
అనంతపురం: పట్టణంలోని నారాయణ కాలేజీ సిబ్బంది విద్యార్థుల పట్ల ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. హాస్టల్‌లో వసతి, భోజనం సరిగా ఉండడం లేదని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు అధ్యాపకులను నిలదీశారు. దీంతో కంగుతిన్న నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్ శిఖామణి, వార్డెన్ మహేష్ సీనియర్ విద్యార్థులతో జూనియర్ విద్యార్థులపై దాడి చేయించారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. జూనియర్ ఇంటర్ విద్యార్థులు పట్టణ పోలీస్‌కు చేరుకొని పోలిసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment