విజయవాడ-ఏలూరు మధ్య రాజధాని | need vijayawada- eluru as capital | Sakshi
Sakshi News home page

విజయవాడ-ఏలూరు మధ్య రాజధాని

Published Tue, Mar 4 2014 3:27 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

need vijayawada- eluru as capital

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరిన తోట చంద్రశేఖర్
 
 ఏలూరు, న్యూస్‌లైన్ :
 వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే  విజయవాడ-ఏలూరు మధ్య సీమాంధ్ర రాజధాని ఏర్పాటు చేయిచాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తోట చంద్రశేఖర్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ఈ ప్రాంతానికి దగ్గరలో గన్నవరం, రాజమండ్రి విమానాశ్రయాలు, మచిలీపట్నం, కాకినాడ ఓడ రేవులు ఉన్నందున ఈ ప్రాంతాన్ని రాజధాని చేయడం ద్వారా ఏలూ రు మరింత అభివృద్ధి చెందుతుం దని వివరించారు. వైఎస్సార్ జనభేరి సభకు అధ్యక్షత వహించిన చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని 5 పట్టణాల్లో లక్ష ఎకరాల ప్రభుత్వ భూమి, రెండు లక్షల ఎకరాల అటవీ భూమి ఉందన్నారు. దెందులూరు, ఉంగుటూరు, ఏలూ రు, కైకలూరు నియోజకవర్గాల ప్రజలు కొల్లేరు సమస్యతో సతమ తం అవుతున్నారని చెప్పారు. దివంగత నేత వైఎస్ రాజశే ఖరరెడ్డి హయాంలో కొల్లేరును ఐదో కాం టారు నుంచి మూడో కాంటూరుకు కుదించేందుకు అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందిందన్నారు.
 
  పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సత్వర న్యాయం చేయా ల్సి ఉందన్నారు. అధికారంలోకి రాగానే వీటిపై దృష్టి పెట్టాలని జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన విన్నవించారు. అందరి సమస్యలు తీరాలంటే జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు అందరూ నడుం బిగించాలని పిలుపుని చ్చారు. కొన్ని వారాల్లో ఎన్నికలు రానున్నాయని, రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ, సహకరించిన బీజేపీ, మద్దతు ఇచ్చిన టీడీపీ దుష్టచతుష్టయమని, వాటికి ప్రజలు బుద్ధి చెప్పాల్సిన తరుణం వచ్చిందన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణకు అహర్నిశలు కృషిచేసిన జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావటం ఖాయమన్నారు. ఆయననే సీఎంగా ఎందుకు చేయాలనే దానికి మూడు కారణాలున్నాయని చంద్రశేఖర్ వివరిచారు. ైవైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలకు జీవంపోసే శక్తి, సీమాంధ్రను పునర్నిర్మించే సత్తా, కేంద్రం నుంచి రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకురాగల దమ్ము జగన్‌మోహన్‌రెడ్డికే ఉన్నాయని, అందుకే ఆయనే సీఎం కావాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement