విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: కాలం చెల్లిన బస్సుల స్థానంలో ఆర్టీసీ కొత్త బస్సులను ఏర్పాటు చేస్తోంది. నార్త్ ఈస్ట్‌కోస్టు రీజియన్ పరిధిలో ఏడాది క్రితం 28 బస్సుల కోసం ప్రతిపాదనలు పంపగా 26 బస్సులు మంజూరయ్యాయి. లగ్జరీ సర్వీసుల స్థానాల్లో వీటిని నడుపుతారు. ఇంతవరకూ సంస్థకు బస్సుల అందించే కంపెనీల నుంచి కాకుండా కొత్త కంపెనీలకు చెందిన బస్సులు పంపారు. ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉండే విధంగా సీట్ల మధ్య దూరం, విశాలమైన విండోలతో నూతన బస్సులు రూపొందించారు. ఈ బస్సులను విజయనగరం డిపోకు-6, పలాస-6, శ్రీకాకుళం-14 సర్దుబాటు చేసినట్లు నెక్ ఆర్‌ఎం అప్పన్న తెలిపారు. మరో రెండు బస్సులు ఇంకా రావాల్సి ఉందని, వాటిని విజయనగరం డిపోకి పంపుతామని తెలిపారు. విజయనగరం డిపోకి మంజూరుచేసిన ఆరు బస్సులను విశాఖ-విజయనగరం-విశాఖ నాన్‌స్టాప్ సర్వీసులకు కేటాయించారు.