దళితులంటే అంత అలుసా? | neglect on sc/st subplan | Sakshi
Sakshi News home page

దళితులంటే అంత అలుసా?

Published Thu, Jan 16 2014 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM

neglect on sc/st subplan

 కలెక్టరేట్, న్యూస్‌లైన్: దళితులంటే అంత అలుసా? వారికి సంక్షేమ పథకాలు అందించడంలేదు, హత్యాచారానికి గురైన బాధితులకు ఎక్స్‌గ్రేషియో చెల్లించడం లేదు, సబ్ ప్లాన్‌ను సక్రమంగా అమలు చేయడంలేదంటూ విజిలెన్‌‌స కమిటీ సభ్యులు మండిపడ్డారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ కలెక్టర్ స్మి తాసబర్వాల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఆర్ సుబ్బారావు ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్నారు.

 ఎస్సీ, ఎస్టీలపై అరాచకం, అత్యాచారాలకు గురైన బాధితులకు సకాలంలో నష్టపరిహారం అం దడం లేదని కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, అర్జునయ్యలు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. బ్యాంక్ రుణాల మంజూ రులోను బ్యాంకర్లు సహకరించడం లేద ని ఆరోపించగా స్పందించిన కలెక్టర్ గత నెల 20న బ్యాంకర్ల సమావేశం నిర్వహించి స్పష్టమైన ఆదేశాలను జారీ చేశామని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 95 శా తం లక్ష్యాన్ని సాధించినట్లు వివరిం చారు.

 ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుపేద వ్యవసాయ కూలీలకు భూమి కొనుగోలులో లబ్ధిదారుల ఎంపికే జరగలేదని గ్రౌండింగ్ ఎప్పటిలోగా పూర్తి చేస్తారని సభ్యులు ప్రశ్నించిగా ప్రభుత్వం నుంచి ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీ రూ.30 వేల నుంచి రూ.లక్షకు పెంచుతూ నిర్ణ యం తీసుకున్న నేపథ్యంలో గ్రౌండింగ్ చేయకుండా నిలిపి వేశామనానరు. ఈ నెల 25వ తేదీలోగా మండల కమిటీలను ఏర్పాటు చేసి వయో నిబంధనల మేరకు కొత్త జాబితాను రూపొందిస్తామన్నారు. ఆర్‌బీఐ నిబంధనల మేరకు ఔత్సాహికులైన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకుఎలాంటి పూచికత్తు లేకుండా బ్యాంక్ రుణాలు ఇవ్వాల్సి ఉన్నా బ్యాం కర్లు సహకరించడం లేదన్నారు.

గజ్వేల్ మండలం రాజిరెడ్డిపల్లిలోని సర్వే నం బరు 138లో సాగులో ఉన్న 18 మంది ఎస్సీ మహిళలపై కేసులు నమోదు చేశారంటూ వెంకటేశ్వర్లు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ప్రభుత్వం నిబంధనల మేరకు ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. దుబ్బాక మండలం చెల్లాపూర్ ఎస్టీ మహిళ ఎస్‌ఐ లెనిన్‌బాబుపై రాష్ట్ర మాన వ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయ గా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని సభ్యులు అధికారుల దృష్టికి తెచ్చా రు. శాఖా పరమైన విచారణ చేపట్టి నివేదికను అందజేయాల్సిందిగా డీఎస్పీని ఆదేశించింది.

 కమిటీ సభ్యుడిగా హ ద్నూర్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్ర హ స్థాపనలో బాధితుల పక్షాన పోలీసుస్టేషన్‌కు వె ళ్లిన తననే కేసులో ఇరికించారని కమిటీ సభ్యులు బాల్‌రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సుబ్బారావు మా ట్లాడుతూ ప్రతివారం నిర్వహించే గ్రామదర్శినిలో పోలీసు అధికారులు పాల్గొం టే స్థానికంగా ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొం టున్న సమస్యలు వారి దృష్టికి వచ్చి పరి ష్కరించే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటి వరకు అట్రాసిటీ కింద 41 కేసు లు నమోదయ్యాయని కమిటీ కన్వీనర్  సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డెరైక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

 బాధితులకు రూ.53లక్షల 25వేలను నష్టపరిహారంగా చెల్లించామన్నారు. సమీక్షలో ఏఎస్పీ మధుసూదన్‌రెడ్డి, కమిటీ సభ్యులు సత్యనారాయణ, గోపాల్, మాణిక్యంతోపాటు డ్వామా పీడీ రవీందర్, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ఎస్‌ఈ విజయ్‌ప్రకాశ్, ఏ పీఎంఐపీ పీడీ రామలక్ష్మీ, డీఎస్పీలు, సీఐలు,  ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement