minister p narayana
-
చండీగఢ్‌ను పరిశీలించిన నారాయణ బృందం
సాక్షి, అమరావతి: చండీగఢ్ నగర ప్రణాళిక, నిర్మాణం, భవనాల ఆకృతులను రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ బృందం పరిశీలించింది. పురపాలక మంత్రి నారాయణ నేతృత్వంలోని సిఆర్డీఏ బృందం పంజాబ్, హరియాణాల రాజధాని నగరం చండీగఢ్‌లో గురువారం ఒక రోజు పర్యటన చేసింది. అక్కడి పట్టణ ప్రణాళిక మీద నిపుణులు, స్థానిక అధికారులతో బృందం సమావేశమైంది. అనంతరం బృంద సభ్యులు చండీగఢ్ లో నిర్మించిన పంజాబ్, హరియాల అసెంబ్లీ భవనాలు, సచివాలయ భవనాలను, సిటీ మ్యూజియంలో ఏర్పాటు చేసిన చండీగఢ్ పట్టణ ప్రణాళిక నమూనాలను కూడా పరిశీలించారు. -
టీడీపీ నేతల గురించి అలా అనలేదు: మంత్రి నారాయణ
విజయవాడ: టీడీపీలోని అందరు నేతలతోనూ తాను మంచి సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. విజయవాడలో ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా తుని ఘటనలో టీడీపీ నేతలు ఉన్నట్లు తాను చెప్పలేదని మంత్రి అన్నారు. రోడ్ల విస్తరణ కారణంగా 1000 ఇళ్లను తొలగించాల్సి ఉందని.. ఈ నెల 15వ తేదీలోగా మాస్టర్ల ప్లాన్ పూర్తి అవుతుందని తెలిపారు. ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్, మాస్టర్ ప్లాన్ కు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇప్పటివరకు 13 గ్రామాల్లో పర్యటించి ఇళ్లు కోల్పోతున్నవారిలో 90 శాతం మందికి నచ్చజెప్పినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్ ఖారారయిన తర్వాతే ఇళ్ల తొలగింపు చేపడతామని నారాయణ పేర్కొన్నారు. ఇళ్లను తొలగిస్తున్నారంటూ ఎమ్మెల్యే ఆర్కే ప్రజలను రెచ్చగొట్టడం సరికాదన్నారు. చెప్పని మాటలు ప్రచారం చేయడం సమంజసం కాదని చెప్పారు. ఒక వర్గానికి తనను దూరం చేసేందుకే తనపై దుష్రచారం చేస్తున్నారంటూ మంత్రి నారాయణ మండిపడ్డారు. -
110 పట్టణాల్లో ట్రీట్మెంట్ ప్లాంట్లు
అరండల్‌పేట(గుంటూరు): రాష్ట్రంలోని 110 పట్టణాల్లో ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. ముఖ్య నగరాల్లో భూగర్భ డ్రైనేజీ పనులను సైతం అభివృద్ధి చేస్తామన్నారు. శుక్రవారం గుంటూరులోని సుద్ధపల్లి డొంకలోని సీవరేజ్ ట్రీట్మెంట్ప్లాంట్ను పరిశీలించిన సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా రాష్ట్రంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, సాలిడ్‌వేస్ట్‌మేనేజ్‌మెంట్, లిక్విడ్‌వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా కూడా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. -
అంతన్నారు..ఇంతన్నారు..
► అమరావతి రాజధాని ప్రాంతంలోని 23 వేల మంది రైతులకు ఒకేసారి లక్షన్నర రూపాయల రుణమాఫీ.. అది కూడా 72 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి మార్చి తిరిగి హైదరాబాద్ వెళతా.. ఇది రాష్ర్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు గురువారం చేసిన బహిరంగ ప్రకటన. ఇది ఆచరణ సాధ్యం కాలేదు. ► మంగళవారానికల్లా దాదాపు 7500 మంది రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ మొత్తం జమ చేస్తాం.. రాష్ర్ట మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ మాటలు. ఇది పాతపాటేనంటున్న రాజధాని రైతులు. తాడికొండ : మంత్రులు, అధికారుల ప్రకటనలు రాజధాని రైతులను రుణమాఫీ విషయంలో అయోమయానికి గురిచేస్తున్నాయి. చెప్పే మాటలకు క్షేత్రస్థాయిలో అమలు తీరుకు పొంతన లేకపోవడంతో ఎవరి మాటలు నమ్మాలో అర్ధంకాని స్థితి నెలకొంది. 7500 మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ మొత్తం జమ చేసినట్లు నెల రోజుల క్రితమే ప్రకటించిన మంత్రి మళ్లీ అదే ప్రకటనను చేయడం విడ్డూరం. అంతేకాక నెలాఖరుకు రైతుల ఖాతాల్లో నూరుశాతం రుణమాఫీ నగదు జమ చేస్తామని ప్రకటించిన మంత్రుల మాటలపై రైతులకు అనుమానం కలుగుతోంది. రాష్ర్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో 30 బ్యాంకుల పరిధిలో తిరిగి రుణమాఫీపై పరిశీలించారు. అయినా నేటికీ ఈ ప్రక్రియ ఒక కొలిక్కి రాలేదు. దీంతో రైతులు మళ్లీ కౌలు డీడీలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. రైతులను భూ సమీకరణ దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వేసిన ఎత్తుగడ విఫలమవుతోంది. కొద్దిరోజుల క్రితం వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ తుళ్లూరులో రాజధాని రైతులకు సింగిల్ టైం రూ.1.5 లక్షల రుణమాఫీ జరుగుతున్నట్లు ప్రకటించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా బ్యాంకర్లతో చర్చించామని నేడో రేపో బ్యాంకుల్లో ఆయా రైతుల ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము జమ అవుతుందని చెప్పారు. కానీ మంత్రుల మాటలు నీటిమీద రాతలే అయ్యాయి. రైతులు మాత్రం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికి కేవలం 7,500 మందికి రుణమాఫీ జమచేస్తే మిగతా 15,500 మంది రైతులకు ఎప్పటికి చేస్తారన్న ప్రశ్న రైతుల్లో వ్యక్తమవుతోంది. పూటకో ప్రకటనతో రైతుల్ని గందరగోళపర్చకుండా వ్యవసాయ రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
పరిహార భూములు ఎక్కడిస్తారు?
మంత్రి నారాయణను నిలదీసిన ఎర్రబాలెం రైతులు మంగళగిరి: ‘మా భూములకు బదులుగా ప్రభుత్వమిచ్చే భూములు ఎక్కడ కేటాయిస్తారు?. మా గ్రామ రైతులందరికీ ఒకే చోట కేటాయిస్తారా? లేక ఒక్కొక్కరికి వేర్వేరు చోట్ల ఇస్తారా?. ఈ విషయాల్ని అగ్రిమెంట్లో ఎందుకు చేర్చలేదు?. అగ్రిమెంట్ చేసుకుని.. కౌలు చెక్కు తీసుకున్న తర్వాత రైతుకు ఎలాంటి హక్కు లేదంటే మా పరిస్థితేంటి?.’ అని రైతులు రాష్ట్ర మంత్రి పి.నారాయణ వద్ద ప్రశ్నల వర్షం కురిపించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం రైతులకు కౌలు చెక్కులు అందజేసిన మంత్రి.. భూముల్ని చదును చేసేందుకు పొలాల్లోకి చేరుకున్నారు. దీంతో అక్కడికి వచ్చిన రైతులు తమ ప్రశ్నలతో మంత్రిని ఉక్కిరిబిక్కిరి చేశారు. వారి ప్రశ్నలకు నీళ్లు నమిలిన మంత్రి.. ‘మమ్మల్ని, చంద్రబాబును నమ్మండి. రైతులకు అన్యాయం చేయం’ అని అన్నారు. ‘రుణమాఫీ వ్యవహారంతో సీఎం చంద్రబాబుపై నమ్మకం పోయింది. ఇప్పుడెలా నమ్మాలి’ అని రైతులు ప్రశ్నించడంతో మంత్రి వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు. నా భూమి దగ్గరకొస్తే ఆత్మహత్య చేసుకుంటా: రైతు రాఘవరావు భూసమీకరణ గడువు చివరి రోజుల్లో.. మంత్రి నారాయణ నాటకాలాడి రైతులను భయపెట్టినందునే అంగీకారపత్రాలు ఇచ్చామని ఎర్రబాలెం రైతు రాఘవరావు వెల్లడించారు. ఇప్పుడు కౌలు చెక్కులు, భూముల చదును పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని మండిపడ్డారు. చదును పేరుతో తనభూమి వద్దకు వస్తే మానవబాంబుగా మారి ఆత్మహత్య చేసుకుంటాని హెచ్చరించారు. భూముల గురించి నారాయణకు ఏం తెలుసని ప్రశ్నించారు. స్కూళ్లలో పేద పిల్లల వద్ద ఫీజులు గుంజడం నేర్చుకుని.. అదే విద్యను పేద రైతులపై చూపిస్తున్నారని విమర్శించారు. ఫీజులు వసూలు చేయడంలో నారాయణ దిట్ట కనుకే.. భూములు లాక్కొస్తారని చంద్రబాబు ఆయనను రాజధాని గ్రామాల్లో తిప్పుతున్నారని ఆరోపించారు. -
టీపీ గూడూరును దత్తత తీసుకుంటా
కొడవలూరు: ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య ఆయన స్వగ్రామాన్ని దత్తత తీసుకుని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేయలనుకోవడం ప్రశంసనీయమని, ఆయన స్ఫూర్తితో తన స్వగ్రామమైన తోటపల్లిగూడూరును దత్తత తీసుకుని ఆయనతో పోటీపడి అభివృద్ధి చేస్తానని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. మండలంలోని వెంకన్నపురంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపాధి శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవానికి సోమవారం ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వగ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కృష్ణయ్య అద్భుతమైన ప్రణాళిక రూపొందించారన్నారు. టీపీగూడూరును కూడా కృష్ణయ్య సూచనలు, సలహాల మేరకే అభివృద్ధి చేస్తానన్నారు. జిల్లాలో ఉన్న గ్రామాల్లో తొంబై శాతం గ్రామాలను దత్తత తీసుకొనేలా చేయడం బాధ్యతగా పెట్టుకొన్నట్లు తెలిపారు. దత్తత తీసుకొన్న గ్రామాలకు సొంత నిధులు వెచ్చించాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రభుత్వ పథకాలు గ్రామంలో వంద శాతం అమలయ్యేలా చేస్తే చాలన్నారు. దత్తత తీసుకొన్న గ్రామ అభివృద్ధికి కృష్ణయ్య అనుసరిస్తున్న విధానం అందరికీ ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమానికి ఆయనను అంబాసిడర్‌గా పెట్టుకుంటామన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సింగపూర్, జపాన్ల నుంచి పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారని తెలిపారు. జిల్లాలో పోర్టు ఉండడమే ఇందుకు కారణమని చెప్పారు. సీఎం సహకారంతో జిల్లాను పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. సుగ్రామంలో మంచి మనుషులుండాలి ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రతిఒక్కరూ గ్రామాభివృద్ధికి తమవంతు సహకారం అందించినపుడే ఏ గ్రామమైనా సుగ్రామమవుతుందన్నారు. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో వసతులు దుర్భరంగా ఉన్నాయన్నారు. నిర్వహణ లోపంతోనే ఈ దుస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసేలా మంత్రి కృషి చేయాలని కోరారు. రూ.2 కోట్ల జెడ్పీ నిధులతో జిల్లాలోని 50 పాఠశాలల్లో వసతులు మెరుగు పరుస్తున్నట్లు తెలిపారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కలెక్టర్ ఎం.జానకి, ఎమ్మెల్యేలు పి.శ్రీనివాసులురెడ్డి, కె.రామకృష్ణ, రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభాహైమావతి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దుర్గాప్రసాదరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర మాట్లాడారు. అభివృద్ధికి శ్రీకారం కొడవలూరు: వెంకన్నపురాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించక ముందు నుంచే కృష్ణయ్య పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందుకోసం ఒక ప్రణాళిక రూపొందించారు. రైతుల ధాన్యాన్ని కోసిన వెంటనే అమ్ముకోకుండా గోదాముల్లో భద్రపరచుకుని మంచి ధర వచ్చినపుడు అమ్ముకునేలా చేసేందుకు గ్రామంలో గిడ్డంగుల నిర్మాణానికి కృషిచేస్తున్నారు. పాడి పరిశ్రమను అభివృద్ధి చేసి పాల ఉత్పత్తిని పెంచడంతోపాటు గ్రామంలోనే విక్రయించుకునేలా చర్యలు మొదలుపెట్టారు. ప్రశంసల జల్లు స్వగ్రామ అభివృద్ధికి కృష్ణయ్య రూపొందించిన ప్రణాళిక, చేస్తున్న కృషికి మంత్రి నారాయణ, కలెక్టర్ జానకితోసహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని తామంతా దత్తత గ్రామాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.