చచ్చాక ఇస్తారా?
► కొత్త పింఛన్ల మంజూరులో జాప్యం
► ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినవి 10,725
► ఎదురు చూస్తున్న 52 వేల మంది దరఖాస్తుదారులు
ఇతని పేరు గంగయ్య. లేపాక్షి మండలం కుర్లపల్లి. వయసు 70 ఏళ్లకు పైబడి ఉంది. పింఛను కోసం గత ఏడాది జనవరి 12న మొదటి సారిగా అధికారులకు అర్జీ (నంబర్ 129878) ఇచ్చాడు. అప్పటి నుంచి ఇస్తూనే ఉన్నాడు. ముసలి వయసులో ఏ పనీ చేయలేని తనకు కనీసం పింఛ నైనా వస్తే ఆసరాగా ఉంటుందని గంగయ్య చెబుతున్నాడు.
ఈమె పేరు పెద్దక్క.
పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు. ఒక క న్ను పూర్తిగా కనిపించదు. వికలాంగ సర్టిఫికెట్ ఉంటే పింఛన్ ఇస్తామని అధికారులు చెప్పారు. పెద్దాస్పత్రికి వెళ్లి సదరం క్యాంపులో 40 శాతం వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ తెచ్చుకుంది. ఏడాదిన్నర గడిచింది. పింఛన్ గురించి అడిగితే నీ పేరు జాబితాలో ఉందని చెబుతున్నారే తప్ప ఇవ్వడం లేదు.
అనంతపురం అర్బన్ :పేదల సంక్షేమమే ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు రాష్ట్ర మంత్రులు, అధికారపార్టీ ప్రజాప్రతినిధులు వేదికలెక్కి ఊదరగొడుతున్నారు. వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా సామాజిక భద్రత పథకం కింద అందించే పింఛన్లు పేదల దరికి చేరడం లేదు. వీటి కోసంవృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. గతంలో అర్హులైన వారందరికీ పింఛన్లు అందేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. జన్మభూమి కమిటీ సిఫారసు చేసినవారికే దక్కుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన పింఛన్లు జిల్లాలో 10,725 ఉన్నాయి. ఇక దరఖాస్తు చేసుకుని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ జరిగినవి 52 వేల వరకు ఉన్నాయి. వీరంతా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.
ఉన్నవి తొలగించారు.. : ీడీపీ అధికారం చేపట్టిన తరువాత పింఛన్ మొత్తాన్ని రూ.వెయ్యి చేసింది. అప్పటి వరకు జిల్లాలో 4.12 లక్షల మంది పింఛన్ అందుకునే వారు. మొత్తాన్ని పెంచిన తర్వాత ప్రభుత్వం విచారణ చేయించి 1.30 లక్షల పింఛన్లను తొలగించింది. దీంతో లబ్ధిదారుల సంఖ్య 2.82 లక్షలకు తగ్గిపోయింది. ఆ తరువాత విడతలవారీగా 1.05 లక్షల పింఛన్లు మంజూరు చేసింది. ప్రస్తుతం జిల్లాలో మొత్తమ్మీద 3,87,654 మంది పింఛన్ అందుకుంటున్నారు.
జన్మభూమి కమిటీల నిర్వాకం
జిల్లాలో జన్మభూమి కమిటీల నిర్వాకంతో వేలాది మంది పేదలు పింఛన్‌కు దూరమయ్యారు. బత్తలపల్లి మండల కేంద్రంలోనే దాదాపు 200 మంది వృద్ధులు, వికలాంగుల పింఛన్లు రద్దయ్యాయి. వీరంతా మూడు నెలల క్రితం కలెక్టరేట్‌కు తరలివచ్చి జాయింట్ కలెక్టర్-2 సయ్యద్ ఖాజా మొిహ ద్దీన్ వద్ద గోడు వెల్లబోసుకున్నారు.
కొత్త పింఛన్ల ఊసేలేదు
గత ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా కొత్తగా పింఛన్లు మంజూరయ్యేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎవరైనా మరణి ంచినా, వరుసగా కొన్ని నెలలు తీసుకోకున్నా.. అలాంటి వారి పేర్లను తొలగిస్తామని, వారి స్థానంలో కొత్తవాటికి మంజూరు చేస్తామని ఒక అధికారి చెప్పారు.