సాక్షి, అమరావతి/అనంతపురం విద్య: కోవిడ్–19 పరీక్ష, చికిత్స విషయంలో నూతన ఆవిష్కరణలపై జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ (ఎన్ఆర్డీసీ) నిర్వహించిన పోటీలో ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు ఆవిష్కరణలకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. అనంతపురంలోని శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్ఆర్ఐటీ), ఏలూరులోని రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ ఘనత సాధించాయి. ఎస్ఆర్ఐటీ ఆవిష్కరణ శింగనమల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో రూపొందించినది కావడం విశేషం. ఓ ఎమ్మెల్యే ఇలాంటి ఆవిష్కరణ చేయడం దేశ చరిత్రలోనే మొట్టమొదటిది. దేశ వ్యాప్తంగా జరిగిన పోటీకి వేలాది దరఖాస్తులురాగా 16 ఆవిష్కరణలను విజేతలుగా ప్రకటించారు. ఎన్ఆర్డీసీ సీఎండీ హెచ్.పురుషోత్తం గురువారం విజేతలను ప్రకటించారు.
ఎమ్మెల్యే ఆవిష్కరణ విశేషమేమంటే..
► ఎంటెక్ చదివిన ఎమ్మెల్యే పద్మావతి.. వైద్య సిబ్బందికి కరోనా సోకకుండా ఉండే క్యాబిన్ రూపొందించారు.
► ఎలాంటి రక్షణ కవచాలు లేకపోయినా డాక్టర్లు క్యాబిన్లోకి ప్రవేశించిన తర్వాత సురక్షితమైన వాతావరణంలో ఉంటారు. వైరస్ చొరబడటానికి అవకాశం లేకుండా ఆ క్యాబిన్ ఉంటుంది.
► పారదర్శకంగా ఉండి కదిలే ఈ క్యాబిన్ నుంచే వారు రోగులకు సేవలు అందించవచ్చు. వార్డుల్లో క్యాబిన్‌తో పాటు స్వేచ్ఛగా తిరగవచ్చు.
► డాక్టర్ క్యాబిన్ నుంచి బయటకు వచ్చాక అది ఆటోమేటిగ్గా శానిటైజ్ అవుతుంది. తరువాత వేరొకరు ఆ క్యాబిన్ ద్వారా సేవలందించవచ్చు.
► ఇక రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.. విస్తారమైన బహిరంగ ప్రదేశాల్లో క్రిమిసంహారక మందును అధిక సామర్థ్యంతో స్ప్రే చేయగల ఆటోమేటిక్ యంత్రాన్ని రూపొందించింది.
ఎమ్మెల్యే పద్మావతి ఆవిష్కరణకు జాతీయ స్థాయి గుర్తింపు
Published Sat, Jul 18 2020 4:24 AM | Last Updated on Sat, Jul 18 2020 4:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment