
అభిమానులకు బాలకృష్ణ ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ‘అభిమానులూ ఆశీర్వదించండి’ అంటూ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన అభిమానులను కోరారు. తన రెండో కుమార్తె తేజస్విని వివాహం శ్రీభరత్‌తో ఈ నెల 21న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నందమూరి అభిమానులందరూ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని బాలకృష్ణ కోరారు. ఈ మేరకు బాలకృష్ణ తరఫున టీడీపీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
శ్రీభరత్ కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు సోదరి కుమారుడు, విశాఖపట్నం టీడీపీ నాయకుడు ఎంవీఎస్ మూర్తికి మనుమడు. ఈ సంబంధాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుదిర్చారు. బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రహ్మణికి, చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు 2007 ఆగస్టులో వివాహం జరిగిన విషయం తెలిసిందే.