చండీగఢ్‌ను పరిశీలించిన నారాయణ బృందం
సాక్షి, అమరావతి: చండీగఢ్ నగర ప్రణాళిక, నిర్మాణం, భవనాల ఆకృతులను రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ బృందం పరిశీలించింది. పురపాలక మంత్రి నారాయణ నేతృత్వంలోని సిఆర్డీఏ బృందం పంజాబ్, హరియాణాల రాజధాని నగరం చండీగఢ్‌లో గురువారం ఒక రోజు పర్యటన చేసింది. అక్కడి పట్టణ ప్రణాళిక మీద నిపుణులు, స్థానిక అధికారులతో బృందం సమావేశమైంది. అనంతరం బృంద సభ్యులు చండీగఢ్ లో నిర్మించిన పంజాబ్, హరియాల అసెంబ్లీ భవనాలు, సచివాలయ భవనాలను, సిటీ మ్యూజియంలో ఏర్పాటు చేసిన చండీగఢ్ పట్టణ ప్రణాళిక నమూనాలను కూడా పరిశీలించారు.