Hostel Facilities
-
ఇక హాస్టళ్లలోనూ భౌతిక ‘దూరం’
సాక్షి, హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని జూనియర్ కాలేజీ హాస్టళ్లలో విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించేలా ఇంటర్మీడియెట్ బోర్డు కసరత్తు ప్రారంభించింది. వీటికి సంబంధించిన నిబంధనలు ఖరారు చేసేందుకు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ కమిటీ హాస్టళ్ల అనుమతులకు సంబం ధించిన మార్గదర్శకాలపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో హాస్టళ్లలో ఉండే విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించేలా ఒక్కో విద్యార్థికి కేటాయించాల్సిన కనీస స్థలాన్ని రెట్టింపు చేసే దిశగా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి హాస్టల్లో కనీసంగా 50 ఎస్ఎఫ్టీ స్థలం కేటాయించాలన్న నిబంధన ఉండగా దానిని రెట్టింపు చేయాలని బోర్డు భావిస్తోంది. వీలైతే అంతకంటే ఎక్కువ స్థలం కేటాయించేలా చూడాలన్న ఆలోచన చేస్తోంది. త్వరలోనే ఆ నిబంధనలను అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడుతోంది. వాటి ప్రకారమే హాస్టళ్ల గుర్తింపు కోసం యాజమాన్యాలు దరఖాస్తు చేసుకునేలా ఇంటర్మీడియెట్ బోర్డు నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. లక్షన్నర మందికిపైగా.. రాష్ట్రంలో 2,500కు పైగా జూనియర్ కాలేజీలుంటే అందులో ప్రభుత్వ, ఎయిడెడ్, సంక్షేమ శాఖల గురుకుల జూనియర్ కాలేజీలు పోగా ప్రైవేటు కాలేజీలు 1,556 ఉన్నాయి. అందులో నివాస వసతితో కూడిన(హాస్టళ్లతో) జూనియర్ కాలేజీలు 570 వరకు ఉన్నట్లు బోర్డు అధికారులు అంచనా. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదివే 9.5 లక్షల మంది విద్యార్థుల్లో ప్రభుత్వ, గురుకుల కాలేజీల్లో దాదాపు 3.5 లక్షల మంది చదువుతుండగా, 6 లక్షల మంది ప్రైవేటు కాలేజీల్లోనే చదువుకుంటున్నారు. అందులో లక్షన్నర మందికి పైగా విద్యార్థులు హాస్టళ్లలోనే ఉంటున్నారు. ప్రస్తుతం ఆయా కాలేజీ హాస్టళ్లలో భౌతిక దూరం పాటించే పరిస్థితి లేదు. నలుగురు ఉండాల్సిన గదుల్లో 8 నుంచి 10 మందిని ఉంచుతున్నారు. సదుపాయాలు పెద్దగా కల్పించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చివరకు ఐదారు అంతస్తులుండే హాస్టళ్లలో లిఫ్ట్ సదుపాయం కూడా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో కరోనా రావడంతో అధికారులు ఆలోచనల్లో పడ్డారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు భౌతిక దూరం పాటించడం కూడా ప్రధానమే కావడంతో 2020–21 విద్యా సంవత్సరంలో హాస్టళ్లలో నిబంధనలను పక్కాగా అమలు చేయాలన్న ఆలోచనల్లో పడ్డారు. మరో వేయి వరకు పాఠశాలల హాస్టళ్లు ఉన్నాయి. వాటిల్లోనూ ఇవే నిబంధనలను అమలు చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టనుంది. చదవండి: తగ్గిన కంటైన్మెంట్ జోన్లు 2018లోనే నిబంధనలు రూపొందించినా... హాస్టళ్లలో ఉండాల్సిన ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పించాల్సిన సదుపాయాలపై 2018 మార్చిలోనే ఇంటర్మీడియెట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. వాటి ప్రకారం హాస్టళ్లలో చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అయితే హాస్టళ్ల గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని, అందుకు ఫీజును నిర్ణయించింది. ముందుగా ఫీజు ఎక్కువగా ఉందని యాజమాన్యాలు పేర్కొనడంతో మూడుసార్లు ఫీజు తగ్గించింది. అయినా యాజమన్యాలు ముందుకు రాకపోగా, కోర్టును ఆశ్రయించాయి. దీంతో బోర్డు ఆ నిబంధనల అమలును పక్కన పెట్టింది. ప్రస్తుతం ఒక్కో హాస్టళ్లలో 300 నుంచి 500 వరకు విద్యార్థులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఆ నిబంధనలను పక్కాగా అమలు చేసేందుకు బోర్డు చర్యలు చేపట్టింది. అయితే గతంలో ఒక్కో విద్యార్థికి కేటాయించాల్సిన కనీస స్థలాన్ని రెట్టింపు చేయడం ద్వారా భౌతిక దూరం పాటించేలా చేయవచ్చన్న ఆలోచనకు వచ్చింది. దీంతోపాటు ప్రతి చోట భౌతిక దూరాన్ని పెంచేలా నిబంధనల్లో మార్పులు చేసేందుకు అధికారుల కమిటీ చర్యలు చేపట్టింది. మార్పులు చేయనున్న కొన్ని నిబంధనలు (ప్రస్తుతం ఉన్నవి)... ►25 మంది విద్యార్థులు ఉండే ఒక్కో డార్మెటరీ 1,000 ఎస్ఎఫ్టీ ఉండాలి. రూమ్ అయితే ఒక్కో విద్యార్థికి 50 ఎస్ఎఫ్టీ ఉండాలి. ► 25 మంది విద్యార్థులకు స్టడీ రూమ్ 300 ఎస్ఎఫ్టీ ఉండాలి. ►ఫస్ట్ ఎయిడ్/సిక్ రూమ్ ఒక్కో విద్యార్థికి 75 ఎస్ఎఫ్టీ ఉండాలి. డార్మెటరీ లాంటిదైతే 10 మందికి 750 ఎస్ఎఫ్టీ ఉండాలి. ►కిచెన్ 250 ఎస్ఎఫ్టీ, డైనింగ్ హాల్ కనీసంగా 500 ఎస్ఎఫ్టీ, రిక్రియేషన్ రూమ్ 300 ఎస్ఎఫ్టీ, లైబ్రరీ 500 ఎస్ఎఫ్టీ, ఆఫీస్ ఏరియా 500 ఎస్ఎఫ్టీ, కౌన్సెలింగ్/గైడెన్స్ రూమ్ 120 ఎస్ఎఫ్టీ ఉండాలి. కొన్నాళ్లు భౌతికదూరం పాటించేలా.. రాష్ట్రంలోని పాఠశాలలు, కాలేజీల్లోనూ విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు భౌతిక దూరం తప్పనిసరి కావడంతో ఏం చేయాలన్న ఆలోచనల్లో అధికారులు పడ్డారు. ఇప్పటికిప్పుడు అదనపు తరగతి గదులను నిర్మించడం సాధ్యం కాని పరిస్థితి. అయితే వీలైనంత వరకు విద్యార్థుల మధ్య దూరం పాటించేలా చేయాలని భావిస్తోంది. విద్యార్థులను విభజించి షిఫ్ట్ పద్ధతిలో తరగతులను కొనసాగించే ఆలోచన చేస్తోంది. దీనిపై ఇంకా అధికారికంగా చర్చించాల్సి ఉంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ పరిధిలోని హాస్టళ్లలోనూ విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా నిబంధనల రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. -
నారాయణ కాలేజీ సిబ్బంది దాష్టికం
అనంతపురం: పట్టణంలోని నారాయణ కాలేజీ సిబ్బంది విద్యార్థుల పట్ల ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. హాస్టల్లో వసతి, భోజనం సరిగా ఉండడం లేదని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు అధ్యాపకులను నిలదీశారు. దీంతో కంగుతిన్న నారాయణ కాలేజీ ప్రిన్సిపాల్ శిఖామణి, వార్డెన్ మహేష్ సీనియర్ విద్యార్థులతో జూనియర్ విద్యార్థులపై దాడి చేయించారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. జూనియర్ ఇంటర్ విద్యార్థులు పట్టణ పోలీస్‌కు చేరుకొని పోలిసులకు ఫిర్యాదు చేశారు. -
ఓయూలో విద్యార్ధుల ఆందోళన
-
ప్రతి పనికి పైసలివ్వాలి
సాంఘిక సంక్షేమ శాఖకు అవినీతి జబ్బు ఒక్కో హాస్టల్ నుంచి నెలకు రూ.2వేలు వసూలు ప్రొటోకాల్ పేరుతో మరో రూ.500 పదోన్నతికి సప‘రేటు’ రూల్స్! చిన్నచిన్న పొరపాట్లు సహజమంటున్న డీడీ మచిలీపట్నం : సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలోని పిల్లలు అర్ధాకలితో అలమటించినా పట్టించుకోని జిల్లా అధికారులు.. తమకు మామూళ్లు అందడం ఒక్కరోజు ఆలస్యమైనా వెంటనే ప్రతాపాన్ని చూపుతారు. వార్డెన్లపై చిందులేసి ఆకస్మిక తనిఖీలకు బయలుదేరుతారు. హాస్టళ్లలో సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయని పిల్లలు ఆందోళన చేసినా కన్నెత్తి చూడని అధికారులు.. పిల్లలు తక్కువగా ఉన్నారు, పెద్దగా మామూళ్లు ఇవ్వలేమని విన్నవించిన వసతిగృహ సిబ్బందిపై మాత్రం మూడో కన్ను తెరుస్తారు... ఇలా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖకు అవినీతి జబ్బు పట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. చేయి తడిపిన వారికే పనులు చేస్తున్నట్లు సమాచారం. గ్రేడ్-2 వార్డెన్లుగా పనిచేసే వారికి గ్రేడ్-1 వార్డెన్లుగా పదోన్నతి ఇచ్చే అంశంలోనూ పెద్ద మొత్తంలో నగదు చేతులు మారిందనే విమర్శలు వినవస్తున్నాయి. నెలకు రూ. 2వేలు సమర్పించుకోవాల్సిందే.. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 160 వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 15వేల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఒక్కో హాస్టల్లో ఎంత మంది విద్యార్థులు ఉన్నా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారికి మాత్రం నెలకు రూ.1,500లు, డివిజన్ అధికారికి రూ.500 చొప్పున ప్రతి నెలా వార్డెన్లు మామూళ్లు సమర్పించుకోవాల్సి ఉంది. పిల్లల సంఖ్య తక్కువగా ఉందని, నెలకు రూ. 2వేలు చొప్పున ఇవ్వలేమని కోరినా, ఈ మొత్తాన్ని తగ్గించేందుకు అధికారులు అంగీకరించటం లేదని పలువురు వార్డెన్లు వాపోతున్నారు. మరోవైపు ప్రొటోకాల్ పేరుతో ఒక్కో హాస్టల్ నుంచి నెలకు రూ.500 చొప్పున వసూలు చేస్తున్నారు. ఎవరైనా వార్డెన్లు సకాలంలో నగదు చెల్లించకపోతే వారికి మెమోలు ఇవ్వటం, ఆకస్మిక తనిఖీలతో ఇబ్బందులు పెట్టడం రివాజుగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. పదోన్నతుల్లో కిరికిరి సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న వార్డెన్లకు ప్రతి సంవత్సరం పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది. గ్రేడ్-2 వార్డెన్లుగా పనిచేస్తున్న వారికి గ్రేడ్-1గా పదోన్నతి ఇచ్చేందుకు అనేక నిబంధనలు ఉన్నాయి. సీనియార్టీ ప్రకారం డిపార్ట్మెంటల్ టెస్టులు రాసి అర్హత పొందిన వారికి పదోన్నతులు ఇవ్వాలి. అయితే, ఈ శాఖ అధికారులు తమను ప్రసన్నం చేసుకున్న వారినే పదోన్నతుల జాబితాలో చేర్చారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు యూనియన్ నాయకులు కూడా చక్రం తిప్పి తమ అనుయాయులకు పదోన్నతుల కోసం తెరవెనుక మంత్రాంగం నడిపారనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో ఒక్కొక్కరి నుంచి రూ.50వేల వరకు వసూలు చేసినట్లు సమాచారం. అధికారులు ఇష్టానుసారంగా తయారు చేసి పంపిన జాబితాపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో ఆ ఫైలును వెనక్కి పంపినట్లు తెలిసింది. మరోసారి సక్రమంగా ఫైలును తయారు చేసి పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. 15 నెలలుగా అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు లేవు సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందికి 15 నెలలుగా వేతనాలు అందలేదు. తమకు వేతనాలు అందించాలని అవుట్ సోర్సింగ్ సిబ్బంది పలుమార్లు అధికారులను కోరినా ఫలితం లేకపోయింది. ఆరోపణలు సహజం సాంఘిక సంక్షేమ శాఖలో చిన్న, చిన్న పొరపాట్లు జరగవచ్చు. వీటిని భూతద్దంలో చూపుతూ కొందరు ప్రచారం చేస్తున్నారు. సాంఘిక సంక్షేమ శాఖను అల్లరిపాలు చేస్తున్నారు. ప్రతి నెల మామూళ్లు వసూలు చేయటం అవాస్తవం. వార్డెన్లకు పదోన్నతులు ఇచ్చే అంశంలో నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించాం. -మధుసూదనరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ -
మో‘డల్’ స్కూళ్లు
సాక్షి, మంచిర్యాల : జిల్లాలోని 14 మండలాలకు 2012-13 విద్యాసంవత్సరానికి మొదటిదశలో మోడల్ స్కూళ్లు మంజూరయ్యాయి. అయితే ఏ ఒక్కచోట పాఠశాల ప్రారంభం కాలేదు. 2013-14లో గదుల నిర్మాణం కాకపోయినప్పటికీ తాత్కాలికంగా తరగతులు ప్రారంభించారు. సమీపంలోని పాఠశాలల్లో తరగ తులను కొనసాగించేలా ఏర్పాట్లు చేశారు. ఇలా ఏడు మండలాల్లో తరగతులు కొనసాగుతున్నాయి. మిగతా ఏడు ఆదర్శ పాఠశాలల్లో ఈ ఏడాది కూడా ప్రవేశాలు ప్రశ్నార్థకంగా మారనున్నాయి. అడ్మిషన్ల ప్రక్రియలో వీటికి భాగస్వామ్యం కల్పించలేదు. వసతి గృహాలేవి? తరగతి గదుల నిర్మాణం పూర్తయ్యే దశకు వచ్చినప్పటికీ హాస్టళ్ల నిర్మాణం మాత్రం ఎక్కడా ప్రారంభం కాలేదు. గదులు లేకపోవడంతో గతేడాది ప్రవేశాలు కల్పించలేదు. మోడల్ స్కూల్ విధానంలో పాఠశాల, హాస్టల్ ఉండాలి. హాస్టల్లో కేవలం బాలికల కే వసతి ఉంటుంది. హాస్టల్ వసతి లేక పోవడంతో దూరప్రాంతాల వారు పాఠశాలకు వచ్చేందుకు ఆసక్తి చూపడంలేదు. మరోవైపు ఈ సమస్యతో డ్రాపౌట్లు పెరుగుతున్నాయి. పెరిగిన స్టీల్, సిమెంట్ ధరలను సాకుగా చూయించి రీ టెండర్ పిలిచేలా ఒత్తిడి తీసుకురావచ్చనే ఆలోచనతో కొందరు కాంట్రాక్టర్లు ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తికాని నియామకాలు ఆదర్శ పాఠశాల మొదటిదశ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియలో మొదటిదశలో భాగంగా 2013 జూన్‌లో పదిమంది పీజీటీలను తొలుత ఆయా పాఠశాలలకు నియమించారు. వేతన భద్రత లేకపోవడంతో ఐదు నుంచి ఆరుగురు మాత్రమే విధుల్లో చేరారు. తర్వాత 2013 నవంబర్‌లో స్కూలుకు ఆరుగురు టీజీటీల చొప్పున ఎంపిక చేయగా ముగ్గురు నుంచి నలుగురు చొప్పున విధుల్లో చేరారు. పాఠశాలకు 10 మంది పీజీటీలతో పాటు ఆరుగురు టీజీటీలు విధులు నిర్వర్తించాలి. కంప్యూటర్ ఆపరేటర్, వాచ్‌మన్, పీఈటీ, ఆఫీస్ సబార్డినేట్లను ఆయా పాఠశాలలకు ఔట్సోర్సింగ్ విధానంలో ఎంపిక చేశారు. వీరిని 2014 మార్చి మొదటివారంలో నియమించడంతో వీరి సేవలు పూర్తిస్థాయిలో ఉపయోగపడలేదు. అంతేకాకుండా పీఈటీ, ఆఫీస్ సబార్డినేట్లను ఏప్రిల్ చివరివారంలో విధుల్లో నుంచి రిలీవ్ చేశారు. కంప్యూటర్ ఆపరేటర్‌తో అడ్మిషన్ల ప్రక్రియను నిర్వర్తిస్తూ వాచ్‌మన్‌తో ఆయాపాఠశాల భద్రతను కొనసాగిస్తున్నారు. గడిచిన విద్యా సంవత్సరంలో ఆదర్శ పాఠ శాలలోనూ యూనిఫాంల పంపిణీ జరగలేదు. ఉపాధ్యాయుల్లోనూ అభద్రత ఇటీవలే ఉద్యోగాలకు ఎంపికైన యువ ఉపాధ్యాయులు మోడల్ స్కూళ్ల అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు వీరికి సర్వీసు రూల్స్ రాలేదు. దీంతోపాటు 010 పద్దు కింద వేతనాలు ఇవ్వాలని, ఐఆర్ డీఏ చెల్లించాలనే డిమాండ్లు ఉన్నాయి. మూడు డిమాండ్ల సాధనకోసం ఆయావర్గాలు మొర పెట్టుకుంటున్నప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించడంలేదు. పెరుగుతున్న విద్యాభారం! గతేడాది 6,7,8 తరగతులతోపాటు ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులను ఆయా పాఠశాలల్లో నడిపించారు. ఈ ఏడాది తొమ్మిది, ఇంటర్ ద్వితీయ సంవత్సరం తరగతులను అదనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. గదులు లేకపోవడంతో క్లాసులు కొనసాగించడం ఎలా అనే ప్రశ్న తలెత్తుతోంది. భారీగా దరఖాస్తులు 4మోడల్ స్కూళ్లలో సమస్యలు ఉన్నప్పటికీ అందిస్తున్న నాణ్యమైన విద్యపై తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పెద్దఎత్తున దరఖాస్తులు సమర్పిస్తున్నారు. అధికారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తిచేసి నాణ్యమైన విద్య బాలబాలికలకు అందేలా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
టీసీలిస్తే వెళ్లిపోతాం..!
లక్ష్మీదేవిపల్లి(ఖమ్మం), న్యూస్‌లైన్ : కొత్తగూడెంలోని సింగరేణి ఉమెన్స్ జూనియర్ కళాశాల హాస్టల్లో సౌకర్యాలు లేవు.. ఉన్నదే ఒక్క బస్సు.. అందులో సామర్థ్యానికి మించి ఎక్కిస్తున్నారు.. ఈ ఇబ్బందులు మేం భరించలేం.. టీసీలిస్తే వెళ్లిపోతామంటూ విద్యార్థినులు శుక్రవారం కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న సింగరేణి మహిళా కళాశాలలో జూనియ ర్ కళాశాల విద్యార్థినులకు సంబంధించిన హాస్టల్ రామవరంలో ఉంది. దాదాపు 400 మంది విద్యార్థినులను ప్రతిరోజూ ఇక్కడి నుంచి హాస్టల్‌కు తీసుకెళ్లడానికి, కళాశాలకు తీసుకురావడానికి ఒకే ఒక్క బస్సు ఉంది. హాస్టల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేక ఇబ్బందిపడుతున్నామని, వాటి గురించి హాస్టల్ ఇన్చార్జ్ కె.కమల కస్తూరిని అడిగితే అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని విద్యార్థినులు తెలిపారు. ముఖ్యంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, చాలీచాలని భోజనం పెడుతూ, నాణ్యతలేని కూరగాయాలతో వంటలు చేస్తున్నారని తమ వెంట బాక్స్‌లలో తెచ్చుకున్న భోజనాన్ని చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ మొత్తానికి ఒక్కటే ల్యాండ్‌లైన్ ఫోన్ ఉండటంతో తమకోసం తల్లిదండ్రులు ఫోన్లు చేస్తే పక్కన పెట్టేస్తూ సమాచారం ఇవ్వడంలేదని వాపోయారు. ఉన్న ఒక్క బస్సులో సామర్థ్యానికి మించి తరలిస్తున్నారని తెలిపారు. కళాశాలకు ఆలస్యమైతే గైర్హాజరు వేస్తూ సతయిస్తున్నారని చెప్పారు. ఇక్కడ సౌకర్యా లు బాగుంటాయని ప్రచారం చేయడంతో వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మంతోపాటు నల్గొండ, విశాఖపట్నం జిల్లాల నుంచి వచ్చామని, తీరా చేరిన తరువా త ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. అసౌకర్యాల మధ్య ఉండలేం.. తక్షణం టీసీలు ఇస్తే వెళ్లిపోతామని చెప్పారు. మనస్థాపానికి గురవుతున్నారు : కె.మల్లేశ్వరి, టీజాగృతి జిల్లా కన్వీనర్ గురువారం రాత్రి కొందరు విద్యార్థినులు ఫోన్ చేసి.. ఇక్కడ ఉండలేకపోతున్నామని, ఒక విద్యార్థిని హాస్టల్ పైనుంచి దూకడానికి పూనుకుందని చెప్పడంతో తాను హాస్టల్‌కు వస్తానని చెప్పినట్లు తెలంగాణ జాగృతి జిల్లా మహిళా కన్వీనర్ కె.మల్లేశ్వరికి పేర్కొన్నారు. విద్యార్థిను లు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకుని మల్లేశ్వరి తోపాటు టీఆర్ఎస్ జిల్లా మహిళా కన్వీనర్ పిట్టల కమ ల, జాగృతి స్టేట్ కో-ఆర్డినేటర్ బండారు సాగర్, జిల్లా కో-కన్వీనర్ రమేష్ అక్కడికి చేరుకున్నారు. విద్యార్థినుల ను వివరాలు అడిగి తెలుసుకున్నాక సింగరేణి ఎడ్యుకేష న్ జీఎం వై.వెంకటేశ్వర్లు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కమలారాణిలతో మాట్లాడారు. ఈ విషయంపై ఎడ్యుకేషనల్ జీఎంను‘న్యూస్‌లై న్’ వివరణ కోరగా విద్యార్థినుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.