మాట్లాడుతున్న అనిల్‌కుమార్‌యాదవ్
నెల్లూరు(క్రైమ్): ‘మంత్రి నారాయణను ఓటమి భయం వెంటాడుతోంది. జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాధరణలో కొట్టుకుపోతాడన్న భయంతో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని’ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ విమర్శించారు. బుధవారం సాయంత్రం పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఐశ్వర్యరస్తోగిని అనీల్‌కుమార్‌యాదవ్ కలిశారు. తాను మాట్లాడిన వీడియోను ఎడిట్ చేసి అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి ఆధారాలు, వివరాలను ఆయన ఎస్పీకి అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గడిచిన కొద్దిరోజులుగా గతేడాది జనవరిలో కార్యకర్తలనుద్దేశించిన తాను చేసిన ప్రసంగాన్ని సీబీఎన్, ఎల్లోమీడియా ఎన్నికల ప్రచారంగా వక్రీకరించి అసత్య ప్రచారాలు చేస్తోందన్నారు. ఈ విషయంపై తాను స్పష్టత ఇచ్చినప్పటికీ పట్టించుకోకుండా తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని తెలిపారు. దీనివెనుక మంత్రి నారాయణ భారీ ప్యాకేజీలే కారణమని విమర్శించారు. ఎన్నికల్లో హుందాగా ఎదుర్కొలేక ఓటమి భయంతో నారాయణ ఈ తరహా కుట్రలకు పన్నాగం పన్నారని విమర్శించారు. అంతేకాకుండా ఓ ప్రముఖ యాడ్‌ఏజెన్సీకు రూ.కోట్లు ఇచ్చి ఐఏబీ, కపాడిపాళెలో జరిగిన ఘటనలను వక్రీకరించి రోజుకో తప్పుడు ప్రచారం చేసి తద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందాలనుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. నారాయణ విద్యాసంస్థల్లో ఆడపిల్లల ఆత్మహత్యలకు షాడోమంత్రి కారణం కాదా అని ప్రశ్నించారు.
ఆ షాడో మంత్రినే నారాయణ తన వెనుక తిప్పుకోవడం, ఎన్నికల బాధ్యతలు ఆయనకు అప్పగించడాన్ని బట్టి చూస్తే మంత్రి పాత్ర సైతం ఉందనే అర్ధమవుతుందన్నారు. మంత్రి ఆయన షాడోల సంగతులు తోడల్లుడు బండి రామ్మోహన్‌రెడ్డి తెలియజేసిన విషయాలను ప్రజలంతా గుర్తించాలన్నారు. ఆ విద్యాసంస్థల్లో 30ఏళ్లు పనిచేసిన తోడల్లుడు విద్యార్థుల చావులు, బలైన కుటుంబాలకు సంబంధించి చేసిన వ్యాఖ్య లకు మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థినీల చావులపై పునాదులు వేసుకుని చీప్ పాలిటిక్స్ చేయ డం తగదన్నారు. ఇదంతా ప్రజలు గమని స్తున్నారనీ, ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. నగర డెప్యుటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, కార్పొరేటర్ ఎండి ఖలీల్‌అహ్మద్, సన్నపురెడ్డి పెంచలరెడ్డి, హంజాహుస్సేనీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment