jonnalagadda padmavati
-
ఎల్లో మీడియా వక్రీకరించింది
సాక్షి, అమరావతి: సమస్యల పరిష్కారంపై స్థానిక అధికారులు సక్రమంగా స్పందించడం లేదనే ఆవేదనతో ఫేస్బుక్ లైవ్‌లో నీటి కేటాయింపులపై తాను మాట్లాడిన మాటలను ఎల్లో మీడియా వక్రీకరించిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్యావతి మండిపడ్డారు. తాను ప్రశ్నించింది అధికారులనైతే సీఎం జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడినట్లు ఎల్లో మీడియా చిత్రీకరించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లా స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలపై అధికారులు స్పందించనప్పుడు సీఎం జగనన్న దగ్గరకు వెళ్తే పనులు అవుతున్నాయనడంలో తప్పు ఏముందని ప్రశ్నించారు. అదే వీడియోలో జగనన్న స్ఫూర్తితో తామంతా ముందుకెళ్తున్నామని చెప్పానని, మరి వాటిని ఎల్లో మీడియా ఎందుకు హైలెట్ చేయలేదని నిలదీశారు. దళిత మహిళగా నియోజకవర్గ సమస్యలపై ప్రశ్నించడం నేరమా? అని రామోజీని ప్రశ్నించారు. తప్పుడు రాతలు ఆపకుంటే దళిత మహిళల ఆగ్రహం ఎలా ఉంటుందో చవిచూస్తారని హెచ్చరిస్తూ ఈనాడు దినపత్రికను ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చించివేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. పదవి లేకున్నా పార్టీ కోసం పని చేస్తా రాజకీయాల్లోకి ప్రవేశించే సమయంలో తానేదో భారీ స్థాయిలో భవిష్యత్తు ఊహించి రాలేదని ఎమ్మెల్యే పద్మావతి పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు కచ్చితంగా జగనన్నలాంటి నాయకుడితోనే కలిసి పనిచేయాలని కోరుకున్నట్లు చెప్పారు. జగనన్న తనను సొంత చెల్లెలు మాదిరిగా చూసుకున్నారని తెలిపారు. జగనన్న ఆదేశిస్తే ఎలాంటి పదవి లేకున్నా పార్టీ కోసం పని చేస్తానని, తన సీటును వదులుకునేందుకు సైతం సిద్ధమేనని ప్రకటించారు. దేశ చరిత్రలో గుర్తుండిపోయేలా ఎస్సీలకు సీఎం జగన్ మేలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలూ జగనన్న పరిపాలన పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాయని చెప్పారు. ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్ సీపీలోనే పని చేస్తానని తెలిపారు. తనను జగనన్నకు దూరం చేయాలని కుట్రలు చేస్తే ఏ స్థాయి వ్యక్తికైనా తగిన బుద్ధి చెబుతానని హెచ్చరించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలతో దిగజారిపోతున్నారని విమర్శించారు. -
చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారు: జొన్నలగడ్డ పద్మావతి
-
ఎమ్మెల్యే పద్మావతి ఆవిష్కరణకు జాతీయ స్థాయి గుర్తింపు
సాక్షి, అమరావతి/అనంతపురం విద్య: కోవిడ్–19 పరీక్ష, చికిత్స విషయంలో నూతన ఆవిష్కరణలపై జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ (ఎన్ఆర్డీసీ) నిర్వహించిన పోటీలో ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు ఆవిష్కరణలకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. అనంతపురంలోని శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్ఆర్ఐటీ), ఏలూరులోని రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ ఘనత సాధించాయి. ఎస్ఆర్ఐటీ ఆవిష్కరణ శింగనమల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో రూపొందించినది కావడం విశేషం. ఓ ఎమ్మెల్యే ఇలాంటి ఆవిష్కరణ చేయడం దేశ చరిత్రలోనే మొట్టమొదటిది. దేశ వ్యాప్తంగా జరిగిన పోటీకి వేలాది దరఖాస్తులురాగా 16 ఆవిష్కరణలను విజేతలుగా ప్రకటించారు. ఎన్ఆర్డీసీ సీఎండీ హెచ్.పురుషోత్తం గురువారం విజేతలను ప్రకటించారు. ఎమ్మెల్యే ఆవిష్కరణ విశేషమేమంటే.. ► ఎంటెక్ చదివిన ఎమ్మెల్యే పద్మావతి.. వైద్య సిబ్బందికి కరోనా సోకకుండా ఉండే క్యాబిన్ రూపొందించారు. ► ఎలాంటి రక్షణ కవచాలు లేకపోయినా డాక్టర్లు క్యాబిన్లోకి ప్రవేశించిన తర్వాత సురక్షితమైన వాతావరణంలో ఉంటారు. వైరస్ చొరబడటానికి అవకాశం లేకుండా ఆ క్యాబిన్ ఉంటుంది. ► పారదర్శకంగా ఉండి కదిలే ఈ క్యాబిన్ నుంచే వారు రోగులకు సేవలు అందించవచ్చు. వార్డుల్లో క్యాబిన్‌తో పాటు స్వేచ్ఛగా తిరగవచ్చు. ► డాక్టర్ క్యాబిన్ నుంచి బయటకు వచ్చాక అది ఆటోమేటిగ్గా శానిటైజ్ అవుతుంది. తరువాత వేరొకరు ఆ క్యాబిన్ ద్వారా సేవలందించవచ్చు. ► ఇక రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.. విస్తారమైన బహిరంగ ప్రదేశాల్లో క్రిమిసంహారక మందును అధిక సామర్థ్యంతో స్ప్రే చేయగల ఆటోమేటిక్ యంత్రాన్ని రూపొందించింది. -
రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నాం
-
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
-
నువ్వు అనుకుంటే అవ్వుద్ది స్వామి..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై చర్చ సందర్భంగా శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఏదైనా అనుకుంటే దానిని చేసి తీరుతారని పేర్కొంటూ.. ఓ సినిమా డైలాగును ఆమె ఉటంకించారు. ‘నువ్వు అనుకుంటే అవ్వుద్ది స్వామి.. నీ నవ్వు వరం.. నీ కోపం శాపం.. నీ మాట శాసనం’ అంటూ ఆమె పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెలుగులు నింపుతున్నారని అన్నారు. ఇంగ్లిష్ మీడియంలో చదివినంతమాత్రాన తెలుగు రాదనడం సరికాదన్నారు. చంద్రబాబుకు అమరావతి తప్ప మరేమీ కనిపించడం లేదని, ఆయన డ్రామాలు నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ అసలు ఏ మీడియంలో చదువుకున్నారో అర్థం కావడం లేదని, ఆయనకు తెలుగు, ఇంగ్లిష్.. రెండూ రావడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ విద్యపై గగ్గోలు పెడుతున్న నాయకులు తమ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారో చెప్పాలని అడిగారు. చంద్రబాబు మనవడు ఏ స్కూల్లో చదువుతున్నాడని ప్రశ్నించారు. ప్రైవేటు స్కూళ్లలో తెలుగు మాట్లాడితే ఫైన్ వేస్తున్నారని తెలిపారు. విద్యారంగంలో సంస్కరణల వల్ల ఎన్నో మార్పులు వస్తాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఉషాచరణ్ మాట్లాడుతూ.. ప్రపంచంతో పోటీపడాలంటే ఇంగ్లిష్ తప్పనిసరి అని అన్నారు. మన అనుకుంటేనే ప్రజలకు ఏదైనా చేయగలమని, అలా అనుకున్నారు కాబట్టే సీఎం జగన్ ఎన్నో ప్రజాసంక్షేమ పథకాలు చేపడుతున్నారని తెలిపారు. -
అనంతపురంలో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
సాగునీరు అందించడంలో గత ప్రభుత్వం విఫలం
-
సవాల్ చేసి రాలేకపోయిన ఎమ్మెల్యే యామినీబాల
శింగనమల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి – చోటు చేసుకున్న అవినీతి అక్రమాలుపై చర్చకు సిద్దమని చెప్పిన ఎమ్మెల్యే యామినీబాల అడుగు వెనక్కేశారు. వారు చర్చలకు రాకపోగా... వచ్చిన వైఎస్సార్సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతిని పోలీసుల చేత బలవంతంగా అరెస్ట్ చేయించారు. పోలీసుల ఏకపక్ష వైఖరి మరోసారి వివాదాస్పదమైంది. అనంతపురం, శింగనమల : ఎమ్మెల్యే యామినీబాల, వైఎస్సార్సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతిల బహిరంగ చర్చను పోలీసులు భగ్నం చేశారు. హెచ్చెల్సీ ఆయకట్టుకు నీరు విడుదల – నియోజకవర్గంలో నీరు, చెట్టు కింద చేపట్టిన పనుల్లో నిధుల దోపిడీ, ఇసుక అక్రమ రవాణా, కాంట్రాక్టు పనుల్లో తీసుకున్న కమీషన్లతోపాటు ప్రజా సమస్యలు, పలు అంశాలపై వైఎస్సార్సీపీ సమన్వయకర్త, ఎమ్మెల్యే వారం రోజులపాటు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. నార్పలలోని గాంధీ విగ్రహం వద్ద ఈ నెల రెండో తేదీన చర్చించేందుకు వేదికను నిర్ణయించారు. మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు జొన్నలగడ్డ పద్మావతి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రఘునాథరెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ నార్పల సత్యనారాయణరెడ్డి, నాయకులు, కార్యకర్తలు మహాత్మ గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ జాతిపితకు పూలమాల వేసి నివాళులర్పించేందుకు ప్రయత్నించగా డీఎస్పీ వెంకట్రావ్ ఆధ్వర్యంలో గార్లదిన్నె ఎస్ఐ రాంప్రసాద్, స్పెషల్ పార్టీ పోలీసులు అడ్డుకున్నారు. గాంధీకి పూలమాల వేయడానికి, బహిరంగ చర్చలకు అనుమతించాలని కోరినా ససేమిరా అన్నారు. బలవంతంగా సమన్వయకర్తను అరెస్ట్ చేసి గార్లదిన్నెకు తరలించారు. మహిళా పోలీసులు లేకుండానే.. మహిళా పోలీసులు లేకుండానే మగ పోలీసులే సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతిని అరెస్టు చేసి బలవంతగా పోలీస్ జీపులోకి ఎక్కించారు. గార్లదిన్నె ఎస్ఐ రాంప్రసాద్ డ్రైవ్ చేస్తుండగా.. నార్పల కానిస్టేబుల్ దివాకర్ జీప్ ఎడమ వైపు ఫుట్‌బోర్డుపై నిల్చున్నాడు. జీపు వేగంగా వెళ్లడంతో అదుపుతప్పి కిందపడబోతూ.. లోపల ముందుసీటులో కడ్డీ పట్టుకుని కూర్చుని ఉన్న సమన్వయకర్త చేతిని ఆసరా కోసం పట్టుకున్నాడు. వాహనం కొద్దిసేపు అలానే ముం దుకు వెళ్లడంతో పద్మావతి చేయిభుజం వద్ద బెణికింది. ఆమే గనుక ఆసరాగా లేకపోయి ఉంటే కానిస్టేబుల్ జీపు కిందపడి ప్రమాదానికి గురయ్యేవాడు. నొప్పితో విలవిలలాడినా కనికరం లేకపాయె.. భుజం బెణికి నొప్పితో విలవిలలాడుతున్న జొన్నలగడ్డ పద్మావతిని పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. నొప్పి భరించలేకపోతున్నానని ఆమే స్వయంగా చెప్పినా ఎస్ఐ రాంప్రసాద్ స్పందించలేదు. డీఎస్పీ వస్తున్నారని పది నిమిషాలు ఆగండని చెప్పి అరగంటయినా పట్టించుకోలేదు. ఈ సందర్భంగా సమన్వయకర్తను వైఎస్సార్సీపీ నాయకులు పైలా నరసింహయ్య పరామర్శించారు. అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చివరకు సీఐ ప్రసాాద్రావు వచ్చాక ఆమెను అనంతపురంలోని ప్రైవేటు ఆస్పత్రికి పంపించారు. ఆలూరి సాంబశివారెడ్డి హౌస్ ఆరెస్ట్ వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, పార్టీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతిలు బహిరంగ చర్చ కోసం నార్పలకు వెళతారని తెలుసుకున్న పోలీసులు అనంతపురంలోని వారి ఇంటివద్దకు వెళ్లారు. అయితే అప్పటికే పద్మావతి నార్పలకు వెళ్లిపోవడంతో.. ఆలూరి సాంబశివారెడ్డిని ఒకరినే హౌస్ అరెస్ట్‌చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి రాచమర్యాదలు వైఎస్సార్సీపీ సమన్వయకర్త జొన్నల గడ్డ పద్మావతిని అరెస్టు చేసి గార్లదిన్నె పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన గంట తరువాత అనంతపురం నుంచి ఎమ్మెల్యే యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణిలను పోలీసు బెటాలియన్ రాచమర్యాదలతో నార్పలకు తీసుకొచ్చారు. అరగంట పాటు నార్పల క్రాస్‌లో ప్రజాప్రతినిధులు తమ వాహనాలను ఆపి ఇతర మండలాల నాయకులను అక్కడికి పిలిపించుకొని నార్పలలోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ పోలీసులు దగ్గరుండి వారిచేత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేయించారు. అనంతరం అక్కడి నుంచి శింగనమలలో జరిగే ‘యువనేస్తం’ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను పోలీసులు తీసుకెళ్లారు. చర్చ జరిగితే తమ అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని ఎమ్మెల్యే భయపడి పోలీసుల చేత అరెస్ట్ చేయించారని వైఎస్సార్సీపీ నాయకులు విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు నారాయణరెడ్డి, సుధాకరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, అనంతపురం పార్లమెంటు మహిళా అ«ధ్యక్షురాలు బోయ గిరిజమ్మ, బోయ కొండమ్మ, బండి లలిత కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్‌ఆర్‌ఐటీలో సినీతారల సందడి
బుక్కరాయసముద్రం : మండల పరిధిలోని రోటరీపురంలో ఉన్న ఎస్ఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో సినీతారలు సందడి చేశారు. ఎస్ఆర్ఐటీ కాలేజీ చైర్మన్ జొన్నలగడ్డ పద్మావతి, కరస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి కుమారుడు విరాట్ పుట్టిన రోజు సందర్భంగా వేడుకలను నిర్వహించారు. ఫౌండర్ ఆఫ్ వైబ్రంట్ లివింగ్ ఫుడ్స్ ప్రతినిధి శ్రీదేవి జాస్తి, ఇంటర్నేషన్ ఫేస్ యోగా ట్రైనర్ మన్సీ గులాటి, ప్రముఖ సినీనటి అర్చన, యువ హీరో దిలీప్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మొక్కలు నాటారు.