లక్ష్మీదేవిపల్లి(ఖమ్మం), న్యూస్‌లైన్ :
కొత్తగూడెంలోని సింగరేణి ఉమెన్స్ జూనియర్ కళాశాల హాస్టల్‌లో సౌకర్యాలు లేవు.. ఉన్నదే ఒక్క బస్సు.. అందులో సామర్థ్యానికి మించి ఎక్కిస్తున్నారు.. ఈ ఇబ్బందులు మేం భరించలేం.. టీసీలిస్తే వెళ్లిపోతామంటూ విద్యార్థినులు శుక్రవారం కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న సింగరేణి మహిళా కళాశాలలో జూనియ ర్ కళాశాల విద్యార్థినులకు సంబంధించిన హాస్టల్ రామవరంలో ఉంది. దాదాపు 400 మంది విద్యార్థినులను ప్రతిరోజూ ఇక్కడి నుంచి హాస్టల్‌కు తీసుకెళ్లడానికి, కళాశాలకు తీసుకురావడానికి ఒకే ఒక్క బస్సు ఉంది.
హాస్టల్‌లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేక ఇబ్బందిపడుతున్నామని, వాటి గురించి హాస్టల్ ఇన్‌చార్జ్ కె.కమల కస్తూరిని అడిగితే అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని విద్యార్థినులు తెలిపారు. ముఖ్యంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, చాలీచాలని భోజనం పెడుతూ, నాణ్యతలేని కూరగాయాలతో వంటలు చేస్తున్నారని తమ వెంట బాక్స్‌లలో తెచ్చుకున్న భోజనాన్ని చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ మొత్తానికి ఒక్కటే ల్యాండ్‌లైన్ ఫోన్ ఉండటంతో తమకోసం తల్లిదండ్రులు ఫోన్లు చేస్తే పక్కన పెట్టేస్తూ సమాచారం ఇవ్వడంలేదని వాపోయారు. ఉన్న ఒక్క బస్సులో సామర్థ్యానికి మించి తరలిస్తున్నారని తెలిపారు. కళాశాలకు ఆలస్యమైతే గైర్హాజరు వేస్తూ సతయిస్తున్నారని చెప్పారు. ఇక్కడ సౌకర్యా లు బాగుంటాయని ప్రచారం చేయడంతో వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మంతోపాటు నల్గొండ, విశాఖపట్నం జిల్లాల నుంచి వచ్చామని, తీరా చేరిన తరువా త ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. అసౌకర్యాల మధ్య ఉండలేం.. తక్షణం టీసీలు ఇస్తే వెళ్లిపోతామని చెప్పారు.
మనస్థాపానికి గురవుతున్నారు : కె.మల్లేశ్వరి, టీజాగృతి జిల్లా కన్వీనర్
గురువారం రాత్రి కొందరు విద్యార్థినులు ఫోన్ చేసి.. ఇక్కడ ఉండలేకపోతున్నామని, ఒక విద్యార్థిని హాస్టల్ పైనుంచి దూకడానికి పూనుకుందని చెప్పడంతో తాను హాస్టల్‌కు వస్తానని చెప్పినట్లు తెలంగాణ జాగృతి జిల్లా మహిళా కన్వీనర్ కె.మల్లేశ్వరికి పేర్కొన్నారు. విద్యార్థిను లు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకుని మల్లేశ్వరి తోపాటు టీఆర్‌ఎస్ జిల్లా మహిళా కన్వీనర్ పిట్టల కమ ల, జాగృతి స్టేట్ కో-ఆర్డినేటర్ బండారు సాగర్, జిల్లా కో-కన్వీనర్ రమేష్ అక్కడికి చేరుకున్నారు. విద్యార్థినుల ను వివరాలు అడిగి తెలుసుకున్నాక సింగరేణి ఎడ్యుకేష న్ జీఎం వై.వెంకటేశ్వర్లు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కమలారాణిలతో మాట్లాడారు. ఈ విషయంపై ఎడ్యుకేషనల్ జీఎంను‘న్యూస్‌లై న్’ వివరణ కోరగా విద్యార్థినుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
టీసీలిస్తే వెళ్లిపోతాం..!
Published Sat, Sep 7 2013 3:16 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
Advertisement
Advertisement