మళ్లీ చర్చలు విఫలం
Published Tue, Jan 21 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM
బాడంగి, న్యూస్‌లైన్:మండలంలోని ఆకులకట్ట రిజర్వు ఫారెస్టు భూ ముల సరిహద్దు విషయమై అటవీ, రెవెన్యూ శాఖల మధ్య పొంతన కుదరడం లేదు. సోమవారం ఆ రెండు శాఖల అధికారులు తహశీల్దార్ కార్యాలయంలో రెండోసారి జరి పిన చర్చలు కూడా విఫలమయ్యూయి. దీంతో ఈనెల 23 వతేదీకి మళ్లీ చర్చలను వాయిదా వేశారు. అటవీశాఖ వా దన ప్రకారం నోటిఫికేషన్‌లోని సర్వే నంబరు 2-24లోని 73. 36 ఎకరాలు తమ శాఖకు చెందినవిగా వారు చెబుతున్నారు. కాదని రెవెన్యూ శాఖాధికారులు వాదిస్తున్నారు. అటవీ శాఖకు 58 ఎకరాలే చెందుతాయని వారు చెబుతున్నారు. ఈమేరకు ఇరు శాఖల అధికారులు సరిహద్దు మ్యాప్‌లు చూసి వాదులాడుకున్నారు. చివరకు ఈ నెల 23వ తేదీన మరోసారి చర్చలు జరిపి, నేరుగా వివాదానికి కారణమైన భూములవద్దకు వెళ్లి పరిశీలించాలని నిర్ణరుుం చారు. చర్చల్లో పార్వతీపురం ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పి. లక్ష్మీనర్సింహ, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సీబీకే పాత్రుడు, షికారుగంజి ఫారెస్టు బీట్ అధికారి ఎస్.భాస్కరరావు, రెవెన్యూ శాఖకు సంబంధించి జిల్లా సర్వే విభాగం డిప్యూ టీ ఇన్‌స్పెక్టర్ జి.వెంకటరావు, తహశీల్దార్ ఎస్.రమణమూర్తి, హెచ్‌డీటీ కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement