హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కుమారుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ నియమించిన బృందాలు శనివారం పర్యటించనున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈ బృందాలు ఆయ గ్రామాల్లో పర్యటిస్తాయి. బృందంలోని ఒక్కో సభ్యుడు రాజధానికి భూసమీకరణ చేసే రెండు గ్రామాలతో పాటు సమీపంలో మరో రెడు గ్రామాల్లో పర్యటిస్తారని అత్యంత విశ్వసనీయ వర్గాల సమచారం.