర్ నాగవేణి బదిలీ?

Published Wed, Dec 10 2014 2:58 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

నగర కమిషనర్ నాగవేణి బదిలీ? - Sakshi

నగర కమిషనర్ నాగవేణి బదిలీ?

నేడో, రేపో ఉత్తర్వులు  వెలువడే అవకాశం
 
గుంటూరు  నగరపాలకసంస్థ కమిషనర్ పి.నాగవేణి బదిలీ కానున్నారు. రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయనున్నట్లు సమాచారం. ఆమెను అనంతపురం కమిషనర్‌గా బదిలీ చేయడంతో పాటు గుంటూరు నగరపాలకసంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్‌గా జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీధర్‌ను నియమించనున్నారు. ఈ ఏడాది మార్చి 14న నాగవేణిని తాత్కాలిక కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. రెండు నెలల క్రితం విశాఖపట్నం జేసీ ప్రవీణ్‌కుమార్‌ను నగరపాలకసంస్థ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

అక్కడ హుదూద్‌తుఫాన్ రావడం, తర్వాత జిల్లా కలెక్టర్ యువరాజ్ ఆయన్ను రిలీవ్ చేయకపోవడం వంటి కారణాలతో ఆయన ఇక్కడ జాయిన్‌కాలేదు. దీంతో నగర కమిషనర్ పి.నాగవేణిని అనంతపురం కమిషనర్‌గా బదిలీచేసి, ఆమె స్థానంలో జేసీ శ్రీధర్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement